రాష్ట్రం మొత్తం ఆ నాలుగు కుటుంబాల చేతిలో కీలు బొమ్మగా మార్చే ప్రయత్నం! వైకాపా అంతమే పంతం అంటున్న దళితులు

ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో పెద్దా రెడ్లు వైకాపాను వీడి తెలుగుదేశంలో చేరిన విషయం తెలిస

Published : 2024-01-25 17:28:00

ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి.

ఇప్పటికే నెల్లూరు జిల్లాలో పెద్దా రెడ్లు వైకాపాను వీడి తెలుగుదేశంలో చేరిన విషయం తెలిసిందే.

నెల్లూరు జిల్లాలో వైకాపా పార్టీ 80 శాతం ఖాళీ అయిపోయింది.

ప్రకాశం జిల్లాలో కూడా వైకాపా పార్టీ నుండి తెలుగుదేశం లోనికి వలసలు భారీగా పెరిగాయి.kకృష్ణాజిల్లాలో కేశినేని నాని టీడీపీ వీడి వైకాపాలో చేరడంతో వైకాపా నుండి పలువురు ఎమ్మెల్యేలు తెలుగుదేశంలోకి వచ్చి చేరుతున్నారు.

సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన కొలుసు పార్థసారధి, వసంత కృష్ణ ప్రసాద్ లు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.

తిరువూరు శాసనసభ్యులు రక్షణ నిధి కూడా తెలుగుదేశంలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

వైయస్సార్సీపి మూడు జాబితాలలో 99% ఎస్సీ ఎస్టీ బీసీల నియోజకవర్గం అభ్యర్థులను మార్చడంపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత పెరిగింది.

ఈయన బహిరంగంగానే వ్యతిరేకిస్తూ ఉండటంతో శాసనసభ్యులు పక్క పార్టీలలోకి చూస్తున్నారు.

జనసేన పార్టీలో కాపులను చేర్చడానికి ఈయన ముద్రగడ పద్మనాభం అడ్డుపెట్టుకొని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

ఐదేళ్ల అధికారం తర్వాత ఈయన అధికారాన్ని నిలబెట్టుకోవడం ఎలాగో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు.

టికెట్ల పంపిణీ విషయంలో కూడా ఆయన వాళ్లకు ఆకుల్లో కాని వాళ్లకు కంచాలలో పెడుతున్నారు.

ఈయన నమ్ముకున్న వారందరికీ 2024 ఎన్నికల్లో మొండి చేయి చూపించి ఈయన తన నైజాన్ని చాటుకుంటున్నారు.

రాష్ట్ర మొత్తాన్ని మూడు నాలుగు కుటుంబాల చేతిలో కీలుబొమ్మగా చేసే ప్రయత్నాలు వైసిపి పార్టీలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ కుటుంబానికి రెండు ఎంపీలు, మూడు ఎమ్మెల్యే స్థానాలు కేటాయించి ఉత్తరాంధ్రను బొత్స సత్యనారాయణ కు అప్పగించారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆయన కుమారుడు మిథున్ రెడ్డికి తమ్ముడు ధనుంజయ రెడ్డికి టికెట్లు కేటాయించి ఆ ప్రాంతాన్ని పెద్దిరెడ్డి కుటుంబానికి దారా దత్తం చేశారు.

ప్రకాశం జిల్లాలో ఆదిమూలపు సురేష్ కుటుంబంలో మూడు ఎమ్మెల్యే స్థానాలు కేటాయించారు.

కడప జిల్లాలో వైయస్ ఫ్యామిలీ నుండి మెజారిటీ స్థానాల్లో పోటీ చేస్తున్నారు.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒకవైపు రెడ్లలో వైసిపి పట్ల పూర్తి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.

మరొకవైపు టిడిపి జనసేన ను గెలిపించడమే లక్ష్యంగా కమ్మ కాపు కులస్తులు ఏకమయ్యారు.

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వంలో దళితులకు జరిగిన అన్యాయాలకు దళితులు వైకాపా అంతం దళితుల పంతంమంటూ వైకాపాను ఓడించడానికి సిద్ధమయ్యారు.

ఈయన టిక్కెట్లు కేటాయింపులు చేస్తున్న బదిలీలు వైసీపీ పార్టీని పుట్టించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

కృష్ణా గుంటూరు జిల్లాలలో అమరావతి రాజధానిపై ఈయన తీసుకున్న నిర్ణయంపై ఒక్క సీటు కూడా వైకాపా గెలవడానికి వీల్లేదు అంటూ ఆ ప్రాంత ప్రజలు కృతనిశ్చయంతో పని చేస్తున్నారు.

జనసేన టిడిపి కలయికతో ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాలలో వైసిపి తుఫానులో చిగురుటాకుల ఎగిరిపోవడం ఖాయం.

రాయలసీమలో ఈయన పాలనతో విసుగు చెందిన రాజకీయ ప్రాబల్యం కలిగిన ఎంతోమంది రెడ్లు వైకాపాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

రాష్ట్రం నలుమూలల వైకాపా వ్యతిరేక పవనాలు బలంగా వేస్తూ ఉండడంతో రాబోయే ఎన్నికలలో ఈయన ప్రభుత్వం ఘోర పరాజయాన్ని చవిచూస్తుంది.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →