AP Rains: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. నేడు 9 జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు! Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం 400 దాటింది..! చైనా సహాయ హామీ..! మళ్లీ ఏపీలో వర్షాలు... ఉపరితల ఆవర్తన ప్రభావం! రాబోయే 24 గంటల్లో... ప్రకృతి ప్రళయం... 9 సెం.మీ. సైజు వడగళ్ళు వాన! పలువురికి తీవ్ర గాయాలు! విశాఖలో తెల్లవారుజామున భూ ప్రకంపనలు.. ఉలిక్కిపడ్డ ప్రజలు! Pulicat Lake: ఫ్లెమింగో రాకతో మెరిసిన ప్రకృతి అందాలు... పులికాట్‌ను ఎకో టూరిజం గమ్యస్థానంగా మలుస్తున్న ప్రభుత్వం! Super Moon: ఈ నెల 5న బీవర్ సూపర్ మూన్ దర్శనం.. ఎటువంటి పరికరాలు అవసరం లేకుండా మన కంటికే కనిపించే ఆకాశ అద్భుతం! Delhi air pollution: ఇంద్రప్రస్థం చుట్టుముట్టిన వాయు కాలుష్యం – ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారిన రాజధాని! APSDMA: బాపట్ల నుంచి నెల్లూరు దాకా వర్షాలు... APSDMA హెచ్చరిక! Nepal: మనాంగ్ జిల్లాలో భారీ మంచు వర్షం! వేలాది పర్యాటకుల రక్షణకు రంగంలోకి సైన్యం! AP Rains: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. నేడు 9 జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు! Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం 400 దాటింది..! చైనా సహాయ హామీ..! మళ్లీ ఏపీలో వర్షాలు... ఉపరితల ఆవర్తన ప్రభావం! రాబోయే 24 గంటల్లో... ప్రకృతి ప్రళయం... 9 సెం.మీ. సైజు వడగళ్ళు వాన! పలువురికి తీవ్ర గాయాలు! విశాఖలో తెల్లవారుజామున భూ ప్రకంపనలు.. ఉలిక్కిపడ్డ ప్రజలు! Pulicat Lake: ఫ్లెమింగో రాకతో మెరిసిన ప్రకృతి అందాలు... పులికాట్‌ను ఎకో టూరిజం గమ్యస్థానంగా మలుస్తున్న ప్రభుత్వం! Super Moon: ఈ నెల 5న బీవర్ సూపర్ మూన్ దర్శనం.. ఎటువంటి పరికరాలు అవసరం లేకుండా మన కంటికే కనిపించే ఆకాశ అద్భుతం! Delhi air pollution: ఇంద్రప్రస్థం చుట్టుముట్టిన వాయు కాలుష్యం – ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారిన రాజధాని! APSDMA: బాపట్ల నుంచి నెల్లూరు దాకా వర్షాలు... APSDMA హెచ్చరిక! Nepal: మనాంగ్ జిల్లాలో భారీ మంచు వర్షం! వేలాది పర్యాటకుల రక్షణకు రంగంలోకి సైన్యం!

Water Supply: తాగునీటి సమస్యలపై భారీ ప్రణాళిక..! భూగర్భ జలాలకు బదులుగా ఆ జలాలతో నీటి సరఫరా..!

2025-11-06 18:30:00
ప్రపంచ యాత్ర కల నిజం చేయబోతున్న IRCTC! తక్కువ ధరలో అంతర్జాతీయ టూర్ ప్యాకేజీలు!

ఆంధ్రప్రదేశ్‌లో తాగునీటి సమస్యలకు త్వరలో పరిష్కారం దొరకనుంది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా శుద్ధమైన మంచినీరు అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జల్ జీవన్ మిషన్ను మళ్లీ వేగవంతం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వ కాలంలో నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభిస్తూ వాటిని పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలో జాతీయ ఆర్థిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి బ్యాంక్‌ (NaBFID) నుండి రూ.10 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన చర్చలు ఇప్పటికే పూర్తవగా, బ్యాంకు మూడు విడతల్లో లోన్‌ను విడుదల చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. ప్రస్తుతం ఈ రుణ ప్రతిపాదన టెక్నికల్ ఫీజిబిలిటీ కమిటీ పరిశీలనలో ఉంది. ఈ నెలాఖరులో ఆమోదం లభించే అవకాశం ఉందని అధికార వర్గాలు సూచిస్తున్నాయి.

F&O Trading: F&O ట్రేడింగ్‌ నిలిపే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదు — స్పష్టత ఇచ్చిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్!!

రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన తాగునీటి కుళాయి కనెక్షన్ ప్రాజెక్టు డీపీఆర్‌ (Detailed Project Report) కు కేంద్ర ఆమోదం లభించిన తర్వాతే ఈ రుణం మంజూరు అవుతుంది. గతంలో బోరుబావుల ఆధారంగా నీటి సరఫరా జరిపినప్పుడు వేసవిలో భూగర్భజలాలు తగ్గడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారని ప్రభుత్వం గుర్తించింది. అందుకే ఇప్పుడు నదులు, జలాశయాల నుంచి నీరు సేకరించి శుద్ధి చేసి కుళాయిల ద్వారా ప్రజలకు అందించేలా కొత్త ప్రణాళికను రూపొందించింది. మొత్తం రూ.84,500 కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసింది. దీనికి కేంద్రం ఆమోదం లభిస్తే, NaBFID రుణం విడుదలకు మార్గం సుగమమవుతుంది.

Super Moon visible: ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది.. ఈ రాత్రి బీవర్ సూపర్ మూన్ కనువిందు!

జల్ జీవన్ మిషన్‌ కింద కేంద్రం మొదట ఆమోదించిన రూ.27 వేల కోట్ల ప్రాజెక్టును గత ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తోంది. రాష్ట్ర వాటా నిధులు సమయానికి కేటాయించకపోవడం, కేవలం రూ.4 వేల కోట్లకు మాత్రమే పనులు జరపడం వల్ల ప్రాజెక్టు నిలిచిపోయిందని పేర్కొంది. ప్రస్తుతం ప్రభుత్వం ఆ పెండింగ్‌ పనులను పూర్తి చేయడంపై దృష్టి సారించింది. రూ.23 వేల కోట్ల విలువైన ఈ పనులను రెండేళ్లలో పూర్తిచేసి రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ తాగునీటి కుళాయి కనెక్షన్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్! వాటిపై రూ.30వేలు, రూ.12వేలు వరకు భారీ సబ్సిడీ!

ఈ మొత్తం ప్రాజెక్టులో రాష్ట్రం రూ.10 వేల కోట్లను రుణంగా సమకూర్చుకోగా, మిగతా రూ.13 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం భరించనుంది. ఈ నిధులతో 25 లక్షలకుపైగా ఇళ్లకు తాగునీటి కనెక్షన్లు ఇవ్వాలని ప్రణాళిక రూపొందించారు. ముఖ్యంగా శ్రీకాకుళం, అనకాపల్లి, పల్నాడు, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, విజయనగరం, కర్నూలు, అనంతపురం వంటి వెనుకబడిన జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు పూర్తైతే రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఏడాది పొడవునా తాగునీటి సమస్య ఉండదని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

Movie update: పెద్ది నుంచి ‘చికిరి’ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్ — రామ్ చరణ్ హుక్ స్టెప్‌కి సోషల్‌ మీడియాలో హైప్!!
Andhra Pradesh: రాయలసీమలో రూ.22,000 కోట్ల పెట్టుబడులు — SAEL ఇండస్ట్రీస్ ప్రాజెక్టులతో భారీగా ఉద్యోగావకాశాలు!!
New Year 2026: న్యూ ఇయర్ 2026 ట్రావెల్ ట్రెండ్.. బీచ్‌లు లాంతర్లు, లగ్జరీ పార్టీలు.. మీ గమ్యం ఏది!
healthy skin remedies: బ్యూటీ క్రీమ్స్ ఎందుకు? చర్మానికి సొరకాయ ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యానికి గురవుతారు!!
Liquor: ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు..! బెయిల్‌ పిటిషన్‌పై కోర్టు సీరియస్‌..!
140 మీటర్ల వెడల్పు, 6 వరుసల రోడ్డు.. అమరావతి ORRపై కీలక అప్‌డేట్! 40 గ్రామాల్లో భూసేకరణ...

Spotlight

Read More →