Donald Trump: 150 రోజుల తాత్కాలిక గండం! ట్రంప్ మాస్టర్ ప్లాన్ - పెరుగుతున్న అంతర్జాతీయ ఉద్రిక్తతలు! Budget Friendly Cars: కారు కొనాలనుకుంటున్నారా... 2026 బడ్జెట్ ఫ్రెండ్లీ బెస్ట్ కార్స్ ఇవే! Steel Plant: ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో మరో మైలురాయి! స్టీల్ ప్లాంట్ భూమి పూజకు ముహూర్తం ఫిక్స్..! Air Quality: గాలి నాణ్యతలో భారీ క్షీణత! మంచు కాదు.. అది కాలుష్యపు పొగ.. అధికారుల హెచ్చరిక! Gold Price: పసిడి ప్రియులకు శుభవార్త! భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు! US Politics: అధ్యక్ష ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్..! రికార్డు స్థాయిలో దేశం దాటుతున్న పౌరులు! E20 Petrol: పెట్రోల్ బంకుల్లో కొత్త నిబంధన.. ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా 'E20' పెట్రోల్ విక్రయం! DA Increase: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్...! 3 శాతం పెరిగిన డీఏ! Modi: డిజిటల్ దునియాలోనూ మోదీ హవా.. ఇన్ స్టా, 'ఎక్స్'లో వరల్డ్ రికార్డ్ ..!! Vehicle RC: ఆర్టీఓ ఆఫీసు చుట్టూ తిరిగే పనిలేదు..! ఇంట్లోనే ఆర్‌సీ అడ్రస్ మార్చుకోండి...! Donald Trump: 150 రోజుల తాత్కాలిక గండం! ట్రంప్ మాస్టర్ ప్లాన్ - పెరుగుతున్న అంతర్జాతీయ ఉద్రిక్తతలు! Budget Friendly Cars: కారు కొనాలనుకుంటున్నారా... 2026 బడ్జెట్ ఫ్రెండ్లీ బెస్ట్ కార్స్ ఇవే! Steel Plant: ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో మరో మైలురాయి! స్టీల్ ప్లాంట్ భూమి పూజకు ముహూర్తం ఫిక్స్..! Air Quality: గాలి నాణ్యతలో భారీ క్షీణత! మంచు కాదు.. అది కాలుష్యపు పొగ.. అధికారుల హెచ్చరిక! Gold Price: పసిడి ప్రియులకు శుభవార్త! భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు! US Politics: అధ్యక్ష ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్..! రికార్డు స్థాయిలో దేశం దాటుతున్న పౌరులు! E20 Petrol: పెట్రోల్ బంకుల్లో కొత్త నిబంధన.. ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా 'E20' పెట్రోల్ విక్రయం! DA Increase: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్...! 3 శాతం పెరిగిన డీఏ! Modi: డిజిటల్ దునియాలోనూ మోదీ హవా.. ఇన్ స్టా, 'ఎక్స్'లో వరల్డ్ రికార్డ్ ..!! Vehicle RC: ఆర్టీఓ ఆఫీసు చుట్టూ తిరిగే పనిలేదు..! ఇంట్లోనే ఆర్‌సీ అడ్రస్ మార్చుకోండి...!

Royyala Pachadi: రొయ్యల పచ్చడి చేస్తున్నారా? ఈ చిన్న తప్పు చేస్తే బూజు పట్టడం ఖాయం!

Royyala Pacchadi Making Process: పచ్చళ్లకు పల్లీ నూనె వాడితేనే రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ నూనెలో రొయ్యలను 85% వరకు డీప్ ఫ్రై చేయాలి. మరీ గట్టిగా వేయించకూడదు.

Published : 2026-02-26 09:41:00

నోరూరించే రొయ్యల పచ్చడి… 

ఐదు నెలల పాటు నిల్వ ఉండేలా…

పక్కా కొలతలతో అదిరిపోయే టేస్ట్ మీకోసం.

వేడి వేడి అన్నంలో రొయ్యల పచ్చడి…

Royyala Pacchadi Making Process: మాంసాహార ప్రియులకు చికెన్, మటన్ అంటే ఎంత ఇష్టమో, రొయ్యల పచ్చడి అంటే అంతకు మించిన క్రేజ్ ఉంటుంది. వేడివేడి అన్నంలో కొంచెం రొయ్యల పచ్చడి వేసుకుని తింటే ఆ రుచే వేరు. అయితే చాలామందికి ఇంట్లో పచ్చడి పడితే పాడైపోతుందేమో అన్న భయం ఉంటుంది. అలాంటి వారి కోసం, ఐదు నెలల పాటు నిల్వ ఉండేలా, అదిరిపోయే టేస్ట్‌తో రొయ్యల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ముందుగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మార్కెట్ నుండి ఒక కేజీ రొయ్యలు తెస్తే అవి వలిచిన తర్వాత కేవలం అరకేజీ మాత్రమే వస్తాయి. కాబట్టి మీకు ఒక కేజీ  రొయ్యల ముక్కలు కావాలంటే, రెండు కిలోల రొయ్యలను కొనుగోలు చేయాలి. వీటిని ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

మొదటగా కడిగిన రొయ్యల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు కలిపి ఒక అరగంట సేపు మ్యారినేట్ చేయాలి. ఆ తర్వాత బాండీలో వేసి రొయ్యల్లోని నీరంతా ఆవిరైపోయే వరకు వేయించాలి. పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే రొయ్యల్లో చుక్క నీరు కూడా ఉండకూడదు.పచ్చడికి అసలైన రుచిని ఇచ్చేది మసాలా పొడినే ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఇలాచీ, దాల్చినచెక్క, లవంగాలను దోరగా వేయించి మెత్తగా పొడి చేసుకోవాలి.

కడాయిలో సుమారు 400 ml పల్లీల నూనె తీసుకోవాలి. పచ్చళ్లకు పల్లీ నూనె వాడితేనే రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ నూనెలో రొయ్యలను 85% వరకు డీప్ ఫ్రై చేయాలి. మరీ గట్టిగా వేయించకూడదు. రొయ్యలు తీశాక అదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. చివరగా ఉప్పు, కారం, మనం ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పొడి వేసి బాగా కలపాలి. మసాలా వేసిన వెంటనే స్టవ్ ఆపేయడం ముఖ్యం.

పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత నాలుగు పెద్ద సైజు నిమ్మకాయల రసాన్ని కలపాలి. పచ్చడి పైన నూనె ఎప్పుడూ తేలుతూ ఉండాలి, లేదంటే బూజు పట్టే అవకాశం ఉంటుంది. ఈ పచ్చడి చేసిన రోజు కంటే రెండు రోజుల తర్వాత ఊరితేనే అసలైన రుచి వస్తుంది.
ఏది ఏమైనా, పక్కా కొలతలతో చేసుకుంటే ఈ రొయ్యల పచ్చడి ఇంటిల్లిపాదికీ ఇష్టమైన వంటకంగా మారిపోవడంలో సందేహం లేదు సుమీ.

Spotlight

Read More →