
పెట్రోల్ ధరలు ఎగబాకుతున్న తరుణంలో, సామాన్య ప్రజలు తక్కువ ఖర్చుతో మైలేజ్ ఎక్కువగా ఇచ్చే వాహనాల కోసం వెతుకుతున్నారు. ఎలక్ట్రిక్ కార్లు మంచి ఆప్షన్ అయినా, వాటి ధరలు ఇంకా చాలామందికి అందని ద్రాక్షగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో సీఎన్‌జీ కార్లు మధ్యతరగతి ప్రజలకు సరైన ప్రత్యామ్నాయంగా మారాయి. పెట్రోల్ కంటే సీఎన్‌జీ ధర తక్కువగా ఉండటం, అలాగే కిలోకు ఎక్కువ కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వడం వీటి ప్రధాన ఆకర్షణ. అందుకే ఆటో మార్కెట్లో సీఎన్‌జీ వాహనాల డిమాండ్ గణనీయంగా పెరిగింది.
మారుతి వ్యాగన్ ఆర్ ఇప్పటికే భారతీయ కుటుంబాల ‘ఫేవరెట్’ కారు. ఇప్పుడు దీని CNG వేరియంట్ మరింత ఆదరణ పొందుతోంది. 998 సీసీ ఇంజిన్‌తో వచ్చే ఈ కారు 56 పీఎస్ పవర్, 92.1 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కిలోకు 34.05 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తూ ఆర్థికంగా చక్కని ఎంపికగా నిలుస్తుంది. సేఫ్టీ విషయంలో కూడా ఈ కారు అత్యుత్తమమైనది – ఆరు ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్, ఇఎస్‌పి ఫీచర్లు ఉన్నాయి. విస్తారమైన క్యాబిన్ స్పేస్‌తో ఫ్యామిలీ ప్రయాణాలకు ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు. దీని ధర రూ. 5.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
తక్కువ ధరలో సీఎన్‌జీ కార్లు కొనాలనుకునే వారికి ఆల్టో కె10 మంచి ఎంపిక. 998సీసీ ఇంజిన్‌తో వచ్చే ఈ కారు కిలోకు 33.85 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. రూ. 4.82 లక్షల ప్రారంభ ధరతో ఇది మార్కెట్లో అత్యంత బడ్జెట్ CNG కార్లలో ఒకటి.
ఇక మినీ SUV లుక్‌తో ఆకట్టుకునే మారుతి ఎస్-ప్రెస్సో 1.0 లీటర్ K సిరీస్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 56 పీఎస్ పవర్, 82.1 ఎన్ఎం టార్క్‌తో పాటు కిలోకు 32.73 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. రూ. 4.62 లక్షల ప్రారంభ ధరతో ఇది సిటీ యూజ్‌కు బాగుంటుంది.
ప్రీమియం లుక్ కావాలనుకునే వారికి మారుతి సెలెరియో మంచి ఆప్షన్. 998సీసీ ఇంజిన్‌తో 34.43 కిమీ/కిలో మైలేజ్ ఇస్తూ ఫ్యూయల్ ఎఫిషియెన్సీలో అగ్రస్థానంలో ఉంది. దీని ధర రూ. 5.98 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
టాటా మోటార్స్ నుండి వచ్చిన టియాగో సీఎన్‌జీ మరో విశ్వసనీయ ఎంపిక. 1.2 లీటర్ ఇంజిన్‌తో 72 పీఎస్ పవర్, 95 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కిలోకు 28.06 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ముఖ్యంగా గ్లోబల్ NCAP నుండి 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన కారు కావడం దీని ప్రత్యేకత. రూ. 5.49 లక్షల ప్రారంభ ధరతో సేఫ్టీ, మైలేజ్, స్టైల్ – అన్నింటినీ కోరుకునే వారికి ఇది సరైన ఎంపిక.
మొత్తం మీద, పెట్రోల్ ధరలు ఎగబాకుతున్న ఈ కాలంలో సీఎన్‌జీ కార్లు స్మార్ట్, ఆర్థిక మరియు పర్యావరణానికి అనుకూలమైన ప్రత్యామ్నాయం అవుతున్నాయి. కుటుంబ అవసరాలకోసం బడ్జెట్‌లో కారు తీసుకోవాలనుకుంటే పై మోడళ్లలో ఏదైనా ఎంచుకోవడం సరైన నిర్ణయం అవుతుంది.