దేశంలో ఒకప్పుడు పారదర్శకతో కూడిన రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నికల నిర్వహించేవారు.
ఈవీఎం మిషన్లో వచ్చిన తరువాత ఎన్నికల సులభతరంగా జరుగుతున్న ప్రజలకు ఎన్నో రకాలైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈవీఎంలను వ్యతిరేకించాలంటూ భారతదేశంలో ఎంతో మంది ప్రజలు ముక్తకంఠంతో ఎలుగెత్తి సాటుతున్నారు.
ఈవీఎం విధానం ద్వారా అధికార పార్టీ నేతలు మిషన్లను ట్యాంపరింగ్ చేసి అధికారాన్ని అస్తగతం చేసుకుంటున్నాయని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు.
దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు కూడా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా పలు నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల సంక్షేమానికి తూట్లు పొడుస్తోంది.
సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here
అదే బాటలో వారి ఆశీస్సులతో అనేక రాష్ట్రాలలో ప్రభుత్వాలు కూడా ప్రజా వ్యతిరేకంగా పాలన సాగిస్తున్నారు.
దీనికంతటికి ప్రధాన కారణం ఈవీఎంల ట్యాంపరింగ్ ద్వారా మళ్ళీ అధికారం సాధించవచ్చునని ధైర్యంతో నేనని పలువురు విమర్శిస్తున్నారు.
సుప్రీంకోర్టు న్యాయవాదులు ఈవీఎంలను వ్యతిరేకిస్తూ ఆందోళన బాట పట్టారు.
సీలు వేసిన 50 ఈవీఎం ఇస్తే వాటి ద్వారా ఓట్లను ఎలా ట్యాంపరింగ్ చేయవచ్చునో ప్రత్యక్షంగా చూపిస్తామని వారు సవాలు విసుర్తున్నారు.
ఈవీఎంలు వద్దు పేపర్ బ్యాలెట్లు ముద్దు అంటూ సుప్రీంకోర్టు న్యాయవాదులు చీఫ్ ఎలక్షన్ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన ఉదృతం చేశారు.
2024లో దేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికలలో ఈవీఎంలను ఉపయోగించరాదంటూ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు న్యాయవాదులే వ్యతిరేకిస్తున్నారంటే కచ్చితంగా ఈవీఎంలు ప్రజాభిప్రాయాన్ని మారుస్తున్నాయని చెప్పవచ్చు.
పేపర్ బ్యాలెట్ ద్వారా జరిగే ఎన్నికలలో ఏ గ్రామంలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలియకుండా వాటిని కట్టలు కట్టి కలిపి వేసి ఆ తర్వాత లెక్కించేవారు.
నేడు గ్రామంలో బూతుల వారీగా ఈవీఎంలు ఇచ్చే రిపోర్టును బట్టి ఆ ప్రాంతంలో అధికార పార్టీకి మెజారిటీ రాకపోతే వారిపై కక్ష సాధింపులు పెరిగాయి.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
అధికార పార్టీ నాయకులు మెజార్టీ రాని గ్రామాలపై ఆ గ్రామ నాయకుల పైన దాడులకు తెగబడుతున్నారు.
ఆ గ్రామాలలో అభివృద్ధి కూడా పూర్తిగా కుంటుపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ప్రజలు కూడా తమకు నచ్చిన పార్టీకి వేసిన ఓటు వారికి పడిందో ఎవరికి పడిందో కూడా కంటితో చూసుకోలేని పరిస్థితి.
ప్రపంచంలో ఏ దేశంలోనూ కూడా ఎన్నికలు ఈవీఎంలను ఉపయోగించి జరపడం లేదు.
ఒక్క భారతదేశంలో మాత్రమే ఈవియంలను ఉపయోగించి ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
ఎక్కడో చంద్ర గ్రహం పై ఉన్న మిషన్లను కూడా భూమి పై నుండి ఆపరేట్ చేసే టెక్నాలజీ వచ్చిన తర్వాత గ్రామాలలో జరిగే ఎన్నికల ఫలితాలను ఎందుకు తారుమారు చేయలేరన్నది మేధావుల ప్రశ్న.
దేశంలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయిన ఈ తరుణంలో ప్రజలు ఈవీఎంలను నమ్మే పరిస్థితి లేదు.
అత్యున్నత విభాగాలకు చెందిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా అధికార ప్రభుత్వం నడుపుతున్న పార్టీలకు తొత్తులుగా మారి పనిచేస్తున్న పరిస్థితులు దేశంలో కనపడుతున్నాయి.
ఈ పరిస్థితులలో ఈవిఎం మిషన్ ద్వారా వచ్చే ఫలితాలు ప్రజా తీర్పును మార్పులు చేర్పులు చేసే ప్రమాదం ఉందన్నది సుప్రీంకోర్టు న్యాయవాదుల అభిప్రాయం.
సుప్రీంకోర్టు న్యాయవాదుల అభిప్రాయంతో రాష్ట్రంలోని అనేక పార్టీలు ఏకీభవిస్తున్నాయి.
ఈవీఎంలలో ఏ తప్పు జరగదని నమ్మకం ఉన్నప్పుడు ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని పేపర్ బ్యాలెట్ విధానం ద్వారా ఎన్నికలు జరపడానికి ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరాలు ఏమిటో చెప్పాలి.
అధికారం పార్టీలకు తమ అధికారాలను నిలబెట్టుకోవడానికి ఈవీఎం మిషన్లో ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అనడానికి ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తమ డెమోల ద్వారా నిరూపించారు.
ప్రభుత్వం వీటిని ఏటిని పట్టించుకోకుండా ఎన్నికలను ఈవీఎం విషయాల ద్వారానే జరిపి అధికారాలను పదిలం చేసుకోవడానికి సన్నద్దమవుతున్నాయి.
సుప్రీంకోర్టు న్యాయవాదుల ఉద్యమాలకు ప్రతిపక్షాలు ప్రజలు కూడా తోడైతే పేపర్ బ్యాలెట్ విధానం మళ్లీ వచ్చే అవకాశం ఉంది.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలు ప్రతిపక్షాలు పేపర్ బ్యాలెట్ విధానం ద్వారా ఎన్నికల కొరకు ఉద్యమాన్ని ఉదృతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి