ఈయన పాలనలో అనాలోచిత నిర్ణయాలే వైసిపి పార్టీ మునిగే ప్రమాదం కనిపిస్తోంది.
అమరావతి రాజధాని కాకుండా మూడు రాజధానుల ప్రకటనతో సుమారు 20 నియోజకవర్గాలలో వైసిపి పతనావస్థకు చేరింది.
మూడు రాజధానుల ప్రకటన కేవలం ఒక కులం మీద చంద్రబాబు మీద ద్వేషంతో ఈయన తీసుకున్న నిర్ణయం తప్ప అటు పార్టీకి కూడా ఉపయోగం లేదు.
మూడో రాజధానుల ప్రకటన వల్ల వైసీపీ పార్టీకి ఒక్క నియోజకవర్గంలో కూడా లబ్ధి చేకూరలేదు.
ఈయన నవరత్నాల పేరుతో కేవలం సంక్షేమ పథకాలను మాత్రమే నమ్ముకుని బట్టన్ నొక్కడం తప్ప పాలనలో పారదర్శకత లేదు.
రాష్ట్రంలో అభివృద్ధి అన్నది మర్చిపోకు కనపడని పరిస్థితి ఉండడంతో ప్రజలలో వైసిపి పట్ల వ్యతిరేకత బాగా పెరిగింది.
ప్రభుత్వ పెద్దలుగా పేరుందిన కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలను ముందు పెట్టి రాష్ట్ర సంపద దోపిడీపై కూడా వైసిపి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది.
దీని ప్రభావంతో రాష్ట్రంలో 40 మందికి పైగా ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఏర్పడింది.
రాష్ట్రంలో ఈయన ప్రభుత్వం ఏర్పడిన తరువాత భారీగా పెరిగిన విద్యుత్ ఛార్జీలుతో జగన్ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారు.
రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని సదుపాయాలతో ప్రభుత్వంలో గాని ప్రైవేట్ రంగంలో కానీ ఒక్క ఆసుపత్రి కూడా ఏర్పాటు కాలేదు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లేందుకు రోడ్లు లేవు, ఆ ప్రాంతాన్ని ఈయన నిర్వీర్యం చేశారు.
టిడిపి ప్రభుత్వంలో పనిచేసిన కాంట్రాక్టర్లకి ఈయన ప్రభుత్వం సొమ్ములు చెల్లించలేదు అనడానికి లేదు ఈయన ప్రభుత్వంలో పనిచేసిన కాంట్రాక్టర్లకు కూడా సొమ్ములు చెల్లించడం లేదు.
ఇదే విషయాన్ని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి పత్రిక ముఖంగా ప్రకటించడం విశేషం.
నియోజకవర్గాలలో ఏ విధమైన అభివృద్ధి లేకుండా వచ్చే ఎన్నికలలో ప్రజల ముందుకు వెళ్లి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతాము అని వైసిపి పార్టీ ఎమ్మెల్యేలే బహిరంగంగా అంటున్నారు.
ఇటువంటి పరిస్థితులలో ఈయన ప్రభుత్వం పై ప్రజలలోనే కాదు పార్టీలో కూడా తీవ్ర వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఈయన ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో వైసిపి పార్టీ నావకు చిల్లు పడింది అని చెప్పవచ్చు.
ఈయన ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, అంగన్వాడి ఉద్యోగులు, సమగ్ర శిక్షణ సంస్థ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు.
ఒకవైపు పార్టీలో జరుగుతున్న ఇబ్బందికర పరిస్థితులను సరిదిద్దుకునే పరిస్థితులలో ఈయన కి రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమాలు మరింత తలనొప్పిగా మారాయి.
ప్రభుత్వంపై ప్రజలలో ఏర్పడిన వ్యతిరేకతను తగ్గించడానికి శాసనసభ్యులను మార్చినంత మాత్రాన ప్రభుత్వ వ్యతిరేకత ఎలా తగ్గుతుందో వైసిపి నేతలకు అర్థం కావడం లేదు.
ఎమ్మెల్యేల పరిస్థితి ఇలా ఉంటే ఎంపీల పరిస్థితి మరి అద్వానంగా తయారైంది.
పలువురు ఎంపీలు తాము వచ్చే ఎన్నికలలో పోటీ చేయలేమని ముందుగానే చేతులెత్తేశారు.
నా ఎస్సీలు నా బీసీలు అంటున్న ఈయన టిడిపి తో జనసేన కలవడంతో వైసిపి పార్టీ నుండి టిడిపి జనసేన కూటమికి వెళ్లే కాపుల ఓట్ల భర్తీ కొరకు బీసీ జపం ప్రారంభించారు.
తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న బీసీలను చీల్చడానికి మరియు కాపులతో బీసీలకున్న వైరం ను తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ఈయన బీసీ జపం చేస్తున్నారు.
రాష్ట్రంలో కులాల కుంపట్లు రాజేయడంలో వైయస్ ఫ్యామిలీ సిద్ధహస్తులు.
1989లో వైయస్ రాజశేఖర్ రెడ్డి వంగవీటి మోహన్ రంగ హత్యను కుల రాజకీయం చేసి తెలుగుదేశం పార్టీని ఓడించి అధికారం దక్కించుకున్నారు.
తండ్రి బాటలోనే కొడుకు కూడా
2019లో కమ్మ కులాన్ని దోషిగా చూపించి ఇతర కులాల ప్రజలను మోసం చేసి 151 సీట్లు ఈయన గెలుచుకుని అధికారం చేపట్టారు.
రాష్ట్రంలో ఈయన పాలనలో అరాచకం రాజ్యమేలు అన్ని కులాల వారు ఇబ్బందులకు గురవుతుంటే వచ్చే ఎన్నికలలో ప్రజలు కులం మతం కాదు అభివృద్ధి ప్రధానమంటున్నారు.
అధికారంలో ఉండి మంగళగిరి అభివృద్ధి చేయకపోవడంతో నారా లోకేష్ ను అక్కడి ప్రజలు ఓడించారని, వైసిపి అధికారంలో ఉండి రాష్ట్రంలో ఏ ఒక్క నియోజకవర్గంలోనూ కూడా అభివృద్ధి చేపట్టకపోవడంతో పార్టీ ఓటమి తద్యమని మంగళగిరి ఎమ్మెల్యే మీడియా ముఖంగా ప్రకటించారు.
ఒకవైపు వైసీపీ పార్టీలో సంక్షోభం, మరొకవైపు ప్రజలలో వ్యతిరేకత, కొన్ని వర్గాల ఉద్యమాలు అన్ని కలగలిసి వైసిపి ఓటమికి దారితీస్తున్నాయి.
ఎన్నికల సమీపిస్తున్నందున ఇప్పటివరకు అనేక సంస్థలు రాష్ట్రంలో జరిపిన సర్వేలలో కూడా వైసీపీ పార్టీ అధికారం కోల్పోతుందని స్పష్టంగా ప్రకటిస్తున్నాయి.
రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాలతో ఈయన తాడేపల్లి నుండి పక్క రాష్ట్రానికి బిచాణ ఎత్తేయడం ఖాయంగా తెలుస్తోంది.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి