వైసీపీ పాలనలో బాధితులు ఎస్సీ ఎస్టీ బీసీలు పేద ప్రజానికమే అని చెప్పవచ్చు.
పేదలకు ఉపాధి అవకాశాలను గండి కొట్టి సంక్షేమ పథకాల పేరుతో ఈయన మభ్యపెడుతున్నారు.
ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు అయితే వారి అభివృద్ధి కొరకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా ఈయన ప్రభుత్వం హరించి వేసింది.
ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి ఆయా వర్గాల ఆర్థిక అభివృద్ధికి రుణాలు మంజూరు చేసి ఉపాధి అవకాశాలు కల్పించేవారు.
ఈయన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కులానికి ఒక పదవి ఇచ్చి సామాజిక న్యాయం అంటూ ఆర్భాటపు ప్రకటనలు ప్రారంభించారు.
ఇప్పటివరకు ఏ ఒక్క కార్పొరేషన్కు ఒక్క రూపాయి నిధులు మంజూరు చేసిన దాఖలాలు లేవు.
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఉపాధి అవకాశాలకు కోట్లాది రూపాయలు గత ప్రభుత్వాలు వెచ్చించి ఎన్నో కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి చేశారు.
ఈ కార్పొరేషన్ల యొక్క నిధులను నవరత్నాలకు మళ్లించి ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు ఈయన ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది.
ఈయన ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ నిధులను దారి మళ్లించడం పై ఆయా కులాలకు చెందిన వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఎస్సీ కార్పొరేషన్ నిధుల మళ్లింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.
ఆ నిధులను నవరత్నాలకు ఎలా మళ్లిస్తారని నిలదీసింది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఎస్సీ కార్పొరేషన్ నిధుల మళ్లింపు పిటిషన్ పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
నవరత్నాల ద్వారా పేదలకు పథకాలు అందిస్తున్నామని ఎస్సీ కార్పొరేషన్ నిధులు మళ్లించడం పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
స్వయం ఉపాధి కింద బడ్జెట్లో కేటాయించిన ₹7వేల కోట్లలో ఏమీ ఖర్చు చేయలేదా అని ప్రశ్నించింది.
ఎస్సీ కార్పొరేషన్ ఉద్దేశం నెరవేరనప్పుడు దాన్ని మూసేయడం మంచిదని వ్యాఖ్యానించింది.
బిల్లుల చెల్లింపు వివరాలతో అఫిడవిట్ వేయాలని ఎస్సీ కార్పొరేషన్ ఎండీని ఆదేశించింది.
ప్రభుత్వ ఉద్యోగాలను నమ్ముకుని శిక్షణ కేంద్రాలలో వేలకు వేలు వెచ్చించి శిక్షణ పొందిన ఎస్సీ ఎస్టీ బీసీ కులాలు చెందిన ఎంతో మంది నిరుద్యోగులు రాష్ట్రంలో నిస్సహాయులుగా మారారు.
రాష్ట్రంలో ఏ ఒక్క శాఖలో కూడా ఒక్క ఉద్యోగాన్ని కూడా ఈయన భర్తీ చేయలేదు.
ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తానని సంవత్సరానికి ఒకసారి మెగా డీఎస్సీ నిర్వహిస్తానని ఎన్నికల ముందు ఈయన ఆర్భాటపు ప్రకటనలు చేశారు.
ఈయన మాటలను నమ్మి నిరుద్యోగులు నిండా ముని గారు.
కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనాలు కూడా చెల్లించని దుస్థితిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది.
చిన్న పిల్లలకు ఆరోగ్య పరిరక్షణలో ప్రధాన పాత్ర పోషిస్తున్న అంగన్వాడీలకు కనీసం నెలకు 2000 రూపాయలు వేతనం పెంచాలన్న ప్రభుత్వం కనికరించడం లేదు.
వివిధ శాఖలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన కోర్కెల పరిష్కారానికి కూడా ప్రభుత్వం శ్రద్ధ వహించడం లేదు.
ఈయన పాలన తో విసుగు చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు పూర్తిగా ఈయన ప్రభుత్వం పడగొట్టటమే ధ్యేయంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి