ప్రభుత్వ రంగ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) ఉద్యోగార్థులకు శుభవార్తను అందించింది. బ్యాంక్ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, Local Bank Officer (LBO) పోస్టుల భర్తీ కోసం దేశవ్యాప్తంగా మొత్తం 750 ఖాళీలు ప్రకటించింది. ఈ పోస్టులకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2025 నవంబర్ 23లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టు వివరాలు
పోస్టు పేరు: Local Bank Officer (LBO)
ఖాళీలు: 750
వేతనం : ₹48,480 – ₹85,920
వేతనంతో పాటు DA, HRA, మెడికల్ అలవెన్సులు,పెన్షన్, గ్రాచ్యుటీ, లీవ్ ట్రావెల్ కన్సెషన్ వంటి ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అదేవిధంగా బ్యాంకింగ్ రంగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు వేగంగా సిలెక్షన్ అయ్యే అవకాశం ఉంది.
రాష్ట్రాల వారీ ఖాళీలు
తెలంగాణ — 88
ఆంధ్రప్రదేశ్ — 5
గుజరాత్ — 95
కర్ణాటక — 85
మహారాష్ట్ర — 135
తమిళనాడు — 85
పశ్చిమ బెంగాల్ — 90
జమ్మూ & కాశ్మీర్ — 20
లడఖ్ — 3 ఈశాన్య రాష్ట్రాలు — 41 (అస్సాం, మణిపూర్, త్రిపుర మొదలైనవి) అభ్యర్థి దరఖాస్తు చేసే రాష్ట్ర స్థానిక భాషలో రాయడం, చదవడం, మాట్లాడడం వచ్చి ఉండాలి ఇది తప్పనిసరి.
అర్హతలు
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ తప్పనిసరి కనీసం 1 సంవత్సరం బ్యాంకింగ్ అనుభవం (క్లరికల్ లేదా ఆఫీసర్ కేటగిరీ)
వయోపరిమితి
కనిష్ఠం: 20 సంవత్సరాలు
గరిష్ఠం: 30 సంవత్సరాలు
వారికి సడలింపులు:
SC / ST: 5 సంవత్సరాలు
OBC: 3 సంవత్సరాలు
దివ్యాంగులు (PwBD): 10 సంవత్సరాలు
ఎంపిక ప్రక్రియ
ఎంపిక నాలుగు దశల్లో జరుగుతుంది
1. ఆన్లైన్ రాత పరీక్ష
2. స్థానిక భాష పరీక్ష
3. ఇంటర్వ్యూ
4. డాక్యుమెంట్ వెరిఫికేషన్
రాత పరీక్ష నమూనా:
Reasoning Ability, Quantitative Aptitude / Data Interpretation, English Language General Awareness (Banking + Current Affairs)
మొత్తం మార్కులు 200 పరీక్ష వ్యవధి 120 నిమిషాలు (2 గంటలు) నెగటివ్ మార్కింగ్ తప్పు సమాధానానికి 0.25 మార్కుల కట్
పరీక్షా కేంద్రాలు :
హైదరాబాద్, వరంగల్, మహబూబ్నగర్,కరీంనగర్,
ఖమ్మం, విజయవాడ / గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం
దరఖాస్తు వివరాలు
అప్లికేషన్ ప్రారంభం: అక్టోబర్ 25, 2025
చివరి తేదీ: నవంబర్ 23, 2025
పరీక్ష: డిసెంబర్ 2025 లేదా జనవరి 2026
కేటగిరీ ఫీజు
SC / ST / PwBD ₹59
General / OBC / Others ₹1180
దరఖాస్తు చేయడానికి అధికారిక వెబ్సైట్:
www.pnbindia.in
ముఖ్య సూచనలు
తప్పులను సరిదిద్దుకునే ఆప్షన్ ఉండదు, కాబట్టి అప్లికేషన్ జాగ్రత్తగా నింపాలి. డాక్యుమెంట్లను (ఫోటో, సంతకం, సర్టిఫికేట్లు) స్కాన్ చేసి అప్లోడ్ చెయ్యాలి.
ఎంపికైన అభ్యర్థులకు 2 సంవత్సరాల ప్రమోషన్-బేస్డ్ ప్రొబేషన్ ఉంటుంది. బ్యాంక్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం