దేశంలో కంటి వైద్యుల కొరత ఆందోళనకర స్థాయికి చేరిందని ఎయిమ్స్ తాజా అధ్యయనం వెల్లడించింది. దేశవ్యాప్తంగా సగటున ప్రతి 65,000 మందికి ఒకే కంటి వైద్యుడు అందుబాటులో ఉన్నారని ఈ సర్వేలో తేలింది.
ఈ అధ్యయనాన్ని ఎయిమ్స్‌లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సెంటర్ ఫర్ ఆప్తాల్మిక్ సైన్సెస్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రవీణ్ వశిష్ట్ నేతృత్వంలోని బృందం నిర్వహించింది. దేశంలోని రెండో, మూడో స్థాయి ఆసుపత్రుల్లో ఉన్న మానవ వనరులు, సదుపాయాల లభ్యతను పరిశీలించారు.
సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా ప్రస్తుతం 20,944 మంది కంటి వైద్యులు, 17,849 మంది ఆప్టోమెట్రిస్టులు సేవలందిస్తున్నారు. అయితే విజన్ 2020 ప్రణాళిక ప్రకారం 2020 నాటికి కనీసం 25,000 మంది కంటి వైద్యులు, 48,000 మంది సిబ్బంది ఉండాలని లక్ష్యం పెట్టినా, అది ఇంకా సాధ్యం కాలేదని నివేదిక స్పష్టం చేసింది.
డాక్టర్ వశిష్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం దక్షిణ మరియు పశ్చిమ భారత రాష్ట్రాల్లో కంటి వైద్యుల లభ్యత కొంత మెరుగ్గా ఉంది. కానీ బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందన్నారు.
మొత్తం 8,790 కంటి ఆసుపత్రులు ఈ అధ్యయనంలో భాగమయ్యాయి. వాటిలో 7,901 సంస్థలు ప్రశ్నావళి పూర్తి చేశాయి — అంటే 89.9 శాతం రెస్పాన్స్ రేటు.
దేశవ్యాప్తంగా ఒక కంటి ఆసుపత్రి సగటున 1.64 లక్షల మందికి ఒకటి మాత్రమే ఉంది. దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లో ఈ నిష్పత్తి మెరుగ్గా ఉండగా తూర్పు, ఉత్తర ప్రాంతాల్లో గణనీయమైన వెనుకబాటు గా ఉంది.
ప్రైవేట్ రంగం ఆధిపత్యం
నివేదిక ప్రకారం దేశంలోని కంటి ఆసుపత్రుల్లో 70.6 శాతం ప్రైవేట్ రంగానికి,15.6 శాతం ప్రభుత్వ రంగానికి 13.8 శాతం ఎన్‌జీవోలకు చెందినవిగా గుర్తించారు. అదే సమయంలో24 గంటల అత్యవసర కంటి సేవలు అందించే ఆసుపత్రులు కేవలం 40.5 శాతం మాత్రమే ఉన్నాయని కంటి ఆపరేషన్ థియేటర్లు ఉన్నవి 87 శాతం ఆసుపత్రుల్లో ఉన్నాయని వెల్లడించారు. అయితే కంటి బ్యాంకులు (కార్నియా దానం, నిల్వ సదుపాయం)ఉన్నవి కేవలం 5.7 శాతం సంస్థల్లోనే ఉన్నాయని సర్వేలో తేలింది.
లాభదాయక చికిత్సలకే ప్రాధాన్యం
నివేదికలో ముఖ్యంగా ప్రైవేట్ రంగం లాభదాయక సేవలైన రీఫ్రాక్టివ్ సర్జరీలు, లేజర్ చికిత్సలు వంటి వాటిపైనే దృష్టి పెట్టిందని పేర్కొంది. కంటి బ్యాంకులు, ఉచిత చికిత్స శిబిరాలు వంటి ప్రజా ప్రయోజన సేవలను మాత్రం ప్రభుత్వ, సేవా సంస్థలు నిర్వహిస్తున్నాయని వివరించింది.
ఇతర దేశాలతో పోలిస్తే భారత వెనుకబాటు
నివేదికలో చెప్పిన వివరాల ప్రకారం
భారతదేశంలో ప్రతి మిలియన్ జనాభాకు సగటు 15 మంది కంటి వైద్యులు మాత్రమే ఉన్నారు.
అమెరికాలో 56, గ్రీస్‌లో 183, యూఏఈలో 14 మంది ఉన్నారు. పేద దేశాల్లో సగటు సంఖ్య 3.7 మంది, ధనిక దేశాల్లో 76 మంది కంటి వైద్యులు ఉన్నారని వెల్లడించింది.
ఈ సర్వే ద్వారా భారతదేశంలో కంటి ఆరోగ్య సేవలు ఇంకా ఎంత వెనుకబాటులో ఉన్నాయో సూచిస్తోందని నిపుణులు అభిప్రాయపడ్డారు.
ఎయిమ్స్ సూచనలు
దేశంలో కంటి వైద్యుల కొరతను తగ్గించాలంటే
కొత్త కంటి ఆసుపత్రులు, శిక్షణ కేంద్రాలు ప్రారంభించాలి.
గ్రామీణ ప్రాంతాల్లో కంటి వైద్యులను నియమించాలి.
హెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (HMIS) ద్వారా అవసరమైన మానవ వనరులను క్రమపద్ధతిలో పర్యవేక్షించాలి. ఎయిమ్స్ నిపుణులు ప్రభుత్వం, ప్రైవేట్ రంగం కలిసి కంటి ఆరోగ్య సేవల విస్తరణకు కట్టుబడాలని సూచించారు.