'సొంతం' సినిమాతో హీరోయిన్ గా తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైంది నమిత. తొలి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకున్న నమితకు అప్పట్లో యూత్ ఫాలోయింగ్ విపరీతంగా ఉండేది. ఆ తర్వాత వెంకటేశ్ నటించినే 'జెమినీ' సినిమాలో కనిపించింది. తెలుగు, తమిళ భాషల్లో అనేక చిత్రాల్లో నటించిన నమిత.. ఆ తర్వాత కెరీర్ కాస్త డల్ అయ్యింది. బొద్దుగా మారడంతో ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గాయి. దీంతో సెకండ్ హీరోయిన్, స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'బిల్లా' సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా కనిపించిన నమితా.. సింహాలో కనిపించింది.
ఇంకా చదవండి: జగపతిబాబు: రియల్ ఎస్టేట్ రంగంలో నేను కూడా మోసపోయాను! తనను మోసగించిన వాళ్లెవరు? అసలేం జరిగింది?
ఆ చిత్రాల తర్వాత మరో ప్రాజెక్ట్ చేయలేదు. కెరీర్ స్లో అయిన సమయంలో 2017లో వీరేంద్ర చౌదరి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంటకు 2022లో కవల పిల్లలు పుట్టారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న నమిత.. ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఇటీవలే కోలీవుడ్ హీరో విజయ్ దళపతి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. తాజాగా తన వ్యక్తిగత విషయాలు నెట్టింట వైరలవుతున్నాయి. నమిత తన భర్తతో విడిపోతుందని.. త్వరలోనే విడాకులు తీసుకుంటుందని ప్రచారం నడుస్తుంది. ఈ క్రమంలోనే విడాకుల రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది. ‘‘నేను, నా భర్త విడిపోతున్నారు. విడాకులు విడాకులు తీసుకుంటున్నామని వార్తలు వస్తున్నాయి. ఆ రూమర్స్ చూసి నా స్నేహితులు, బంధువులు కాల్ చేసి మమ్మల్ని అడిగారు. కానీ నేను కొద్ది రోజుల క్రితమే నా భర్తతో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాను. అయినా ఇలాంటి నిరాధారమైన వార్తలు ఎందుకు వస్తున్నాయనేది తెలియడం లేదు. కొన్నిసార్లు మా డివోర్స్ గురించి వార్తలు రావడం చూసి నేను నా భర్త కూడా నవ్వుకున్నాం. అలాగే అలాంటి రూమర్స్ చూసి మేం ఏమీ బాధపడటంలేదు’’ అని అన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ ఇంటి మనిషిలా వ్యవహరిస్తున్న సీఎస్! సిట్ విచారణపై నమ్మకం లేదు! ప్రత్తిపాటి కీలక వ్యాఖ్యలు!
విజయనగరం: స్ట్రాంగ్ రూమ్ తెరవటంపై అధికారుల కబుర్లు! కారణాలు చెప్పి తీరాల్సిందే! టిడిపి నేతలు ఫైర్!
చంద్రగిరి మండలం కూచువారిపల్లి గ్రామస్థుల ఆవేదన! దాడులపై వీడియో విడుదల! సామాజిక మాధ్యమాల్లో వైరల్
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు! ఇటీవల జరిగిన విధ్వంసం! జగన్ విదేశీ పర్యటన!
బెంగళూరు నుంచి కొచ్చి బయలుదేరిన విమానం! ఇంజిన్‌లో మంటలు! ప్రమాద సమయంలో విమానంలో 179!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: