TTD: శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం.. అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు!

గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు పలు జిల్లాల్లో వర్షపాతం భారీగా నమోదవుతోంది. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంది. ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీల నుంచి లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేశారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి, పల్లెల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఐటీ ఉద్యోగులకు AI ఆటోమేషన్ భవిష్యత్తులో సవాళ్లు పెంచనుందా?

వాతావరణ శాఖ ప్రకారం, ఈ వారం కూడా ఇలాగే వాతావరణం కొనసాగనుందని సూచన ఉంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు సూచనలున్నాయి. ఇది వచ్చే 48 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాతి రెండు రోజుల్లో, గురువారం నాటికి, దక్షిణమధ్య మరియు పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశముందని గుర్తించారు.

Amaravati ORR: అమరావతి ఓఆర్‌ఆర్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..! 12 ప్యాకేజీల ప్రాజెక్ట్, భూసేకరణ త్వరలో..!

ఈ కొత్త వాయుగుండం ప్రభావం మొదటగా దక్షిణ కోస్తా జిల్లాల్లో కనిపించే అవకాశం ఉంది. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతాలైన తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, రాయచోటి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. వాయుగుండం తీవ్రత పెరిగిన తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా.

Digital Safety: పండుగ సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారికి NPCI హెచ్చరిక..! ఈ తప్పులు చేయొద్దు..!

ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపినట్లుగా‌ నేడు ఉత్తరాంధ్ర, కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించారు. శ్రీకాకుళం, విజయనగరం, గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై ప్రజల ఆగ్రహం..నో కింగ్స్ నినాదాలు!!

ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఉరుములు, మెరుపులు పడుతున్నప్పుడు చెట్ల క్రింద నిలబడకూడదని అధికారులు సూచించారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వర్షాలు నమోదయ్యాయి. శనివారం సాయంత్రం విజయనగరం జిల్లాలో నెల్లిమర్లలో 49.7 మిల్లీమీటర్లు, కృష్ణా జిల్లా ఘంటసాలలో 44.7, తిరుపతిలో 27.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

తలనొప్పి ఎక్కువవుతోంది? ఇలా కొన్ని చిన్న మార్పులు మీకు ఉపశమనం ఇస్తాయి!!

రైతులు, మత్స్యకారులు, సాధారణ ప్రజలు వాతావరణ శాఖ సూచనలను పాటిస్తూ, అవసరమైతే భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. బంగాళాఖాతంలోని వాయుగుండాల ప్రభావంతో వచ్చే వారం రోజుల్లో రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ మళ్లీ హెచ్చరించింది

Liquor shops: మద్యం టెండర్లలో సంచలనం..! 150 షాపుల కోసం దరఖాస్తు చేసిన ఏపీ మహిళ..!
పటాసులు కాదు… ఆవు పేడలే సంబరాల కేంద్రం! కర్ణాటకలో దీపావళి ప్రత్యేకం!!
బంగారం ధరలు వినగానే షాక్ అవ్వాల్సిందే…10 గ్రాముల రేటు ఎంతంటే!