International news: ప్రపంచ ఆర్థిక రంగం మళ్లీ రెండు మహా శక్తుల వైపు చూపులు మళ్లించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ గురువారం ఉదయం బుసాన్‌లో ముఖాముఖి కలుసుకున్నారు. ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార (APEC) సదస్సు నేపథ్యంలో జరిగిన ఈ భేటీపై అంతర్జాతీయ దృష్టి సారించింది.
2019లో జపాన్‌లో జరిగిన G20 సమావేశం తర్వాత ఈ ఇద్దరు నాయకులు కలుసుకోవడం ఇదే మొదటిసారి. ఆ సమయంలో చర్చలు గట్టి పోటీగా ముగిశాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి ట్రంప్ తన రెండో పదవీకాలంలోకి అడుగుపెట్టిన తర్వాత చైనాతో వాణిజ్య సంబంధాలు పునరుద్ధరించాలనే దిశగా ముందుకు సాగుతున్నారు.
సమావేశం ప్రారంభంలోనే ఇద్దరు నాయకులు చిరునవ్వులు పంచుకున్నారుచేతులు కలిపారు. మనం ఒక విజయవంతమైన సమావేశం జరుపబోతున్నాం, అని ట్రంప్ ధీమాగా అన్నారు. వెంటనే ఆయన చమత్కారంగా కానీ షీ చాలా టఫ్ నెగోషియేటర్ అది అంత మంచిది కాదు! అని నవ్వించారు.
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కూడా సమాధానంగా మేము ఎప్పుడూ ఒకే దారిలో ఆలోచించకపోయినా మన చర్చలు ప్రపంచానికి ఉపయోగపడతాయి అని వ్యాఖ్యానించారు.
సమావేశంలో ట్రంప్ పక్కన అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, వాణిజ్య కార్యదర్శి హోవర్డ్ లుట్నిక్ పాల్గొన్నారు. షీ జిన్‌పింగ్ పక్కన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఉన్నారు.
ఈ భేటీలో రెండు దేశాలు ప్రధానంగా టారిఫ్‌లు తగ్గింపు ఫెంటనిల్ డ్రగ్ కంట్రోల్, మరియు AI టెక్నాలజీ భాగస్వామ్యం వంటి కీలక అంశాలపై చర్చించినట్టు సమాచారం. ట్రంప్ ఇటీవలే చైనా ఫెంటనిల్ సమస్యపై సహకరిస్తే, మేము టారిఫ్‌లు సడలించవచ్చు అని వ్యాఖ్యానించారు.
నివిడియా చిప్‌ల ప్రస్తావన కూడా ఈ సమావేశంలో వచ్చిందని వైట్‌హౌస్ వర్గాలు చెబుతున్నాయి. బ్లాక్వెల్ చిప్స్ సూపర్ డూపర్ అవుతాయి అని ట్రంప్ మురిసిపోయారు.
ప్రపంచ మార్కెట్లలో కూడా ఈ సమావేశం పాజిటివ్ సిగ్నల్ ఇచ్చింది. అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం గత కొన్నేళ్లుగా ప్రపంచ ఆర్థిక వాతావరణాన్ని ప్రభావితం చేస్తూ వస్తోంది. ఇప్పుడు ఆ తణుకు కొంత సద్దుమణిగే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఒక అమెరికన్ విశ్లేషకుడు వ్యాఖ్యానిస్తూ ఇది పెద్ద ఒప్పందానికి ప్రారంభం కాకపోయినా, చర్చలకు తలుపు తెరచిన ఘట్టం. ఈ భేటీ ఫలితం రాబోయే నెలల్లో స్పష్టమవుతుంది అన్నారు.
సమావేశం అనంతరం ట్రంప్ మాట్లాడుతూ ప్రెసిడెంట్ షీ నా మిత్రుడు. చైనా ఒక గొప్ప దేశం. మన మధ్య స్నేహం చాలా కాలం కొనసాగుతుంది అని పేర్కొన్నారు.
ప్రపంచం ఎదురుచూస్తున్న తదుపరి దశ ఇప్పుడు ప్రశ్న ఈ సమావేశం వాణిజ్య యుద్ధానికి నిజంగా ముగింపు తెస్తుందా? లేక ఇది మరో రాజకీయ ప్రదర్శనా? విశ్లేషకులు మాత్రం ఇది ఆర్థిక స్థిరత్వం దిశగా చిన్న కానీ కీలకమైన అడుగు అని భావిస్తున్నారు