గత కొన్ని సంవత్సరాల వరకు ఐటీ ఉద్యోగుల జీవితం ప్రత్యేకమైన సౌకర్యాలతో నిండినదిగా అనిపించేది. వారానికి ఐదు రోజులే పని అధిక జీతం, బోనస్‌లు, ఇంక్రిమెంట్లు సులభంగా లభించేవి. కొత్త కంపెనీకి మారితే జీతం గణనీయంగా పెరుగుతుందని తెలిసి ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేసేవారు. పెళ్లి సందర్భాల్లో కూడా ఐటీ ఉద్యోగులు ప్రత్యేక గౌరవంతో కనిపించేవారు కుటుంబ సభ్యులు, బంధువులు ఎక్కువ కట్నం, బంగారం, ఇలా అనేక సౌకర్యాలు.
కానీ ఈ స్వర్ణకాల పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ఐటీ సేవల డిమాండ్‌లో తగ్గుదల రంగంలో uncertainty ను పెంచాయి. ఉద్యోగాల తొలగింపులు, కొత్త నియామకాల లేమి పరిశ్రమను నష్టపరిచే అంశాలుగా మారాయి. గడచిన మూడు సంవత్సరాల్లో ఐటీ కంపెనీల అధిక సంఖ్యలో నియామకాల్లో కోతలు విధిస్తున్న వార్తలు మనం చూస్తూనే ఉన్నాం.
ఇక ఉద్యోగుల భవిష్యత్తు మరింత సవాలుగా మారిన ప్రధాన కారణం కృత్రిమ మేధ (Artificial Intelligence - AI) పరిణామాలు. సాంప్రదాయ మానవ శ్రమతో చేసే పనులు ఆటోమేషన్‌కు లోబడి, అనుభవం ఉన్న ఉద్యోగులు కూడా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి బలవంతమయ్యారు. AIకి అనుగుణంగా సిద్ధం కాని వారు ఉద్యోగాన్ని కోల్పోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది.
దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీలలో ఒకటైన TCS కూడా ఈ ఒత్తిడికి లోబడి ఉంది. ఆటోమేషన్‌కు అనుగుణంగా మారలేని ఉద్యోగులను కంపెనీ బయటకు పంపుతోంది. చిన్న కంపెనీలు మాత్రమే కాదు, గూగుల్ వంటి గ్లోబల్ దిగ్గజాలు కూడా ఉద్యోగాల కొతలు చేపడుతున్నారు. గూగుల్ ప్రకటన ప్రకారం, ఇవి వ్యూహాత్మక పునర్నిర్మాణం ఖర్చులు తగ్గించడం మాత్రమే కాకుండా, AI రంగంలో పెట్టుబడులు పెంచడం ప్రధాన లక్ష్యం.
AI పరిణామాలు కొన్ని ఉద్యోగాలకు మేలు చేసినప్పటికీ, డేటా అనలిసిస్, సిస్టమ్ డిజైన్ వంటి సాంప్రదాయ స్థానాలు వేగంగా ఆటోమేషన్ ప్రభావానికి లోబడ్డాయి. భవిష్యత్తులో ఉద్యోగులు AIకి అనుగుణంగా నైపుణ్యాలను మెరుగుపరచకపోతే, ఉద్యోగ భద్రత సవాలుగా మారుతుంది. తొలగింపుల బాధితులకు గూగుల్ డిసెంబర్ వరకు ప్రత్యామ్నాయ ఉద్యోగాల కోసం అవకాశం ఇస్తోంది. కొత్త ఉద్యోగం దొరికితే మంచిదిలేకపోతే ఇంటికి వెళ్ళాల్సి ఉంటుంది.
ఈ పరిణామం ఐటీ రంగంలో ప్రతి ఉద్యోగికి హెచ్చరిక. అనుభవం ఒక్కటే సరిపోదు; AIకి అనుగుణమైన నైపుణ్యాలు, స్వయంని నవీకరించడం భవిష్యత్తులో ఉద్యోగ భద్రతను నిర్ణయిస్తుంది. గత స్వర్ణయుగం ముగిసిపోయింది, కొత్త యుగంలో జీవించాలంటే నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి.