ఉద్యమాంధ్రప్రదేశ్ గా మారిన రాష్ట్రం! చివరికి నమ్ముకున్న వాలంటీర్లు సైతం!!

ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ప్రభుత్వ అరాచకాలపై ప్రజలు ఉద్యమ బాట పట్టి రోడ్డుఎక్కుతున్నారు. ఈయన కళ్ళు, చెవులు కాళ్ళుగా భావించిన గ్రామ వార్డు వాలంటీర్లు కూడా నేటి ను

Published : 2024-01-02 17:52:00

ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ప్రభుత్వ అరాచకాలపై ప్రజలు ఉద్యమ బాట పట్టి రోడ్డుఎక్కుతున్నారు.

ఈయన కళ్ళు, చెవులు కాళ్ళుగా భావించిన గ్రామ వార్డు వాలంటీర్లు కూడా నేటి నుండి సమ్మెబాట పట్టారు.

ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండే పత్రిక రంగాన్ని పాలన రంగాలను ప్రతిపక్షాలను ఈయన అణచివేసి వాలంటీర్ వ్యవస్థను సృష్టించారు.

ప్రజలకు ఏ సంక్షేమ పథకం కావాలన్నా అధికారులు, సర్పంచ్, ఎమ్మెల్యే, మంత్రులతో పనిలేదు.

వాలంటీర్ చెప్తే సంక్షేమ పథకానికి అర్హులో కాదో చెప్పి అర్హత ఉండాలంటే ఏం చేయాలో కూడా దొడ్డిదారులు చెప్పి సంక్షేమ పథకాలు అందించేవారు.

5000 రూపాయలు వేతనానికి ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు వాలంటీర్లతో ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించిందని వాలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కేవలం మూడు నాలుగు నెలలు మాత్రమే ఎన్నికల గడువు ఉన్న నేపథ్యంలో నెలకు 18 వేల రూపాయలు ఇవ్వాలంటూ వాలంటీర్లు సమ్మెబాట పెట్టారు.

వచ్చే ప్రభుత్వంలో అసలు వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా లేదో తెలియని అయోమయంలో పడ్డారు.

వాలంటీర్లు వ్యవస్థను ఏర్పాటు చేసిన ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధపడ్డారు.

గ్రామపంచాయతీలలో నిధులను ప్రభుత్వం దారి మళ్లించి పంచాయతీ సర్పంచుల అధికారాలకు కోత పెట్టడంతో ఉద్యమాన్ని సన్నద్ధమవుతున్నారు.

ఇప్పటికే ప్రభుత్వంపై సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు ఉద్యమం ప్రకటించారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

అంగన్వాడి వర్కర్లు, ఆయాలు గత 20 రోజులుగా అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు వేసి ఉద్యమ బాటలో ఉన్నారు.

ఈయన   పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ అంగన్వాడీలు ఎమ్మెల్యేల ఇళ్లను కూడా ముట్టడి చేశారు.

రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పారిశుధ్య సిబ్బంది సమ్మె దీక్షపెట్టారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆరోగ్యశ్రీ బకాయిలు కూడా చెల్లించని పరిస్థితుల్లో ఉన్నందున నేటి నుండి ఆరోగ్యశ్రీ సేవలను బందు చేశారు.

ప్రభుత్వం ఏర్పడి మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండి అమరావతి ప్రాంతంలో నిర్విరామంగా ఉద్యమం జరుగుతూనే ఉంది.

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు వ్యక్తులకు అమ్మకానికి పెట్టిన నాటి నుండి ఆ ప్రాంతంలో ఉద్యోగులు ప్రజలు ఉద్యమం చేస్తూనే ఉన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే టీచర్లకు ప్రభుత్వం ప్రకటించిన రాయితీలు దేవుడెరుగు ప్రతినెలా వచ్చే జీతం ఒకటవ తేదీన ఇవ్వాలంటూ ఆందోళనలు చేస్తున్నారు.

సిపిఎస్ రద్దు చేయాలి, ఇంక్రిమెంట్లు ఇవ్వాలి,
టి ఎ, డి ఎ లు ఇవ్వాలని దీర్ఘకాలంగా చేస్తున్న ఉద్యమాన్ని పక్కనపెట్టి ఒకటవ తేదీన జీతాలు చెల్లించండి మహా ప్రభో అంటున్నారు.

గత ప్రభుత్వంలో నిర్మించిన టిడ్కో గృహాలను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని లబ్ధిదారులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.

టిడ్కో గృహాల పంపిణీకి ప్రభుత్వం ముందడుగు వేయకపోవడంతో వచ్చే ప్రభుత్వంపైనే ఆశలతో ఉద్యమాలు చేస్తున్నారు.

గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్టర్లను ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తుంది.

కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించాలంటూ ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చే విధంగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు.

ప్రతిపక్ష పార్టీలు పెంచిన విద్యుత్ చార్జీలు ఇంటి పనులు తగ్గించాలని, దేశంలో ఎక్కడా లేనివిధంగా విధించిన చెత్త పన్ను తొలగించాలంటూ ప్రజలతో కలిసి ఉద్యమాలు చేస్తున్నారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →