మన రోజువారీ వంటింట్లో గుడ్డు సాధారణమైనదే కానీ దానిని సరిగా గుర్తించకపోతే అది ఆరోగ్యానికి పెద్ద ముప్పు కూడా అవుతుంది. బయటకు తెల్లగా చక్కగా కనిపించినా లోపల కుళ్లిపోయిన గుడ్డును వాడితే వంటనే కాదు — కడుపుకీ ఇబ్బందే! కానీ ఆందోళన అవసరం లేదు. ఇంట్లోనే ఉన్న మూడు సింపుల్ టెస్టులతో మీరు గుడ్డు తాజాగానిదో పాడైందో సులభంగా గుర్తించవచ్చు.
పాత చిట్కా అయినా ఇప్పటికీ సూపర్ వర్క్ అవుతుంది!
ఒక గిన్నెలో చల్లని నీరు తీసుకుని, అందులో గుడ్డును జాగ్రత్తగా వేయండి. గుడ్డు అడుగున మునిగి, సవ్యంగా పడుకుంటే అది తాజా గుడ్డు. కొంచెం పైకి వంగి నిలబడితే కొంచెం పాతది, కానీ తినవచ్చు. నీటిమీద తేలిపోతే పాడైన గుడ్డు వెంటనే పారేయాలి. సైన్స్ సింపుల్‌గానే ఉంది కాలం గడిచేకొద్దీ గుడ్డు లోపల గాలి స్థలం పెరుగుతుంది కాబట్టి అది తేలిపోతుంది!
గుడ్డు పెంకు పగుళ్లతో, జిగురు రంగుతో ఉంటే జాగ్రత్త.
పెంకు బాగానే ఉన్నా, పగలగొట్టాక పచ్చసొన నీరుగా, తెల్లసొన పల్చగా ఉంటే అది పాతది.కానీ ఆకుపచ్చ, గులాబీ, లేదా ఇంద్రధనుస్సు రంగులు కనబడితే అది కలుషితం, వెంటనే పడేయాలి.
స్మార్ట్ ట్రిక్ గుడ్డును చెవికి దగ్గర పెట్టి కదిలించండి. లోపల ద్రవ శబ్దం వినిపిస్తే అది పాత గుడ్డు. తాజా గుడ్డులో ఆ శబ్దం ఉండదు.
నిల్వ చిట్కాలు
ఎప్పుడూ గుడ్లను ఫ్రిజ్‌లో ఉంచండి.ఉష్ణోగ్రత మార్పులు వాటిని త్వరగా పాడుచేస్తాయి.గుడ్డును తలకిందులుగా (పెద్ద భాగం కిందగా) ఉంచితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.
గుడ్డు చిన్నది అనిపించినా దానిని సరిగా పరీక్షించడం ఆరోగ్య రక్షణలో పెద్ద భాగం. ఒక్క నిమిషం సమయం తీసుకుని ఈ సింపుల్ హ్యాక్స్ ట్రై చేస్తే, మీరు తింటున్న గుడ్డు నిజంగా తాజాగానిదని నమ్మకం వస్తుంది.
ఈ సమాచారం కేవలం ఈ అవగాహనకు మాత్రమే.