అమెరికా: అమెరికాను మంచు తుఫాన్ వణికిస్తోంది. గత వారం రోజులుగా ఎడతెగని తుఫానులు యునైటెడ్ స్టేట్స్ లో బీభత్సం సృష్టిస్తున్నాయి. జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఖాళీ లేకుండా కురుస్తున్న మంచు తుఫాన్ తో రోడ్లపై మంచు పేరుకుంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మంచు తుఫాన్ కారణంగా అమెరికాలోని పలు రాష్ట్రాల్లో 50 మందికి పైగా మరణించినట్లు తెలీలపారు.
చల్లని గాలులు, తగ్గిన ఉష్ణోగ్రతలు, దట్టమైన మంచు కారణంగా ప్రజలు అవస్థలు పడుతున్నారు. రహదారులపై మంచు ఘోరమైన ప్రమాదాలకు కారణం అవుతుంది. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో పలు విమానాలను రద్దు చేశారు, పాఠశాలలను మూసివేశారు.
టేనస్సీలో 14 వాతావరణ సంబంధిత మరణాలను రాష్ట్ర ఆరోగ్య విభాగం ధృవీకరించింది. అయితే మక్కాకు తీర్థయాత్ర చేసి ఇంటికి తిరిగి వస్తున్న ఐదుగురు మహిళలు మంగళవారం పెన్సిల్వేనియా హైవేపై ట్రాక్టర్- ట్రైలర్ తో ప్రమాదంలో మరణించారని పోలీసులు తెలిపారు.
కెంటకీలో ఐదుగురు మరణించారని గవర్నర్ ఆండీ బెషీర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒరెగాన్ లో, బుధవారం మంచు తుఫాను కురుస్తున్న సమయంలో విద్యుత్ లైన్ తెగి పడి ఆగి ఉన్న కారుపై పడడంతో ముగ్గురు వ్యక్తులు విద్యుదాఘాతానికి గురయ్యారని పోర్ట్ ల్యాండ్ అగ్నిమాపక విభాగం తెలిపింది.
సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి