AP Govt: రాష్ట్రంలో న‌ర్సింగ్ విద్యా సంస్థ‌ల ఏర్పాటుపై కీల‌క నిర్ణ‌యం.. ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌ల‌కు అనుగుణంగా.. Amaravati: దేశంలో 25% పెట్టుబడుల ఆకర్షణతో తొలి స్థానంలో ఆంధ్రప్రదేశ్.. కుల మత ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా కుట్రలు! High Court: రిజర్వేషన్ల ఖరారుకు ఆ సర్వేనే కీలకం.. త్వరలోనే కొత్త కమిషనర్ రాకపై - హైకోర్టు కీలక ఆదేశం! Modi: పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోదీ-మెక్రాన్ చర్చ.. శాంతి పునరుద్ధరణే లక్ష్యంగా అగ్రనేతల ఫోన్ కాల్! Chandrababu: మంత్రుల బృందానికి చంద్రబాబు క్లాస్: పయ్యావుల, నారాయణ, సత్యకుమార్‌లకు కీలక సూచనలు.. కేవలం సిద్ధాంతం కాదు.. Nara Lokesh: మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం! స్కూల్ కమిటీలకే పాఠశాలల అభివృద్ధి బాధ్యతలు! Prajavedhika: అంజమ్మపై గొడ్డలి వేటు... సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భూమి మాయం! మాయలేడి రూ.10 లక్షల టోకరా.... Spicy Chicken: స్పైసీ చికెన్ లవర్స్ కోసం ప్రత్యేక రెసిపీ..! వెల్లుల్లి ఘాటుతో అదిరిపోయే టేస్ట్! Delhi Airport Incident: ఢిల్లీ విమానాశ్రయంలో ప్రమాదం... ఒకదానికొకటి ఢీకొన్న విమానాలు!! BSNL ధమాకా ఆఫర్... రూ. 200 లోపే 30 రోజుల వ్యాలిడిటీ మరియు అన్లిమిటెడ్ కాల్స్! AP Govt: రాష్ట్రంలో న‌ర్సింగ్ విద్యా సంస్థ‌ల ఏర్పాటుపై కీల‌క నిర్ణ‌యం.. ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌ల‌కు అనుగుణంగా.. Amaravati: దేశంలో 25% పెట్టుబడుల ఆకర్షణతో తొలి స్థానంలో ఆంధ్రప్రదేశ్.. కుల మత ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా కుట్రలు! High Court: రిజర్వేషన్ల ఖరారుకు ఆ సర్వేనే కీలకం.. త్వరలోనే కొత్త కమిషనర్ రాకపై - హైకోర్టు కీలక ఆదేశం! Modi: పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోదీ-మెక్రాన్ చర్చ.. శాంతి పునరుద్ధరణే లక్ష్యంగా అగ్రనేతల ఫోన్ కాల్! Chandrababu: మంత్రుల బృందానికి చంద్రబాబు క్లాస్: పయ్యావుల, నారాయణ, సత్యకుమార్‌లకు కీలక సూచనలు.. కేవలం సిద్ధాంతం కాదు.. Nara Lokesh: మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం! స్కూల్ కమిటీలకే పాఠశాలల అభివృద్ధి బాధ్యతలు! Prajavedhika: అంజమ్మపై గొడ్డలి వేటు... సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భూమి మాయం! మాయలేడి రూ.10 లక్షల టోకరా.... Spicy Chicken: స్పైసీ చికెన్ లవర్స్ కోసం ప్రత్యేక రెసిపీ..! వెల్లుల్లి ఘాటుతో అదిరిపోయే టేస్ట్! Delhi Airport Incident: ఢిల్లీ విమానాశ్రయంలో ప్రమాదం... ఒకదానికొకటి ఢీకొన్న విమానాలు!! BSNL ధమాకా ఆఫర్... రూ. 200 లోపే 30 రోజుల వ్యాలిడిటీ మరియు అన్లిమిటెడ్ కాల్స్!

Amaravati: దేశంలో 25% పెట్టుబడుల ఆకర్షణతో తొలి స్థానంలో ఆంధ్రప్రదేశ్.. కుల మత ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా కుట్రలు!

Amaravati: పెట్టుబడులు తీసుకొచ్చి.. పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంటే.. కడుపు మంటతో ఓర్వలేక మాజీ సీఎం పెద్దలు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడని.. రాష్ట్ర ఎక్సైజ్, గనులు, భూగర్భవనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర రోడ్లు & భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి మండిపడ్డారు.

Published : 2026-04-16 22:03:00
  • పోర్టు పనులను చేపట్టిన సంస్థలను బెదిరించి బినామీల పేరిట వాటాలు రాయించుకున్న చరిత్ర వారిది..
     
  • Politics: జువ్వలదిన్నె ప్రాజెక్టుపై పై నీచ రాజకీయానికి పాల్పడుతోంది..

Amaravati: పెట్టుబడులు తీసుకొచ్చి.. పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంటే.. కడుపు మంటతో ఓర్వలేక మాజీ సీఎం పెద్దలు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడని.. రాష్ట్ర ఎక్సైజ్, గనులు, భూగర్భవనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర రోడ్లు & భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో తీర ప్రాంతం, మత్స్యకారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు స్పష్టం చేశారు.. ఆంధ్రప్రదేశ్ లో నేడు పెట్టుబడుల అనుకూల వాతావరణం ఉండటం, భారీగా పెట్టుబడులు రాష్ట్రానికి తరలి రావడాన్ని జీర్ణించుకోలేక, ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తోందని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ను ప్రవేట్ పరం చేస్తున్నామంటూ ప్రతిపక్షం చేస్తున్న విమర్శలు పూర్తిగా వాస్తవ విరుద్ధమని కొట్టిపారేశారు.. నేడు సచివాలయంలోని 4 వ బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రులు కొల్లు రవీంద్ర, బీసీ జనార్థన్ రెడ్డి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ స్పెషల్ ఛీప్ సెక్రటరీ ఎం. టీ కృష్ణబాబు సంయుక్తంగా పాల్గొన్నారు..

పెట్టుబడిదారులను భయభ్రాంతులకు గురిచేయడమే పనిగా పెట్టుకున్న గత ప్రభుత్వం…
ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ… నేడు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే పెట్టుబడిదారులను భయబ్రాంతులకు గురిచేయడం ఒక కార్యక్రమంగా పెట్టుకుని మాజీ సీఎం  పనిచేస్తున్నారని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ధ్వజమెత్తారు...నిన్న జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్ పర్యటలో జగన్ మోహన్ రెడ్డి చేసిన విమర్శలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయి.. నేడు  కేవలం తన రాజకీయ ఉనికి చాటుకోవడానికి తప్ప,  మత్స్యకారుల ప్రయోజనాల కోసం జగన్ మోహన్ రెడ్డి జువ్వలదిన్నెకు ఎంతమాత్రం రాలేదన్నారు.. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను ప్రైవేట్ పరంగా చేస్తున్నారన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని మండిపడ్డారు..

మత్స్యకారులను రెచ్చగొట్టేలా రాజకీయాలకు పాల్పడుతున్నమాజీ సీఎం..
మొత్తం 114 ఎకరాల జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ భూమిలో కేవలం 7 ఎకరాలు మాత్రమే సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ లిమిటెడ్‌కు కేటాయించామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు.. 40 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, 900 మీటర్ల మేర ఉన్న జెట్టీలో 150 మీటర్లు మాత్రమే సదరు యూనిట్ కోసం వినియోగిస్తుంటే.. వాస్తవాలను ఏమార్చి.. గత ప్రభుత్వ నేతలు మత్స్యకారుల్ని రెచ్చగొట్టేలా రాజకీయం చేస్తున్నారన్నారు.. దీనివల్ల మత్స్యకారులకు  ఏవిధమైన నష్టం లేదు.. పైగా స్థానికంగా మత్య్సకారులుకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయని మంత్రి తెలిపారు.

విధ్వంస రాజకీయాలే వారి ఎజెండా
రాష్ట్రంలో విధ్వంసంతో రాజకీయాలు చేయడం  మొదటి నుంచి వారికి అలవాటేనని మంత్రి అన్నారు.. నేడు రాజకీయంగా తమ ఉనికిని కాపాడుకోవడానికి మాజీ సీఎం, ఆ పార్టీ నేతలు మతి చలించి మాట్లాడుతున్నారన్నారు.. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం నుంచి పరిశ్రమలను వెళ్లగొట్టిన ఆ పార్టీ నేతలు... నేడు ప్రతిపక్షంలో ఉండగా రాష్ట్రానికి పరిశ్రమలు వస్తే, కూటమి ప్రభుత్వం మరింత బలపడుతోందని, పరిశ్రమలపై బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు..మూడేళ్లలో అధికారంలోకి వస్తాను.. పెట్టుబడులు పెట్టేవారిని అరెస్ట్ చేస్తామని బెదిరించడం వారి రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం.. తాము 2014 – 2019 మధ్య అధికారంలో ఉన్న ఏ ఒక్క పరిశ్రమను బెదిరించిన పరిస్థితి ఎంత మాత్రం లేదన్నారు.. కానీ గత ప్రభుత్వంలో అంతర్జాతీయ కంపెనీలను సైతం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకుండా బెదిరించారన్నారు...

అధికారంలో ఉన్న ఐదేళ్లు నిద్రపోయిన గత ప్రభుత్వ పెద్దలు
అధికారంలో ఉన్న ఐదేళ్లు నిద్రపోయి.. జువ్వలదిన్నెకు రాష్ట్ర వాటా నిధులు కేటాయించని పార్టీ నేడు విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. కేంద్ర నిధులు రూ. 128 కోట్లు పక్కదారి పట్టించి నేడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు.. జువ్వలదిన్నెకు రాష్ట్ర వాటా చెల్లించకుండానే, రెండేళ్ల క్రితమే ఫిషింగ్ హర్బర్ పూర్తయిందని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు.. మాజీ సీఎం.. ప్రజలను సామాజికవర్గాల వారీగా రెచ్చగొట్టే ధోరణిలో భాగంగా మత్స్యకారులను కూడా నేడు రెచ్చగొడుతున్నారు.

దేశంలో 25% పెట్టుబడుల ఆకర్షణతో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్
దేశంలో 4 శాతం విస్తీర్ణం లేని ఆంధ్రప్రదేశ్ ... నేడు దేశంలో 4 వంతు (25 శాతం) పెట్టుబడులు సాధించడం చూసి, ప్రతిపక్ష పార్టీకి కళ్లు కుడుతున్నాయన్నారు..  నేడు పెట్టుబడుల అనుకూల వాతావరణం ఏర్పడటం, భారీగా పెట్టుబడులు రాష్ట్రానికి రావడాన్ని ప్రతిపక్షం జీర్ణించుకోలేక, దుష్ప్రచారం చేస్తోందన్నారు. చివరకు ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, మంత్రులను సైతం బెదిరించే కార్యక్రమాలకు ఆ పార్టీ పాల్పడుతుందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 4 గ్రీన్ ఫీల్డ్ పోర్టులను తమ ప్రభుత్వ హాయాంలో 2014 – 19 మధ్య పునాది రాయి వేశాం.. నేడు 4 పోర్టులకు సంబంధించి  95 శాతం పనులు పూర్తయితే మాజీ సీఎం ఎందుకు పూర్తి చేయలేదో సమాధానం చెప్పాలన్నారు.. నేడు ఒక కరపత్రికను అడ్డంపెట్టుకుని మాపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. మాజీ సీఎం గతంలోనే జువ్వలదిన్నెను జాతికి అంకితం చేస్తే, నేడు అక్కడ జరిగే అభివృద్ధి కళ్ల ముందు  కనపడటం లేదా అని మండిపడ్డారు..

రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్రంలో విధ్వంస పాలన
ప్రభుత్వాలు అనేది నిరంతర ప్రక్రియ ఏదైనా ఒక ప్రభుత్వం ఒక ప్రాజెక్టు మొదలుపెడితే, దానిని ఆ తర్వాత ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంటుంది.. కానీ గతంలో మాజీ సీఎం రాజధాని అమరావతి, పోలవరం, పోర్టుల వంటివి రివర్స్ టెండరింగ్ పేరుతో విధ్వంసం సృష్టించిన పరిస్థితులు చూశామన్నారు.

పోర్టు పనులను చేపట్టిన సంస్థలను బెదిరించి బినామీల పేరిట వాటాలు రాయించుకున్న చరిత్ర వారిది
గత ప్రభుత్వంలో ఆయా పోర్టుల అభివృద్ధి పనులు చేపట్టిన సంస్థలను బెదిరించి, భయపెట్టి, తమ బీనామీల పేరిట వాటాలు రాయించుకుని, షేర్ లు మార్పించుకున్న చరిత్ర మాజీ సీఎం దేనన్నారు... పోర్టులకు సంబంధించి, తప్పుడు డిజైన్ లతో రాత్రికి రాత్రే డీపీఆర్ లు మార్చేసిన పరిస్థితులు సైతం నాటి గత ప్రభుత్వ పాలనలో చూశామన్నారు... కనీసం భూసేకరణ పూర్తి చేయకుండా, వివాదాస్పద భూముల్లో పనులు ప్రారంభించడంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నింటిని సరిదిద్ధి తిరిగి పట్టాలెక్కించామన్నారు... ఈ ఏడాది చివరి నాటికి  రాష్ట్రంలోని పోర్టులు, ఫిషింగ్ హర్బర్ లు పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇవ్వనున్నామని మంత్రి తెలిపారు..

రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు, పెట్టుబడిదారులను బెదిరిస్తూ.. వారి అంతు తేలుస్తామని చెప్పడానికి అసలు ఆ పార్టీ నేతలు ఎవరని మంత్రి ప్రశ్నించారు. ఇంతటి అరాచకాలు సృష్టిస్తోన్న ఆ పార్టీ ముందుగా తన పార్టీ పేరును గొడ్డలి పార్టీగా పేరు మార్చుకోవాలని మంత్రి సలహా ఇచ్చారు.  రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో పరిశ్రమలు, పెట్టుబడులు వస్తే, రాజకీయంగా, రాబోయే ఎన్నికల్లో తమ ఉనికికే ప్రమాదమని తెలిసే ఈ బెదిరింపులకు మాజీ సీఎం పాల్పడుతున్నారన్నారు..

దేశ రక్షణ, మత్స్యకార వర్గాల అభ్యున్నతికి సాగర్ డిఫెన్స్ సంస్థ అండగా నిలుస్తుందన్న మంత్రి కొల్లు రవీంద్ర 
మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమం గురించి మాజీ సీఎం మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మాజీ సీఎం రాజకీయం చేయడం, కులాలు మతాల మధ్య చిచ్చురేపరమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. మాజీ సీఎం కి తల్లి మీద ప్రేమ లేదు, భక్తి లేదు. చెల్లి మీద భక్తి లేదు, రాష్ట్రం మీద భక్తి లేదు, చివరికి దేశ భక్తి కూడా లేదు. తీర ప్రాంత రక్షణకు కీలకంగా నిలిచే సాగర్ డిఫెన్స్ సంస్థ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తే, తరిమేస్తాను అని  మాజీ సీఎం మాట్లాడటం సిగ్గుచేటు. తమిళనాడు బోర్డర్ లో ఉన్నటువంటి  మత్స్యకారులు మన ప్రాంతానికి వచ్చి, ఆంధ్ర రాష్ట్ర  తీర ప్రాంతానికి వచ్చి స్పీడ్ బోట్లతో ఇబ్బంది కలిగిస్తున్నారు.  ఆ సమస్య పరిష్కరించడమే లక్ష్యంగా. 2017వ సంవత్సరంలో 18 మెరైన్ బోట్లు ఏర్పాట్ఉంయూ చేశాం. గత ప్రభుత్వం ఐదేళ్ళపాటు  మెయింటెనెన్స్ చేయడానికి నిధులు కేటాయించకుండా పాడు చేశాడు, సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా తరిమేశారు. ఇప్పుడు 
ఈ విషయం తెలిసిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కొక్కటి కోటి 20 లక్షల రూపాయల ఖర్చు చేసే బోట్లని దాదాపు 600 హార్స్ పవర్ ఇంజిన్లు ఉన్నటువంటి నాలుగు బోట్లని ఏర్పాటు చేసాం. జూన్ నాటికి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా భాగస్వామ్యం చేసి మరికొన్ని బోట్లు కూడా ఏర్పాటు చేస్తాం.

సమస్యపై 144 గ్రామాలకు చెందిన గ్రామకాపులు మీటింగులు పెట్టుకున్నారు. అయినప్పటికీ మాజీ సీఎం రాజకీయం చేయడం సిగ్గు చేటు, ఫిషింగ్ హార్బర్ నేనే కట్టానని చెబుతున్న మాజీ సీఎం ఎందుకు వినియోగంలోకి తీసుకురాలేదో సమాధానం చెప్పాలి. కాకినాడ, విశాఖపట్నం, మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్లు ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ నిధులన్నీ కూడా దారి మళ్లించారు. భవిష్యత్తు 30, 40 సంవత్సరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జెట్టీలు కట్టడం జరిగింది.

మొట్టమొదటి నుంచి మాజీ సీఎం  మత్స్యకారులను అరెస్ట్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాడు.  గతంలో సోంపేటలో కాల్పులు జరిపి కుక్కలను ఈడ్చినట్టు ఈడ్చి పడేశారు. గంగవరం, కృష్ణపట్నం పోర్టులో మత్స్యకారుల్ని ఇబ్బంది పెట్టారు. జీవో నెంబర్ 40  తీసుకొచ్చి భవిష్యత్తులో ఇక్కడ ఎటువంటి ఫిషింగ్ హార్బర్ గానీ, హార్బర్లు గానీ కట్టడానికి వీలు లేకుండా జీవోని ఇచ్చారు. పులికాట్ లేక్ వద్ద కూడా ఇబ్బందులు పేడుతున్నారు.

మత్స్యకారులకు మొట్టమొదట 50 సంవత్సరాలకే పెన్షన్, వేట నిషేధ సమయంలో  మృతి ప్రారంభించింది మా పార్టీ ప్రభుత్వమే. గత ఐదేళ్లలో ఒక్క వల లేదు, ఒక్క బోటు లేదు, కేంద్రం ఇచ్చినటువంటి పథకాలను కూడా మత్స్యకారుల సంక్షేమానికి ఇచ్చినటువంటి పథకాలకి కూడా ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. గతంలో 90 శాతం సబ్సిడీతో వలలు ఇచ్చాం, బోట్లు ఇచ్చాం, ఐస్ బాక్సులు ఇచ్చాం, వెహికల్స్ ఇచ్చాం, ఫోర్ వీలర్ వెహికల్స్ ఇచ్చాం, రేఫర్ బాక్సెస్ ఇచ్చాం. కానీ ఒక్కటి కూడా ఈ ఐదు సంవత్సరాలు ఇవ్వకుండా 'ఫిష్ ఆంధ్ర' అని చెప్పి డబ్బులు డైవర్ట్ చేసిన దుర్మార్గుడు మాజీ సీఎం. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ సుపరిపాలన అందిస్తున్నారు. ఆయిల్ సబ్సిడీ, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద రావాల్సినటువంటి స్కీమ్స్  అమలు చేస్తున్నాం. మేము అభివృద్ధి చేస్తుంటే.. మాజీ సీఎంమాత్రం నేను అధికారంలోకి వస్తే అన్ని కూల్చేస్తా అంటూ మాట్లాడుతుండటం సిగ్గు చేటు అని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవ చేశారు.

పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ స్పెషల్ చీప్ సెక్రెటరీ ఎం. టీ. కృష్ణ బాబు మాట్లాడుతూ.. నేడు రాష్ట్రంలో తొలి దశలో  చేపట్టిన 4 ఫిషింగ్ హర్బర్ పనులు త్వరలో పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు.. 3 ఫిషింగ్ హార్బర్ లకు 2 వ దశలో ఆర్థిక శాఖ అనుమతి  తెలపాల్సి ఉందన్నారు. మచిలీపట్నం, జువ్వలదిన్నె వంటి భూమి అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యాధునిక సదుపాయాలు కల్పిస్తు.. దాదాపు ఒక్కో ఫిషింగ్ హార్బర్ రూ. 350 నుంచి రూ. 400 కోట్లతో నిర్మిస్తున్నామన్నారు. ఫిషింగ్ హార్బర్ లో 25 ఎకరాలకు అదనంగా.. అనుబంధ పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయటం ద్వారా యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించవచ్చన్న సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచనలు మేరకు పనిచేస్తున్నామన్నారు.. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ కు దాదాపు 60 ఎకరాలు అందుబాటులో ఉంటే అందులో 47 ఎకరాలు పూర్తిగా ఫిషింగ్ హార్బర్ కొరకు రిజర్వ్ చేశామని తెలిపారు

Spotlight

Read More →