AP Land Conversion: ఏపీలో భూ వినియోగ మార్పిడి కొత్త మార్గదర్శకాలు! 30 రోజుల్లోగా పరిష్కరించకపోతే ఆమోదించినట్లే!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మరో భారీ డేటా సెంటర్‌ రాబోతోంది. గూగుల్‌ అనుబంధ సంస్థ అయిన రైడెన్ రాష్ట్రంలో అత్యాధునిక ఇన్ఫోటెక్‌ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయబోతోంది. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం ఉంది.

High way: హైదరాబాద్–విజయవాడ మార్గం హైటెక్ హైవేగా..! ఎన్‌హెచ్–65 విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..!

ఈ పెట్టుబడి ద్వారా వేలాది ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. డేటా నిల్వ, క్లౌడ్ సేవలు, సాంకేతిక మౌలిక సదుపాయాల పరంగా ఇది దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని భావిస్తున్నారు.

విశాఖకు రానున్న మరో ప్రతిష్ఠాత్మక ఐటీ సంస్థ! రూ.87,250 కోట్ల పెట్టుబడి.. రైడైన్​తో ముందడుగు!

ఈ ప్రాజెక్ట్‌ ఆమోదానికి సంబంధించి జరిగిన 11వ రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో చర్చ జరిగింది. మొత్తం రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. ఈ పెట్టుబడుల్లో రైడెన్‌ సంస్థది కీలకమైనదిగా ప్రభుత్వం పేర్కొంది.

AP Government: ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంపు... ఎంతంటే!

సమావేశం అనంతరం ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు టెక్నాలజీతో ముడిపడి ఉంది. రైడెన్‌ వంటి సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడం రాష్ట్రానికి గర్వకారణం. దీని ద్వారా యువతకు మంచి అవకాశాలు లభిస్తాయి అని తెలిపారు.

ఉపాధ్యాయులతో చర్చించి సమస్యలు పరిష్కరించుకుందాం – లోకేష్!!

ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ కోసం అవసరమైన అన్ని అనుమతులను వేగంగా మంజూరు చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్ట్‌ కోసం విద్యుత్‌, నీరు, రహదారులు, డిజిటల్‌ కనెక్టివిటీ వంటి మౌలిక సదుపాయాలను కూడా ప్రభుత్వం అందించనుంది.

ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి వెబ్‌సైట్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు!!

రైడెన్‌ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో మేము దీర్ఘకాల ప్రణాళికతో అడుగు పెడుతున్నాం. ఇక్కడి ప్రభుత్వం సాంకేతిక అభివృద్ధికి ఇచ్చే ప్రాధాన్యం, అనుకూల వాతావరణం మాకు నచ్చింది. రాబోయే సంవత్సరాల్లో మేము మరిన్ని విస్తరణ ప్రణాళికలను అమలు చేస్తాము అని తెలిపారు.

Gold Mine: దేశంలోనే తొలి ప్రైవేట్ బంగారు గని! నవంబర్‌లో ప్రారంభం, రోజుకు ఎంత గోల్డ్ వస్తుందంటే!

చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ మరోసారి ఐటీ రంగంలో ముందంజలోకి వస్తోంది. డేటా సెంటర్లు, క్లౌడ్‌ సేవలు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి రంగాలలో కొత్త అవకాశాలు సృష్టించబడతాయి. రాష్ట్రం పెట్టుబడిదారులకు సురక్షితమైన, పారదర్శకమైన వాతావరణాన్ని కల్పిస్తోంది ఐటీ పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.

Free Tabs: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! వారందరికీ ఉచితంగా టాబ్ లు!

మొత్తానికి గూగుల్‌ రైడెన్‌ పెట్టుబడి ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గౌరవం తీసుకొచ్చిందని చెప్పవచ్చు. సాంకేతిక రంగంలో రాష్ట్రం మరలా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే దిశగా అడుగులు వేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లు.. స్పెషల్ బెనిఫిట్స్.. డోంట్ మిస్!
Bhagavad Gita: మోక్షం పొందాలంటే మనస్సు నిరంతరం ధ్యానంలో.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -27!