BBC: ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిబిసి కార్యాలయాల్లో లేఆఫ్స్...! 2,000 మందిపై వేటు! Govt Jobs: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. ఏప్రిల్ 22లోగా అప్లై చేసుకోండి! నోటిఫికేషన్ పూర్తి వివరాలు! SSC Notification: నిరుద్యోగులకు శుభవార్త... ఎస్‌ఎస్‌సీ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల! Govt Jobs: ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. పరీక్షా విధానం ఇదే! TCS: ఫ్రెషర్లకు టీసీఎస్ బంపర్ ఆఫర్... 25,000 ఉద్యోగాల నియామకానికి గ్రీన్ సిగ్నల్! AP Investments 2026: నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్.. రూ. 39,436 కోట్ల పెట్టుబడులతో కొలువుల జాతర.!! Govt Jobs 2026: రూ. 32,492 వేతనంతో ప్రభుత్వ ఉద్యోగాలు! పూర్తి వివరాలు ఇవే... డోంట్ మిస్! High Court Jobs: ఏపీ హైకోర్టులో కొలువుల జాతర.... నేటి నుంచే 300 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం! Gen Z: డిగ్రీ లేకున్నా లక్షల్లో జీతం.. జెన్-జీ కొత్త ట్రెండ్! Bank Jobs: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్..! ఎంపిక విధానం మరియు అర్హతలు! BBC: ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిబిసి కార్యాలయాల్లో లేఆఫ్స్...! 2,000 మందిపై వేటు! Govt Jobs: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. ఏప్రిల్ 22లోగా అప్లై చేసుకోండి! నోటిఫికేషన్ పూర్తి వివరాలు! SSC Notification: నిరుద్యోగులకు శుభవార్త... ఎస్‌ఎస్‌సీ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల! Govt Jobs: ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. పరీక్షా విధానం ఇదే! TCS: ఫ్రెషర్లకు టీసీఎస్ బంపర్ ఆఫర్... 25,000 ఉద్యోగాల నియామకానికి గ్రీన్ సిగ్నల్! AP Investments 2026: నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్.. రూ. 39,436 కోట్ల పెట్టుబడులతో కొలువుల జాతర.!! Govt Jobs 2026: రూ. 32,492 వేతనంతో ప్రభుత్వ ఉద్యోగాలు! పూర్తి వివరాలు ఇవే... డోంట్ మిస్! High Court Jobs: ఏపీ హైకోర్టులో కొలువుల జాతర.... నేటి నుంచే 300 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం! Gen Z: డిగ్రీ లేకున్నా లక్షల్లో జీతం.. జెన్-జీ కొత్త ట్రెండ్! Bank Jobs: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్..! ఎంపిక విధానం మరియు అర్హతలు!

LIC HFL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారీ జీతంతో ఎల్‌ఐసీలో ఉద్యోగాల భర్తీ.. పూర్తి వివరాలు ఇవే!

LIC HFL Recruitment 2026: ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL) 180 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హత, 21-30 ఏళ్ల వయస్సు ఉన్న వారు ఏప్రిల్ 30, 2026 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక విధానం, జీతం పరీక్ష వివరాలు

Published : 2026-04-16 14:23:00

LIC HFL Recruitment 2026: ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తూ జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా మొత్తం 180 ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైపోయింది. ఎంపికైన వారు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు మే నెల వరకు వేచి చూడకుండా, ఏప్రిల్ 30వ తేదీ లోపే తమ దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే వారు  ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి కనీసం 55 శాతం మార్కులతో డిగ్రీ పాసైన వారు మాత్రమే దీనికి అర్హులు. అలాగే అభ్యర్థుల వయస్సు 21 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. దీనితో పాటు కంప్యూటర్ వాడటంపై కనీస అవగాహన ఉండాలని సంస్థ స్పష్టం చేసింది. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం చూస్తున్న యువతకు ఇది ఒక మంచి వేదిక అని చెప్పవచ్చు.

ఎంపిక ప్రక్రియలో అభ్యర్థులు రెండు  దశలను దాటాల్సి ఉంటుంది. మొదటగా 200 మార్కులకు ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ఇంగ్లీష్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ వంటి అంశాల మీద ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష రాసేటప్పుడు అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. ఈ పరీక్షలో పాసైన వారికి మాత్రమే తదుపరి దశలో  ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. రెండింటిలోనూ మంచి ప్రతిభ చూపిన వారికే ఉద్యోగం దక్కుతుంది.

ఇక జీతం విషయానికి వస్తే, ఎల్‌ఐసీ సంస్థ ఆకర్షణీయమైన జీతభత్యాలను అందిస్తోంది. ఎంపికైన వారికి నెలకు సుమారు 20 వేల రూపాయల బేసిక్ పేతో పాటు ఇంటి అద్దె, వైద్య ఖర్చులు, భోజన అలవెన్సులు వంటివి కూడా లభిస్తాయి. ఏడాదికి మొత్తం ప్యాకేజీ దాదాపు 4.64 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో ఉద్యోగ భద్రతతో పాటు ఏటా జీతం పెరిగే అవకాశం కూడా ఉంటుంది.

ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకునే వారు ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ వివరాలను నమోదు చేసుకోవాలి. దరఖాస్తులో ఏవైనా తప్పులు ఉంటే ఏప్రిల్ 30 వరకు సరిచేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఫైనల్ ప్రింటౌట్ తీసుకోవడానికి మే 15 వరకు సమయం ఇచ్చారు. అభ్యర్థులు దరఖాస్తు చేసేటప్పుడు తమ వ్యక్తిగత వివరాలను జాగ్రత్తగా చూసుకోవాలి, లేదంటే చిన్న తప్పు వల్ల కూడా దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది. తరచుగా వెబ్‌సైట్ చూస్తూ పరీక్ష తేదీల గురించి అప్‌డేట్‌గా ఉండటం మంచిది.

Spotlight

Read More →