ప్రకాశం జిల్లాలో అధికార వైకాపాకు ఉద్యోగులు షాకిస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ ఓట్లను కొల్లగొట్టేందుకు ఆ పార్టీ నేతలు, అభ్యర్థులు ప్రలోభాల వల విసురుతున్నారు. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో వార్డులు, డివిజన్ల వారీగా ఇన్‌ఛార్జిలను నియమించి పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్లను కొల్లగొట్టేందుకు వ్యూహం పన్నారు. గత అయిదేళ్లుగా అధికార పార్టీ అరాచకాలతో ఇబ్బందులు పడిన ఉద్యోగులు మాత్రం వారికి ఓటేసేందుకు ససేమిరా అంటున్నారు.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ప్రకాశం జిల్లాలోని ఒంగోలు నగరం సహా ఇతర నియోజకవర్గాల్లో వైకాపా నాయకులు పోస్టల్‌ బ్యాలట్‌ పోలింగ్‌ కేంద్రాల వద్ద మోహరించారు. ఓటుకు రూ.5 వేలు ఇస్తామంటూ ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అయినా ఉద్యోగ, ఉపాధ్యాయులు తిరస్కరిస్తున్నారు. ఒంగోలు డీఆర్‌ఆర్‌ఎం పాఠశాల వద్ద జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఒక మహిళా ఉద్యోగిని ఓటు వేసేందుకు వెళ్తుండగా.. సమీపంలో ఉన్న వైకాపా నాయకులు ఆమెను ఓటు అభ్యర్థిస్తూ రూ.5 వేలు ఇవ్వబోయారు. ఆ మొత్తాన్ని తిరస్కరించిన ఆమె నేరుగా తెదేపా శిబిరం వద్దకు వచ్చి రూ.పది వేలు అందజేస్తూ ‘ఈ ఎన్నికల్లో ఖర్చులకు వాడండి.. ఇది మీ పార్టీకి నా విరాళం’ అని చెప్పారు. దీంతో వైకాపా నాయకులు కంగుతిన్నారు. అయిదేళ్లూ ఈ ప్రభుత్వాన్ని భరించాం, మరోసారి వైకాపాకు ఓటు వేస్తే మాపై మేం వేటు వేసుకున్నట్లేనని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:   

తక్కువ వడ్డీకే హోమ్ లోన్ కావాలా? టాప్ 5 బ్యాంకుల వివరాలు మీకోసం

యుఏఈ: మోడి గెలుపు కోసం ప్రత్యేక పూజలు! BAPS మందిర్ లో గల్ఫ్ కార్మికులు!

నోటి దుర్వాసన.. ప్రస్తుతం చాలామందిని ఈ సమస్య వేధిస్తోంది! ఇంట్లో దొరికే వాటితోనే ఈజీ టిప్స్ మీకోసం!

రోజాపైనా పృథ్వి ఘాటు వ్యాఖ్యలు! రోజా గోల పడలేక ఆమె భర్త కూడా! అంబటి ఆయన చెల్లెల్ని ఏమైనా పవన్ కు ఇచ్చి పెళ్లి చేశారా!

 Evolve Venture Capital 

జగన్ సతీమణికి మరో చేదు అనుభవం! ఆ ఘటనతో ప్రచారానికి భయపడుతున్న భారతి!

దుబాయ్: ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం! 400 టెర్మినల్ గేట్లతో! దుబాయ్ పాలకుడు X లో అధికారికంగా వెల్లడి!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group