ఆంధ్రప్రదేశ్ లో ఓటర్లకు ఎన్నికలకు సంబంధించిన అవగాహన కల్పించడానికి మరియు సమాచారాన్ని అందించడానికి తోడ్పడే వెబ్ సైట్ ను ఈనెల 5వ తేదీ విజయవాడలో ఎన్నికల నిఘా వేదిక ప్రారంభించింది. కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల అధికారుల, పరిశీలకుల ఫోన్ నెంబర్లు, ఇ మెయిల్, జిల్లా కలెక్టర్ల, జిల్లా ఎస్పీల మరియు నియోజక వర్గాల వారీగా నియమితులైన పరిశీలకుల వివరాలతో వెబ్ సైట్ ను రూపొందించామని ఎన్నికల నిఘా వేదిక కన్వీనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదులను స్వీకరించడం మరియు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని పేర్కొన్నారు. భారత ఎన్నికల సంఘం రూపొందించిన సి విజిల్ ను వినియోగించుకోవాలని కోరారు.
ఇంకా చదవండి: సజ్జల భార్గవరెడ్డిపై వర్ల రామయ్య ఈసీకి ఫిర్యాదు! సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం!
స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగడానికి ఎన్నికల నిఘా వెబ్ సైట్ తోడ్పడుతుందని తెలిపారు. www.apelectionwatch.comవెబ్ సైట్ లో ఎన్నికలకు సంబంధించిన సంపూర్ణ వివరాలను పొందుపరిచామని స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు జరగాలని భావించే రాజకీయ పార్టీలకు, పౌర సంస్థలకు ఈ వెబ్ సైట్ ఉపయోగకరంగా ఉంటుందని దీనిని వినియోగించుకోవాలని ఒక ప్రకటనలో డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. క్షేత్రస్థాయిలో ఎన్నికల సమస్యలను, సంబంధిత ఎన్నికల అధికారి దృష్టికి తీసుకుని వెళ్లడానికి ఎన్నికల నిఘా వేదిక రూపొందించిన వెబ్ సైట్ తోడ్పడుతుందని వివరించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
తమాషా కోసం: జగన్ కి షాక్ ఇస్తున్న ఏపీ ప్రజలు, వైసీపీ ఎమ్మెల్యే..మళ్ళీ అదే కుల రాజకీయాలు!
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
గోల్డ్ లోన్ తీసుకున్నారా! వడ్డీ ఎక్కువ కట్టించుకునే అవకాశం ఉంది! ఈ జాగ్రత్తలు పాటిస్తే నీకే ఉపయోగ!
కీర్తి సురేష్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా! గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టిన మహానటి!
రూ.6 లక్షలకే కొత్త కారు ఇంటికి! ఆపై రూ.62వేల డిస్కౌంట్! అంతేకాదు వివిధ రకాల బెనిఫిట్స్ కూడా!
జగన్ సతీమణికి మరో చేదు అనుభవం! ఆ ఘటనతో ప్రచారానికి భయపడుతున్న భారతి!
రోజా కి తీవ్రమైన ఎదురుదెబ్బ! ఆమె దెబ్బకి వైసీపీ మొత్తం రాజీనామా!
ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన సుష్మ అందారే! ల్యాండ్ అవుతూ కుప్పకూలిన హెలికాప్టర్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: