Bigg Boss: బిగ్‌బాస్‌లో బిగ్ ఫైట్... కంటెస్టెంట్ల గొడవతో హౌజ్ కుదిపేసిన ఎపిసోడ్! Movie Update: చీకటి గుహలో మీనాక్షి: ఎన్‌సీ 24 మిస్టరీ థ్రిల్లర్‌.. దక్ష ఏం కనిపెడుతోంది? JioHotstar ott : ప్లాన్ ధరల పెంపు.. జియోహాట్‌స్టార్ తన ప్రీమియం అడ్-ఫ్రీ ప్లాన్ ధరలను పెంచే యోచనలో! మాస్ జాతరలో పవర్‌ఫుల్ లేడీ ఎంట్రీ – రవితేజను డామినేట్ చేసే సింగం ఎవరు? చిచ్చుపెట్టాలని చూస్తే నాశనమైపోతారు.. మంచు ఫ్యామిలీ విభేదాల రూమర్స్‌పై లక్ష్మి సంచలనం! ఓటీటీ లవర్స్‌కు పండగ.. ఒక్క రోజులో 20 కొత్త సినిమాలు! బ్లాక్ బస్టర్ నుంచి క్రైమ్ థ్రిల్లర్ వరకు.. ఇక్కడ చూసేయండి! Jio Hotstar: జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్! రూ.1కే హాట్‌స్టార్ ప్రీమియం ప్లాన్! తప్పక చూడాల్సిన అద్భుతమైన కె-డ్రామాలు! వెంటనే వాచ్ లిస్ట్ లో యాడ్ చేసేయండి! OTT Movie: ఓటీటీలో దడపుట్టించే 'బారాముల్లా': సవాలు విసిరిన మిస్సింగ్ కేసు.. ట్రైలర్ విడుదల! Delhi Pollution news: ఆకాశంలో మేఘాలు ఉన్నా వర్షం ఎందుకు రాలేదు? ఢిల్లీలో విఫలమైన రూ.60 లక్షల కృత్రిమ వర్ష ప్రయోగం వెనుక అసలైన సైన్స్ ఇదే! Bigg Boss: బిగ్‌బాస్‌లో బిగ్ ఫైట్... కంటెస్టెంట్ల గొడవతో హౌజ్ కుదిపేసిన ఎపిసోడ్! Movie Update: చీకటి గుహలో మీనాక్షి: ఎన్‌సీ 24 మిస్టరీ థ్రిల్లర్‌.. దక్ష ఏం కనిపెడుతోంది? JioHotstar ott : ప్లాన్ ధరల పెంపు.. జియోహాట్‌స్టార్ తన ప్రీమియం అడ్-ఫ్రీ ప్లాన్ ధరలను పెంచే యోచనలో! మాస్ జాతరలో పవర్‌ఫుల్ లేడీ ఎంట్రీ – రవితేజను డామినేట్ చేసే సింగం ఎవరు? చిచ్చుపెట్టాలని చూస్తే నాశనమైపోతారు.. మంచు ఫ్యామిలీ విభేదాల రూమర్స్‌పై లక్ష్మి సంచలనం! ఓటీటీ లవర్స్‌కు పండగ.. ఒక్క రోజులో 20 కొత్త సినిమాలు! బ్లాక్ బస్టర్ నుంచి క్రైమ్ థ్రిల్లర్ వరకు.. ఇక్కడ చూసేయండి! Jio Hotstar: జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్! రూ.1కే హాట్‌స్టార్ ప్రీమియం ప్లాన్! తప్పక చూడాల్సిన అద్భుతమైన కె-డ్రామాలు! వెంటనే వాచ్ లిస్ట్ లో యాడ్ చేసేయండి! OTT Movie: ఓటీటీలో దడపుట్టించే 'బారాముల్లా': సవాలు విసిరిన మిస్సింగ్ కేసు.. ట్రైలర్ విడుదల! Delhi Pollution news: ఆకాశంలో మేఘాలు ఉన్నా వర్షం ఎందుకు రాలేదు? ఢిల్లీలో విఫలమైన రూ.60 లక్షల కృత్రిమ వర్ష ప్రయోగం వెనుక అసలైన సైన్స్ ఇదే!

Andhra Pradesh: డ్రగ్స్ వద్దు బ్రో అంటున్న ప్రభుత్వం – డ్రగ్స్ తీసుకో బ్రో అని యువతను నాశనం చేస్తున్న వైసీపీ.. హోం మంత్రి అనిత!!

2025-11-06 14:32:00

రాష్ట్ర హోం మంత్రి శ్రీమతి తానేటి  అనిత  మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “నేటి యువతే రేపటి ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు. అందుకే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు యువత రక్షణ, భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తున్నారు” అని తెలిపారు.

డ్రగ్స్‌ సమస్యపై ప్రభుత్వం సున్నా సహనం విధానాన్ని అవలంబించిందని ఆమె చెప్పారు. ఈగల్‌ అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి, రాష్ట్రవ్యాప్తంగా గంజాయి సాగును దాదాపు జీరో స్థాయికి తగ్గించామని వివరించారు. “డ్రగ్స్ వద్దు బ్రో” అనే నినాదాన్ని పాఠశాల స్థాయికి తీసుకెళ్లి, 50 వేల స్కూళ్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.

“ఒక తల్లి తన కుమార్తెను రక్షించండి అని వేడుకున్న సందర్భం నాకెప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ ఘటన తర్వాతే డ్రగ్స్‌ను రాష్ట్రం నుంచి పూర్తిగా తుడిచిపెట్టాలని సంకల్పించాం,” అని అనిత గారు చెప్పారు.

వైసీపీ పాలనలో డ్రగ్స్‌ దందా విస్తరించిందని ఆమె తీవ్రంగా విమర్శించారు. కూటమి ప్రభుత్వం యువతకు చెడు అలవాట్లు దూరం చేయాలని ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అంటుంటే, వైసీపీ మాత్రం ‘డ్రగ్స్ తీసుకో బ్రో’ అన్నట్టుగా ప్రవర్తిస్తోంది. జగన్‌మోహన్ రెడ్డి పాలనలో అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌ ను గంజాయి ఆంధ్రప్రదేశ్‌గా మారిపోయింది, అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

వైసీపీ పాలనలో దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్‌కే దారి తీసేవని అనిత గారు తెలిపారు. “జగన్ ఐదేళ్ల పాలనలో డ్రగ్స్‌పై ఒక్క సమీక్షా సమావేశం కూడా నిర్వహించలేదు. అయితే ప్రస్తుతం మా ప్రభుత్వం ఆరుగురు మంత్రులతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేసి, ఈగల్‌, టాస్క్‌ఫోర్స్‌, రైల్వే పోలీస్‌లతో సమన్వయంగా పనిచేస్తోంది” అని వివరించారు.

యువత భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రగతి కోసం డ్రగ్స్‌ వ్యసనాన్ని పూర్తిగా అంతమొందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని హోం మంత్రి అనిత  స్పష్టం చేశారు.

Spotlight

Read More →