Gen Z Style: మీరు కూడా Gen Z తరమా? అయితే, ఇలానే చేస్తున్నారేమో? ఒకసారి చెక్ చేసుకోండి! Dog Breeds Banned: ఈ 6 ప్రమాదకర కుక్కల జాతులపై యజమానులందరికీ కొత్త ఆంక్షలు.. మీ ఇంట్లో ఉంటే జాగ్రత్త సుమీ!! Lifestyle: తాగుబోతుల జాబితాలో తెలుగు రాష్ట్రాలు టాప్‌లో.. నెంబర్ వన్ రాష్ట్రం ఏదంటే? ఆదాయం పన్ను లేని దేశాలు! సంపాదన అంతా మీ సొంతం! కానీ అవి తప్పనిసరి! tradition India: మద్యం, మాంసం, పొగాకు దరిచేరని ఆశ్చర్యమైన గ్రామం... 600 ఏళ్ల సంప్రదాయానికి గిన్నిస్ గుర్తింపు! Health tips: బాల్యంలో పోషకాహారం లోపిస్తే ఏం జరుగుతుందో తెలుసా? – తల్లిదండ్రులు గమనించాల్సిన ముఖ్య సూచనలు ఇవే!! 20 రోజుల్లో బట్టతలపై జుట్టు.. తైవాన్ శాస్త్రవేత్తల సంచలనం వెనుక నిజమెంత.. ప్రచారంలో లొసుగులివే! పని మనిషి అంటే చిన్న జాబ్ అనుకుంటే పొరపాటు.. సాలరీ విన్నాక షాక్ అవుతారు! ఆ నగరంలో ఖరీదైన జీవనశైలి చూసి షాక్ అవుతున్న నెటిజన్లు! Dark chocolate healthy tips: రాత్రిపూట డార్క్ చాక్లెట్ తినొచ్చా? నిపుణుల స్పష్టమైన సమాధానం ఇదే! Colostrum milk benefits: ఆ మూడు రోజుల్లో వచ్చే పాలు ఇంత పవర్‌ఫుల్‌నా? జున్ను ఆరోగ్య రహస్యాలు తెలుసుకోండి! Gen Z Style: మీరు కూడా Gen Z తరమా? అయితే, ఇలానే చేస్తున్నారేమో? ఒకసారి చెక్ చేసుకోండి! Dog Breeds Banned: ఈ 6 ప్రమాదకర కుక్కల జాతులపై యజమానులందరికీ కొత్త ఆంక్షలు.. మీ ఇంట్లో ఉంటే జాగ్రత్త సుమీ!! Lifestyle: తాగుబోతుల జాబితాలో తెలుగు రాష్ట్రాలు టాప్‌లో.. నెంబర్ వన్ రాష్ట్రం ఏదంటే? ఆదాయం పన్ను లేని దేశాలు! సంపాదన అంతా మీ సొంతం! కానీ అవి తప్పనిసరి! tradition India: మద్యం, మాంసం, పొగాకు దరిచేరని ఆశ్చర్యమైన గ్రామం... 600 ఏళ్ల సంప్రదాయానికి గిన్నిస్ గుర్తింపు! Health tips: బాల్యంలో పోషకాహారం లోపిస్తే ఏం జరుగుతుందో తెలుసా? – తల్లిదండ్రులు గమనించాల్సిన ముఖ్య సూచనలు ఇవే!! 20 రోజుల్లో బట్టతలపై జుట్టు.. తైవాన్ శాస్త్రవేత్తల సంచలనం వెనుక నిజమెంత.. ప్రచారంలో లొసుగులివే! పని మనిషి అంటే చిన్న జాబ్ అనుకుంటే పొరపాటు.. సాలరీ విన్నాక షాక్ అవుతారు! ఆ నగరంలో ఖరీదైన జీవనశైలి చూసి షాక్ అవుతున్న నెటిజన్లు! Dark chocolate healthy tips: రాత్రిపూట డార్క్ చాక్లెట్ తినొచ్చా? నిపుణుల స్పష్టమైన సమాధానం ఇదే! Colostrum milk benefits: ఆ మూడు రోజుల్లో వచ్చే పాలు ఇంత పవర్‌ఫుల్‌నా? జున్ను ఆరోగ్య రహస్యాలు తెలుసుకోండి!

Gen Z Style: మీరు కూడా Gen Z తరమా? అయితే, ఇలానే చేస్తున్నారేమో? ఒకసారి చెక్ చేసుకోండి!

2025-11-05 08:50:00

ఇప్పటి యువత అంటే జెన్‌ జె (Gen Z) టెక్నాలజీతో పెరిగిన ఈ తరం ప్రతి పనిలోనూ పారదర్శకత, సులభత, డిజిటల్‌ సౌకర్యాలను కోరుకుంటుంది. అదే ధోరణి ఇప్పుడు విద్యా రుణాలో విషయంలో కూడా కనిపిస్తోంది. పాత తరాల వలె కాకుండా వీరు రుణం తీసుకోవడంలోనూ, తిరిగి చెల్లించడంలోనూ పూర్తిగా కొత్త పద్ధతిని అవలంబిస్తున్నారు.

జెన్‌ జె విద్యార్థులు ఏ బ్యాంక్‌ నుంచి లేదా ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్‌ నుంచి రుణం తీసుకోవాలన్నా ముందుగా అన్ని షరతులను, వడ్డీ రేట్లను, రీపేమెంట్‌ ఆప్షన్‌లను జాగ్రత్తగా పరిశీలిస్తారు. ఏమీ దాచకుండా చెప్పాలి అనే పారదర్శకతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఇది వాళ్లలో ఉన్న ఆర్థిక అవగాహన పెరిగిన సంకేతం.

ఇప్పటి యువతకు అన్ని సేవలు మొబైల్‌ యాప్‌ ద్వారా లేదా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండాలి. బ్యాంక్‌ బ్రాంచ్‌కి వెళ్లి గంటల తరబడి క్యూలో నిలబడటమంటే వీరికి ఇష్టం ఉండదు. చాలా మంది విద్యార్థులు ఇప్పుడు రుణాలు తీసుకోవడానికి ఫిన్టెక్‌ ప్లాట్‌ఫారమ్‌లు లేదా డిజిటల్‌ లోన్‌ యాప్స్‌ వాడుతున్నారు. వాటిలో డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేయడం, వడ్డీ లెక్కించడం, ఎమీఐ (EMI) షెడ్యూల్‌ చెక్‌ చేయడం అన్నీ సులభంగా చేయగలరు.

జెన్‌ జె తరం చిన్న వయసులోనే ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌ నేర్చుకుంటోంది. యూట్యూబ్‌, సోషల్‌ మీడియా ద్వారా లోన్‌ ఎలా తీసుకోవాలి? వడ్డీ రేటు ఎలా లెక్కించాలి? రుణం చెల్లించడంలో ఏవి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి విషయాలు తెలుసుకుంటున్నారు. అందుకే, ఎవరైనా రుణం ఇవ్వాలంటే కేవలం పేరు మీద నమ్మకం కాదు, స్పష్టమైన డేటా, క్లియర్‌ టర్మ్స్‌ కావాలి అని వీరు డిమాండ్‌ చేస్తున్నారు.

మునుపటి తరాలు రుణం తీసుకున్న తర్వాత ఎక్కువ ఒత్తిడిలో ఉండేవారు. కానీ జెన్‌ జె మాత్రం రుణం తీసుకునే ముందు నుంచే రీపేమెంట్‌ ప్లాన్‌ సెట్‌ చేసుకుంటుంది. తమ భవిష్యత్‌ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఎంత కాలంలో చెల్లించగలమో అంచనా వేస్తారు. కొందరు అయితే ‘ఇన్‌కమ్‌ బేస్డ్‌ రీపేమెంట్‌’ (Income-Based Repayment) మోడల్‌ వైపే మొగ్గు చూపుతున్నారు — అంటే ఆదాయం పెరిగినప్పుడు కొంచెం ఎక్కువ చెల్లించడం, తగ్గినప్పుడు తక్కువ చెల్లించడం.

జెన్‌ జె అవసరాలకు తగ్గట్టు ఇప్పుడు చాలా బ్యాంకులు కూడా తమ సేవలను మార్చుకుంటున్నాయి. ఆన్‌లైన్‌ లోన్‌ కాలిక్యులేటర్లు, కస్టమ్‌ ప్లాన్లు, తక్కువ వడ్డీతో స్టూడెంట్‌ స్పెషల్‌ ఆఫర్లు అందిస్తున్నారు. విద్యార్థులు కూడా క్రెడిట్‌ స్కోర్‌ అంటే ఏమిటో తెలుసుకుని, భవిష్యత్తులో మంచి రికార్డు కోసం రుణాలను సమయానికి చెల్లిస్తున్నారు.

జెన్‌ జె తరం విద్యతో పాటు ఆర్థిక అవగాహనను కూడా సమానంగా పెంచుకుంటోంది. ఎంత చదవాలి? అన్నదే కాదు, ఎంత ఖర్చవుతుంది, దాన్ని ఎలా నిర్వర్తించాలి? అన్నది కూడా వారు ముందుగానే అంచనా వేస్తున్నారు. రుణం అంటే భారం కాదు ఒక అవకాశం అని వీరు భావిస్తున్నారు.

Spotlight

Read More →