Port Jobs: డాక్ పైలట్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల..! అర్హతలు ఇవే! AP Government: ఏపీలో వారికి బదిలీలు, ప్రమోషన్లు! ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! Liquor Shops: ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్..! మద్యం షాపుల్లో నగదుతో పనిలేదు..! Tech Jobs: బ్యాంకింగ్ రంగంలో సైబర్ భద్రత పోస్టులు...! అర్హతలు, పూర్తి వివరాలు ఇవే! Govt Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్...! రాత పరీక్ష లేని ఉద్యోగాలు... కేవలం మెరిట్ ఆధారంగానే ఎంపిక! National Highway: తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్! అందుబాటులోకి వచ్చిన నేషనల్ హైవే... ఇక దూసుకెళ్ళిపోవచ్చు! Nara Lokesh: కల్తీ జరగలేదనడానికి సిగ్గుండాలి! వైసీపీ అవినీతిపై నారా లోకేష్ ఆగ్రహం! ISRO YUVIKA 2026: విద్యార్థులకు బంపర్ ఆఫర్! ఇస్రోలో ట్రైనింగ్.. ప్రయాణం, భోజనం, వసతి కూడా ఫ్రీ! Iran-Israel: ఆ స్థానంలో ఎవరైనా సరే చంపేస్తాం... ఇజ్రాయెల్ మాస్ వార్నింగ్! TTD Chairman: వైసీపీ సోషల్ మీడియా వింగ్‌కు షాక్..! కోర్టు ఆర్డర్‌తో నోరు మూయించిన బి.ఆర్. నాయుడు! Port Jobs: డాక్ పైలట్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల..! అర్హతలు ఇవే! AP Government: ఏపీలో వారికి బదిలీలు, ప్రమోషన్లు! ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! Liquor Shops: ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్..! మద్యం షాపుల్లో నగదుతో పనిలేదు..! Tech Jobs: బ్యాంకింగ్ రంగంలో సైబర్ భద్రత పోస్టులు...! అర్హతలు, పూర్తి వివరాలు ఇవే! Govt Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్...! రాత పరీక్ష లేని ఉద్యోగాలు... కేవలం మెరిట్ ఆధారంగానే ఎంపిక! National Highway: తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్! అందుబాటులోకి వచ్చిన నేషనల్ హైవే... ఇక దూసుకెళ్ళిపోవచ్చు! Nara Lokesh: కల్తీ జరగలేదనడానికి సిగ్గుండాలి! వైసీపీ అవినీతిపై నారా లోకేష్ ఆగ్రహం! ISRO YUVIKA 2026: విద్యార్థులకు బంపర్ ఆఫర్! ఇస్రోలో ట్రైనింగ్.. ప్రయాణం, భోజనం, వసతి కూడా ఫ్రీ! Iran-Israel: ఆ స్థానంలో ఎవరైనా సరే చంపేస్తాం... ఇజ్రాయెల్ మాస్ వార్నింగ్! TTD Chairman: వైసీపీ సోషల్ మీడియా వింగ్‌కు షాక్..! కోర్టు ఆర్డర్‌తో నోరు మూయించిన బి.ఆర్. నాయుడు!

Nara Lokesh: కల్తీ జరగలేదనడానికి సిగ్గుండాలి! వైసీపీ అవినీతిపై నారా లోకేష్ ఆగ్రహం!

Nara Lokesh: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ గట్టిగా స్పందించారు. గత ప్రభుత్వం తక్కువ ధరకు నెయ్యి కొనుగోలు చేసి నాణ్యతను గాలికొదిలేసిందని, కల్తీ జరిగిందని ఆధారాలు ఉన్నా వైసీపీ సమర్థించుకోవడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు.

Published : 2026-03-04 17:43:00

వైసీపీ తీరుపై మంత్రి నారా లోకేష్ నిప్పులు…

భక్తుల నమ్మకంతో ఆటలాడితే సహించేది లేదు…

ల్యాబ్ రిపోర్టులు నిజం చెబుతుంటే.. వైసీపీ ఎందుకు దాక్కుంటోంది?

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తిరుమల లడ్డూ కల్తీ అంశంపై జరిగిన చర్చలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వైకాపా సభ్యుల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా నిర్ణయాలు తీసుకున్నారని, ఇప్పుడు తప్పును సమర్థించుకోవడం సరికాదని ఆయన మండిపడ్డారు. వైకాపా నాయకులు కేవలం రాజకీయ విమర్శలు చేయడం మానేసి, నిజంగా కల్తీ జరగలేదని నిరూపించాలనుకుంటే సరైన ఆధారాలతో సభకు రావాలని సవాల్ విసిరారు. నిరాధారమైన వాదనలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని స్వయంగా వైకాపా కీలక నేత వైవీ సుబ్బారెడ్డి గతంలో పరోక్షంగా అంగీకరించారని లోకేష్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కల్తీ జరిగిందని ల్యాబ్ రిపోర్టులు స్పష్టం చేస్తున్నా, ఇంకా బుకాయించడం సిగ్గుచేటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఇలాంటి సున్నితమైన అంశంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వైకాపా సభ్యుల అహంకారానికి నిదర్శనమని ఆయన విమర్శించారు.

ప్రస్తుతం మార్కెట్‌లో స్వచ్ఛమైన ఆవు నెయ్యి ధరలు భారీగా పెరిగిన విషయాన్ని లోకేష్ ప్రస్తావించారు. నాణ్యమైన నెయ్యి కిలో రూ. 1,000 పైచిలుకు పలుకుతుంటే, గత ప్రభుత్వం కేవలం రూ. 320 కే నెయ్యి సరఫరా చేసేలా కాంట్రాక్టులు ఇవ్వడం వెనుక ఉన్న మర్మమేమిటని ఆయన ప్రశ్నించారు. అంత తక్కువ ధరకు నాణ్యమైన నెయ్యి రాదని తెలిసి కూడా కాంట్రాక్టులు ఇచ్చారంటే, అందులో కల్తీకి తావిచ్చినట్లేనని ఆయన తూర్పారబట్టారు. తక్కువ ధరకు కొని నాణ్యత లేని, కల్తీ నెయ్యిని భక్తులకు పెట్టమంటారా అని ఆయన నిలదీశారు.

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల ప్రసాదం నాణ్యత విషయంలో రాజీ పడకుండా చర్యలు తీసుకుంటున్నామని లోకేష్ వెల్లడించారు. నెయ్యి ధర పెరిగినా సరే, భక్తులకు అత్యుత్తమమైన, పవిత్రమైన ప్రసాదాన్ని అందించాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కేవలం డబ్బులు ఆదా చేయడం కోసం భక్తుల నమ్మకాన్ని తాకట్టు పెట్టే ప్రసక్తే లేదని, నెయ్యి కొనుగోలులో పారదర్శకత పాటిస్తూ కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నామని ఆయన వివరించారు.

Spotlight

Read More →