తెలంగాణా కాంగ్రెస్స్ నాయకుడు ఎం సత్యనారాయణ రావు లెక్కన, మనసులో వున్నది అలాగే చెప్పే వైఎస్ రాజశేఖర్ రెడ్డి వీరాభిమాని గోనె ప్రకాశ్ రావు అంటే పార్టీలకతీతంగా ఉంటారు. తాజాగా ఒక తొలి వెలుగు అనే యూట్యూబ్ కోసం ఇచ్చిన ఇంటర్వూలో.. టిడిపి కూటమి 140 ఎమ్మెల్యే సీట్ల వరకు & 19 ఎంపీ స్థానాలు వరకు గెలుచుకోవచ్చు అని కుండబద్దలు కొట్టినట్లు జిల్లాల వారిగా.. విశ్లేషించి మరీ చెప్పారు. శాటిలైట్ ఛానల్‌గా కాకుండ.. కేవలం డిజిటల్ ప్లాట్‌ఫారం ద్వారా మళ్లీ ఆర్ టీవీతో రీఎంట్రీ ఇచ్చిన రవి ప్రకాష్, రెండు తెలుగు రాష్ట్రాల అంచనాలూ ప్రటించారు. లక్ష మందికి పైగా వీక్షించారు ఆ సంచలన విశ్లేషణను. ఏమాత్రం తేడా వచ్చినా రవి ప్రకాష్ క్రెడిబిలిటీ పోతుంది. తాజా ఆర్ టివి ప్రతిష్టను పణంగా పెట్టరు ఎవరూ. కాబట్టి ఆ అంచనాలు నిజమవుతాయి అని సహ మీడియా సహచరుల విశ్లేషణ.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను, అంతకుముందు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కచ్చితంగా అంచనా వేసి చెప్పింది బిగ్ టీవీ. అవి నిజయమయ్యాయి. తాజాగా ఏపీ ఎన్నికలపై అంతే కచ్చితంగా చేసిన సర్వేతో 116 స్థానాల్లో కూటమి గెలుస్తోంది అంటూ ప్రకటించింది. ఇప్పటికే డజనుకు పైగా సర్వే సంస్థలూ కూటమిదే హవా అని తేల్చడం మనకు తెలిసిందే. ధర్మవరంలో ప్రచారానికి వచ్చిన అమిత్ షా గారు చంద్రబాబు గారితో తనకొచ్చిన నివేదికను ప్రస్తావిస్తూ.. మన గత అంచనాలకు మించి ఆంధ్రాలో ఎన్‌డీయే విజయం సాధిస్తుంది అని చెప్పారు. ఇవ్వాళ చంద్రబాబు చాలా ఆనందంగా మోడీ గారితో వేదిక మీద వుండడం.. మోడీ గారు కూడా రాజమండ్రి & అనకాపల్లి సభలలో ఎన్‌డీయే విజయపు అంచనాలను సభలో వెల్లడించడం తెలిసిందే.
ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం కొత్త ఎత్తుగడ! స్క్రీనింగ్ కమిటీ సిఫారస్సులని కలరింగ్!
పులివెందుల నుండి రాష్ట్రం అంతా పోస్టల్ బ్యాలెట్ వేస్తున్న ఉద్యోగులు వైకాపా ఇచ్చే డబ్బులను తీసుకోవడానికి నిరాకరిస్తూ.. చరిత్రలో ఎప్పుడూ లేనత కసిగా, ఓటు కోసం కొట్లాడుతూ.. పోటెత్తడం చూసి వైకాపా శ్రేణులు నిశ్చేష్టులవుతున్నారు. గ్రౌండ్ లెవెల్లో చాలా వేగంగా మారిపోతోన్న పరిస్థితులను చూసి, వైకాపా కార్యకర్తలు & నాయకులు లోకేశ్ లేదా చంద్రబాబు గారి కోసం చూడకుండా.. ఏ చోటా టిడిపి నాయకుడు కనిపించినా.. బ్రతిమాలుకొంటూ కండువాలు కప్పేసుకొంటున్నారు. ఇన్నాళ్లూ రెచ్చిపోయి, ఎటూ వెళ్లలేకుండా వైకాపాలో అనివార్యంగా వుండే నాయకులు, ఈ పరిణామాలు చూస్తూ జీర్ణించుకోలేక ఫ్రస్టేషన్‌తో రెచ్చిపోతూ స్వైరవిహారం చేస్తూ దాడులు చేస్తున్నారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఎన్నికల వేళ ఇలా చెయ్యడం ఆత్మహత్యాసదృశ్యం. అందుకేనేమో పోలీసులు కూడా వైకాపా పోవాలని పట్టించుకోలేదని అనుకొంటున్న వేళ.. జగన్ ఎలా చెబితే అలా విని ఆదేశాలు ఇచ్చే డిజిపి కసిరెడ్డిని ఇసి మార్చడంతో, మన వైకాపా ఓటమిని ఇక దేవుడు దిగివచ్చినా.. ఆపను కష్టం అని మానసికంగా సిద్ధపడుతున్నారు క్రింది స్థాయి కార్యకర్తలు. ఇన్నాళ్లూ భయంతో కొయ్యబారిపొయ్యి, బిగుసుకుపోయిన ప్రజలు కూడా.. గత వారం నుండి పబ్లిక్ బైట్లతో కనిపించే ప్రతి మైకు ముందూ.. వైకాపాను కడిగిపారేస్తున్నారు. మిగిలిన వాళ్లు కూడా ఇప్పుడిప్పుడే గళం విప్పుతున్నారు. వైకాపా నాయకులు చూస్తుండగానే టిడిపి వారితో కలిసి బహిరంగంగా కనిపించడం మొదలెట్టారు. కానీ వైకాపా మీద ప్రజల గొంతుల్లో, మీడియాలలో, సర్వేలలో, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానుల వరకు ఎవరూ ఇవ్వాళ వెళ్లడవుతున్నంత ప్రతికూలత, గత ఎన్నికల్లో టిడిపి మీద ఈ స్థాయిలో లేదు. లోతుగా ఆలోచిస్తూ వైకాపా ఊచకోతకు గురై, కూటమి క్లీన్ స్వీప్ దిశగా వెళుతోంది అనే అంచనాలు వెలువడుతున్నాయి....
ఇవి కూడా చదవండి:
రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త! రైతు భరోసా నిధులు విడుదల!
ఢిల్లీ: జగన్‌కి ఈసీ షాక్! ఇకపై ఇటువంటి తప్పులు!
ఏపీలో ప్రభుత్వ పథకాలకు నిధుల విడుదలకు నో చెప్పిన ఈసీ! ప్రతిపాదనలు పంపిన స్క్రీనింగ్ కమిటీ!
వైసీపీ కు షాక్ ఇచ్చిన ఉద్యోగులు! ట్విస్ట్ అదిరింది!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి