సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్ పై రాళ్ళ దాడి జరిగినా పోలీసుల్లో ఏమాత్రం స్పందన లేదని జనసేన, బీజేపీ బలపరిచిన టీడీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామమోహనరావు అన్నారు. జగన్ కి గులకరాయి తగిలితేనే హాత్యయత్నం కేసు నమోదు చేసి పోలీసులు హడావుడి చేశారన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 5వ డివిజన్ గంగిరెద్దుల దిబ్బ, కల్వరి స్కూల్ అంబేడ్కర్ విగ్రహం దగ్గర సోమవారం ఉదయం జనసేన, బీజేపీ బలపరిచిన టీడీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామమోహనరావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనకు, ఎంపిగా పోటీ చేస్తున్న కేశినేని శివనాథ్కు సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా ఆయన కోరారు.
ఇంకా చదవండి: అనకాపల్లి బెల్లం లా మోడీ తీపి కబురు చెప్పిన మోడీ! అభివృద్ధి చేతకాని, అవినీతి పరుడైన జగన్ జైలుకే! కూటమి ఫుల్ హ్యాపీ!
ఈ సందర్భంగా గద్దె రామమోహనరావు మాట్లాడుతూ బస్సుయాత్ర చేస్తున్న వైఎస్.జగన్మోహ రెడ్డిపై గులకరాయితో దాడి చేశాడని మైనర్ అయిన బీసీ బిడ్డపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని, ఎన్నికల ప్రచారం చేస్తున్న సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్పై రాళ్ళతో దాడి చేస్తే మాత్రం ఏ విధమైన కేసులు లేవన్నారు. ఈ విషయంపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. సాయి ధరమ్ తేజ్ పై రాయి దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డు అయ్యాయన్నారు. అయినా పోలీసులు ఏవిధమైన కేసులు నమోదు చేయలేదన్నారు. అందుకే డీజీపీని బదిలీ చేశారని, మరికొంత మంది పోలీసులను బదిలీ చేయాల్సిఉందన్నారు. ముఖ్యమంత్రి స్థాయి నుంచి వైఎస్సార్సీపీలో కింది స్థాయి వరకు ఉన్న కార్యకర్తలు సంస్కారహీనులు అని అన్నారు. కొండపై ఇళ్ళు నిర్మాణం చేసుకుంటున్న వారి దగ్గర నుంచి బలవంతంగా రూ.40 నుంచి రూ. 50 వేలు డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు రెండు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా కేశినేని శివనాథ్ను గెలిపించాల్సిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సందిపాటి దేవానంద్, ముమ్మనేని ప్రసాద్, అల్లిబిల్లి రామకృష్ణ, జాస్తి సతీష్, గుత్తికొండ కృష్ణమోహన్, తాడి బాబూరావు, కోడూరు సుబ్రమణ్యం, షేక్. ఫరీష్, బండి కోమలి, రామకృష్ణ, దట్టెం దుర్గాప్రసాద్, పాలవలస కోటేశ్వరరావు, పి.శివ తదితరులు పాల్గొన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గోల్డ్ లోన్ తీసుకున్నారా! వడ్డీ ఎక్కువ కట్టించుకునే అవకాశం ఉంది! ఈ జాగ్రత్తలు పాటిస్తే నీకే ఉపయోగ!
కీర్తి సురేష్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా! గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టిన మహానటి!
రూ.6 లక్షలకే కొత్త కారు ఇంటికి! ఆపై రూ.62వేల డిస్కౌంట్! అంతేకాదు వివిధ రకాల బెనిఫిట్స్ కూడా!
జగన్ సతీమణికి మరో చేదు అనుభవం! ఆ ఘటనతో ప్రచారానికి భయపడుతున్న భారతి!
రోజా కి తీవ్రమైన ఎదురుదెబ్బ! ఆమె దెబ్బకి వైసీపీ మొత్తం రాజీనామా!
ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన సుష్మ అందారే! ల్యాండ్ అవుతూ కుప్పకూలిన హెలికాప్టర్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: