ఆస్ట్రేలియా లో డొమెస్టిక్ బడ్జెట్ ఎయిర్ లైన్ అయిన బోంజా ఎయిర్ వేస్, తాత్కాలికంగా తమ సేవలను నిలిపివేసింది.

Bonza CEO టీమ్ జోర్డాన్ ఆస్ట్రేలియాలో ఎలా కార్యకలాపాలు కొనసాగించాలనే దానిపై చర్చలు జరుపుతున్నందున ఈరోజు ఎయిర్‌లైన్ సేవలను Bonza తాత్కాలికంగా నిలిపివేసింది అని ఒక ప్రకటన ద్వారా తెలిపారు. దీని వల్ల ఇబ్బంది ఎదుర్కుంటున్న మా కస్టమర్‌లను మేము క్షమాపణలు కోరుతున్నాము. వీలైనంత త్వరగా తిరిగి సేవలు ప్రారంభం అయ్యేలా చూస్తాం అని తెలియచేసారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

గోల్డ్ కోస్ట్ నుండి మాకే, మెల్బోర్న్ (అవలోన్), లాన్సెస్టన్ మరియు ప్రోస్పెరిన్‌లకు సేవలు నిలిపివేయబడ్డాయి. అలాగే సన్‌షైన్ కోస్ట్ నుండి న్యూకాజిల్ మరియు రాక్‌హాంప్టన్‌లకు విమానాలు కూడా నిలిపివేయబడ్డాయి. రాక్‌హ్యాంప్టన్ మరియు గ్లాడ్‌స్టోన్ నుండి మెల్‌బోర్న్‌కు వెళ్లే విమానాలు అలాగే రాక్‌హాంప్టన్‌కు తిరిగి వెళ్లే సర్వీస్ మరియు మెల్‌బోర్న్ నుండి టామ్‌వర్త్ మరియు ఆలిస్ స్ప్రింగ్స్‌లకు మధ్యాహ్న సర్వీసులు కూడా కూడా నేడు (మంగళవారం) తక్కువగా ఉన్నాయి.

ప్రయాణీకులు విమాన సర్వీస్ నిలుపుదల పై నిరాశను వ్యక్తం చేశారు... చాలా మంది ప్రయాణికులు ఈ అంతరాయం గురించి మాకు సమాచారం అందలేదు అని అసహనం వ్యక్తం చేసారు. విమానయాన సంస్థ తన విమానాల సంఖ్యను జాతీయంగా తగ్గించడం ప్రారంభిస్తుందని ప్రకటించిన కొద్ది రోజులకే సస్పెన్షన్ రావడం ఆశ్చర్యంగా అనిపించింది.

మరోవైపు ఈ గందరగోళం మధ్య ప్రధాన పోటీదారు వర్జిన్ ఆస్ట్రేలియా వర్జిన్ విమానాలతో ప్రయాణంలో చిక్కుకున్న అత్యవసర కస్టమర్లను రక్షించడానికి సహాయం చేయనున్నట్లు ప్రకటించింది. బోంజా విమానాల తాత్కాలిక నిలుపుదల గురించి మాకు తెలుసు. ప్రయాణం మధ్యలో చిక్కుకుపోయిన ప్రయాణీకులకు మేము వెంటనే సహాయం చేస్తాము అని వర్జిన్ ఆస్ట్రేలియా X లో పోస్ట్ చేసింది.

ఇవి కూడా చదవండి:

ఆ జాతీయ రహదారి పై ప్రయాణం వద్దండీ! జగన్ మీటింగ్ అంట! అసలే ఎండలు జరా భద్రం 

మంగళగిరి: నేడు (30-4-2024) నారా బ్రాహ్మణి పర్యటన వివరాలు! మహిళలతో సమావేశం 

మంగళగిరిలో కూరగాయల వ్యాపారులకు నారా బ్రాహ్మణి హామీ! మా బతుకులు రోడ్డుకీడ్చారు! 

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పలు కీలక విషయాలు! శృంగారపురం రచ్చబండలో నారా లోకేష్ 

విజయవాడ : పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీకి షాక్! డబుల్ ఇంజన్ సర్కార్ తోనే సుజనా 

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group