CM Vijay: సీఎం విజయ్ కుమారుడి మొదటి సినిమా వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్! Drishyam-3: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘దృశ్యం 3’ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎందులో అంటే? Devi Sri Prasad: అమ్మోరు జాతర ప్రభావం నాపై చాలా ఉంది.. ‘యల్లమ్మ’ సినిమాపై రాక్‌స్టార్ డీఎస్పీ ఆసక్తికర వ్యాఖ్యలు! OTT New Movie: థియేటర్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన 'సల్బర్ది'... ఉత్కంఠ రేపుతున్న రమేశ్ చౌదరి సరికొత్త చిత్రం! Peddi movie: ప్రోమోతోనే అంచనాలు పెంచేసిన ‘పెద్ది’ టీమ్: ఇప్పుడు ఫుల్ వీడియోతో థియేటర్ల కంటే ముందే రచ్చ! Dhurandhar: రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన 'ధురంధర్' అన్‌కట్ వెర్షన్.. నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్‌లలో స్ట్రీమింగ్! Jr NTR: తారక్ ఇంట్లోకి కొత్త అతిథులు.. 'అసాహి', 'యూహీ'ల వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే! Sridevi Appala: సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌... టీమిండియా యంగ్ క్రికెటర్‌తో కోర్టు హీరోయిన్ ప్రేమాయణం! Peddi Trailer: పెద్ది ట్రైలర్ వచ్చేసింది... గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఊరమాస్ విశ్వరూపం! OTT New Movie: ఓటీటీ తెరపైకి మలయాళ రొమాంటిక్ కామెడీ! ఐదు భాషల్లో అందుబాటులోకి.. CM Vijay: సీఎం విజయ్ కుమారుడి మొదటి సినిమా వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్! Drishyam-3: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘దృశ్యం 3’ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎందులో అంటే? Devi Sri Prasad: అమ్మోరు జాతర ప్రభావం నాపై చాలా ఉంది.. ‘యల్లమ్మ’ సినిమాపై రాక్‌స్టార్ డీఎస్పీ ఆసక్తికర వ్యాఖ్యలు! OTT New Movie: థియేటర్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన 'సల్బర్ది'... ఉత్కంఠ రేపుతున్న రమేశ్ చౌదరి సరికొత్త చిత్రం! Peddi movie: ప్రోమోతోనే అంచనాలు పెంచేసిన ‘పెద్ది’ టీమ్: ఇప్పుడు ఫుల్ వీడియోతో థియేటర్ల కంటే ముందే రచ్చ! Dhurandhar: రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన 'ధురంధర్' అన్‌కట్ వెర్షన్.. నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్‌లలో స్ట్రీమింగ్! Jr NTR: తారక్ ఇంట్లోకి కొత్త అతిథులు.. 'అసాహి', 'యూహీ'ల వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే! Sridevi Appala: సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌... టీమిండియా యంగ్ క్రికెటర్‌తో కోర్టు హీరోయిన్ ప్రేమాయణం! Peddi Trailer: పెద్ది ట్రైలర్ వచ్చేసింది... గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఊరమాస్ విశ్వరూపం! OTT New Movie: ఓటీటీ తెరపైకి మలయాళ రొమాంటిక్ కామెడీ! ఐదు భాషల్లో అందుబాటులోకి..

Tollywood Viral News: హైదరాబాద్‌లో రణవీర్ సింగ్ సినిమా చూస్తూ కనిపించిన ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా..!

Tollywood Viral News: రెబల్ స్టార్ ప్రభాస్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా హైదరాబాద్‌లోని ఒక థియేటర్లో రణవీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2' సినిమాను చూస్తూ కనిపించారు. 'స్పిరిట్' సినిమా షూటింగ్ విరామంలో వీరు ఇలా బయట కనిపించడం అభిమానులను ఖుషీ చేస్తోంది

Published : 2026-04-09 18:02:00

Tollywood Viral News: రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ 'ధురంధర్ 2' ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా క్రేజ్ సామాన్యులనే కాదు, సినీ సెలబ్రిటీలను కూడా థియేటర్ల వైపు రప్పిస్తోంది. తాజాగా టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్  సన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా హైదరాబాద్‌లోని ఒక థియేటర్లో ఈ సినిమాను వీక్షిస్తూ కనిపించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

ప్రస్తుతం వీరిద్దరూ కలిసి 'స్పిరిట్' అనే భారీ ప్రాజెక్ట్ కోసం పని చేస్తున్నారు. షూటింగ్ గ్యాప్‌లో కాస్త విరామం దొరకడంతో, బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని చూడటానికి వెళ్లారు. థియేటర్లో ప్రభాస్ బ్లాక్ డ్రెస్సులో చాలా సింపుల్‌గా కనిపిస్తే, సందీప్ వంగా బ్లూ కుర్తాలో కనిపించారు. వీరు సినిమా చూస్తున్న ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఈ ఫోటోలను చూసి "స్పిరిట్ కాంబో అదిరిపోయింది" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరోవైపు, ఈ వార్తతో పాటు ఒక పాత వివాదం కూడా మళ్ళీ చర్చకు వచ్చింది. నిజానికి 'స్పిరిట్' సినిమాలో హీరోయిన్‌గా దీపికా పదుకొనేను అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. రెమ్యూనరేషన్ విషయంలోనూ, అలాగే పని గంటల విషయంలోనూ దీపికా పెట్టిన నిబంధనలకు టీమ్ అంగీకరించలేదని సమాచారం. ముఖ్యంగా తెలుగులో డైలాగులు చెప్పడానికి ఆమె పెద్దగా ఆసక్తి చూపలేదని టాక్ వినిపిస్తోంది. దీంతో ఆమె స్థానంలో తృప్తి దిమ్రిని ఎంపిక చేశారు.

సందీప్ రెడ్డి వంగాకు రణవీర్ సింగ్ నటన అంటే మొదటి నుంచి మంచి గౌరవం ఉంది. 'ధురంధర్' మొదటి భాగం విడుదలైనప్పుడే ఆయన రణవీర్ పెర్ఫార్మెన్స్‌ను తెగ పొగిడారు. ఈ సినిమాలో యాక్షన్ సీన్లు  స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉన్నాయని, అందుకే రెండో భాగాన్ని కూడా థియేటర్లోనే చూడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ కూడా రణవీర్ నటనను ఎంజాయ్ చేసినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ 'స్పిరిట్' సినిమా అప్డేట్స్ కోసం  ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ వంటి నటులు కూడా ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్ - సందీప్ వంగా కలిసి సినిమా చూడటంతో, వీరిద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉందో అర్థమవుతోంది. ఖచ్చితంగా 'స్పిరిట్' సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టిస్తారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Spotlight

Read More →