Russia Oil Tanker: రష్యా చమురు నౌక యూ-టర్న్.. చైనాకు కాకుండా భారత్ వైపు పయనం! Eluru FishMarket: ఏలూరు మార్కెట్‌లో సందడి చేసిన భారీ పండుగప్ప..! ధర వింటే షాక్ అవ్వాల్సిందే! Indian Festivals: దేశవ్యాప్తంగా కొత్త ఏడాది సంబరాలు..! ఏ రాష్ట్రంలో ఏ పేరుతో జరుపుకుంటారో తెలుసా? Gudivada: మాజీ మంత్రి కఠారి ఇంట్లో భారీ చోరీ! సీన్ చూసి పోలీసులు షాక్...! Instagram Update: ఇన్‌స్టాగ్రామ్ క్రేజీ అప్‌డేట్... ఇప్పుడు మీ వాయిస్ మెసేజ్ లకు ఏఐ ఎఫెక్ట్స్! Jamun Fruit: నేరేడు పండు అమృతమే..! కానీ ఈ 5 రకాల వ్యక్తులకు మాత్రం విషం లాంటిది! BSNL Plan: అతి తక్కువ ధరలో 160 రోజుల వ్యాలిడిటీ + అదిరిపోయే డేటా! National Highway: ఏపీలో కొత్తగా నేషనల్ హైవే! రూ.1,670 కోట్లతో నాలుగు లైన్లుగా.. ఘాట్ రోడ్డుకు కొత్త కళ! Corporation Scam: గుంటూరు కార్పొరేషన్‌లో టెండర్ల కుంభకోణం..! మాయమైన 200 కీలక ఫైళ్లు..! Electric Rice Cooker: ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడుతున్నారా? అయితే ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి! Russia Oil Tanker: రష్యా చమురు నౌక యూ-టర్న్.. చైనాకు కాకుండా భారత్ వైపు పయనం! Eluru FishMarket: ఏలూరు మార్కెట్‌లో సందడి చేసిన భారీ పండుగప్ప..! ధర వింటే షాక్ అవ్వాల్సిందే! Indian Festivals: దేశవ్యాప్తంగా కొత్త ఏడాది సంబరాలు..! ఏ రాష్ట్రంలో ఏ పేరుతో జరుపుకుంటారో తెలుసా? Gudivada: మాజీ మంత్రి కఠారి ఇంట్లో భారీ చోరీ! సీన్ చూసి పోలీసులు షాక్...! Instagram Update: ఇన్‌స్టాగ్రామ్ క్రేజీ అప్‌డేట్... ఇప్పుడు మీ వాయిస్ మెసేజ్ లకు ఏఐ ఎఫెక్ట్స్! Jamun Fruit: నేరేడు పండు అమృతమే..! కానీ ఈ 5 రకాల వ్యక్తులకు మాత్రం విషం లాంటిది! BSNL Plan: అతి తక్కువ ధరలో 160 రోజుల వ్యాలిడిటీ + అదిరిపోయే డేటా! National Highway: ఏపీలో కొత్తగా నేషనల్ హైవే! రూ.1,670 కోట్లతో నాలుగు లైన్లుగా.. ఘాట్ రోడ్డుకు కొత్త కళ! Corporation Scam: గుంటూరు కార్పొరేషన్‌లో టెండర్ల కుంభకోణం..! మాయమైన 200 కీలక ఫైళ్లు..! Electric Rice Cooker: ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడుతున్నారా? అయితే ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి!

Corporation Scam: గుంటూరు కార్పొరేషన్‌లో టెండర్ల కుంభకోణం..! మాయమైన 200 కీలక ఫైళ్లు..!

Corporation Scam: గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏడేళ్లుగా సాగుతున్న లెస్ టెండర్ల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. 30 శాతం లెస్ టెండర్లను అధికారుల సాయంతో 0.1 శాతానికి మార్చి 96 మంది కాంట్రాక్టర్లు లబ్ధి పొందారు. సుమారు 200 ఫైళ్లు మాయమవ్వడంపై కొత్త కమిషనర్ సీరియస్ విచారణకు ఆదేశించారు.

Published : 2026-03-18 11:32:00

ఇంజినీరింగ్ విభాగంలో భారీ స్కామ్…

గుంటూరు స్కామ్‌లో షాకింగ్ వివరాలు…

టౌన్ ప్లానింగ్ నుంచి ఇంజినీరింగ్ వరకు…

Corporation Scam: గుంటూరు నగర పాలక సంస్థలో గత కొన్నేళ్లుగా సాగుతున్న భారీ కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ముఖ్యంగా 'లెస్ టెండర్ల' (Less Tenders) వ్యవహారంలో మున్సిపల్ కార్పొరేషన్ ఖజానాకు భారీగా గండి పడినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనులు దక్కించుకోవడానికి తొలుత తక్కువ ధరకు టెండర్లు వేసి, ఆ తర్వాత అధికారుల అండతో వాటిని మార్పిడి చేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సుమారు 96 మంది కాంట్రాక్టర్లు ఈ మాయాజాలానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలడం నగరంలో చర్చనీయాంశంగా మారింది.

ఈ స్కామ్ జరిగిన తీరు అత్యంత విస్మయానికి గురి చేస్తోంది. సాధారణంగా కాంట్రాక్టర్లు టెండర్లు దక్కించుకోవడానికి 30 నుండి 40 శాతం తక్కువ (Less) ధరకు కోట్ చేస్తారు. అయితే, పని దక్కించుకున్న తర్వాత ఇంజినీరింగ్ విభాగంలోని అధికారుల సహకారంతో ఆ టెండర్ విలువను రికార్డుల్లో మార్చేవారు. 40 శాతం లెస్ ఉండాల్సిన దానిని కేవలం 0.1 శాతానికి మార్చి, ప్రభుత్వ సొమ్మును జేబుల్లో నింపుకున్న వైనం టీవీ5 ఇన్వెస్టిగేషన్‌లో వెలుగులోకి వచ్చింది. అధికారుల కళ్లముందే ఏడేళ్లుగా ఈ అక్రమ దందా సాగుతున్నా ఎవరూ ప్రశ్నించకపోవడం గమనార్హం.

ఈ కుంభకోణానికి సంబంధించి దాదాపు 30 మంది ఇంజినీరింగ్ అధికారులు మరియు 96 మంది కాంట్రాక్టర్లు బాధ్యులుగా ఉన్నట్లు ఉన్నతాధికారుల దర్యాప్తులో వెల్లడైంది. కేవలం ఇంజినీరింగ్ విభాగమే కాకుండా, టౌన్ ప్లానింగ్ విభాగంలో కూడా భారీగా అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ అక్రమాలకు సంబంధించిన కీలకమైన 200 ఫైళ్లు ప్రస్తుతం కార్యాలయంలో మాయమవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆధారాలను రూపుమాపేందుకే కావాలని ఈ ఫైళ్లను మాయం చేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

గుంటూరు కార్పొరేషన్‌కు కొత్తగా వచ్చిన కమిషనర్ ఈ అక్రమాలపై ఉక్కుపాదం మోపారు. గత ఏడేళ్ల కాలంలో జరిగిన ప్రతి పనికి సంబంధించిన లెక్కలను ఆయన క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అక్రమాలకు పాల్పడిన అధికారులను, కాంట్రాక్టర్లను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా చూడాలని, అవినీతికి పాల్పడిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని కొత్త కమిషనర్ స్పష్టం చేశారు. దీనితో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
 

Spotlight

Read More →