Ram Charan: నేను కాస్త రఫ్ ఫాదర్‌ని.. తన పిల్లల కోసం రామ్ చరణ్ సెట్ చేసిన రూల్స్ ఇవే! Ram Pothineni: అందుకే సింగిల్ గా ఉన్నా.... రామ్ పోతినేని క్రేజీ కామెంట్స్! Asha Bhosle: సంగీత ప్రపంచంలో తీరని లోటు.. లెజెండరీ గాయని ఆశా భోంస్లే కన్నుమూత! Pooja Hegde: కోలీవుడ్‌లో కలకలం.. విజయ్ ఆఖరి చిత్రానికి పైరసీ షాక్! ఆన్‌లైన్‌లో 'జన నాయగన్' లీక్.. bomb threat: "చెన్నైలో బాంబు కలకలం": రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు! Tollywood News: అల్లు అర్జున్ 'రాకా' రెమ్యూనరేషన్.. దీపికా, రష్మికల కంటే అన్ని రెట్లు ఎక్కువా? Rashmika Mandanna: పెళ్లైన తర్వాత మొదటి పుట్టినరోజు! కూతురి కోసం ఖరీదైన బంగ్లా... Dhurandhar 2: బాలీవుడ్ సత్తా చాటిన ధురంధర్ 2: ఆల్ టైమ్ రికార్డులను తిరగరాసిన ఆదిత్య ధర్ సీక్వెల్! కేవలం మూడు వారాల్లో.. Kanakaraju Movie: తమన్ మ్యూజిక్, మేర్లపాక కామెడీ.. ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ ప్రోమోతో అంచనాలు రెట్టింపు! Samantha: ఆయన వల్లే నేను ఇంత ధైర్యంగా ఉన్నాను.. సమంత ఎమోషనల్ కామెంట్స్! ఒక్క రోజు కూడా.. Ram Charan: నేను కాస్త రఫ్ ఫాదర్‌ని.. తన పిల్లల కోసం రామ్ చరణ్ సెట్ చేసిన రూల్స్ ఇవే! Ram Pothineni: అందుకే సింగిల్ గా ఉన్నా.... రామ్ పోతినేని క్రేజీ కామెంట్స్! Asha Bhosle: సంగీత ప్రపంచంలో తీరని లోటు.. లెజెండరీ గాయని ఆశా భోంస్లే కన్నుమూత! Pooja Hegde: కోలీవుడ్‌లో కలకలం.. విజయ్ ఆఖరి చిత్రానికి పైరసీ షాక్! ఆన్‌లైన్‌లో 'జన నాయగన్' లీక్.. bomb threat: "చెన్నైలో బాంబు కలకలం": రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు! Tollywood News: అల్లు అర్జున్ 'రాకా' రెమ్యూనరేషన్.. దీపికా, రష్మికల కంటే అన్ని రెట్లు ఎక్కువా? Rashmika Mandanna: పెళ్లైన తర్వాత మొదటి పుట్టినరోజు! కూతురి కోసం ఖరీదైన బంగ్లా... Dhurandhar 2: బాలీవుడ్ సత్తా చాటిన ధురంధర్ 2: ఆల్ టైమ్ రికార్డులను తిరగరాసిన ఆదిత్య ధర్ సీక్వెల్! కేవలం మూడు వారాల్లో.. Kanakaraju Movie: తమన్ మ్యూజిక్, మేర్లపాక కామెడీ.. ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ ప్రోమోతో అంచనాలు రెట్టింపు! Samantha: ఆయన వల్లే నేను ఇంత ధైర్యంగా ఉన్నాను.. సమంత ఎమోషనల్ కామెంట్స్! ఒక్క రోజు కూడా..

Doctor Sreeleela: టాలీవుడ్ 'డాక్టర్' శ్రీలీల: వెండితెర రాకుమారి.. ఇప్పుడు రోగుల పాలిట సంజీవని!

Sreeleela Graduation: శ్రీలీల గెలుపు కేవలం ఆమె గెలుపు మాత్రమే కాదు. తన చదువు కోసం పోరాడుతున్న ప్రతి అమ్మాయి గెలుపు. నటనను, చదువును సమతుల్యం చేసుకుంటూ ఆమె సాధించిన ఈ విజయం మనందరికీ స్పూర్తిదాయకం. "డాక్టర్ శ్రీలీల" - ఈ పేరు ఇప్పుడు సినిమాల్లో ఒక బ్రాండ్ మాత్రమే కాదు, పట్టుదలకి ఒక కేరాఫ్ అడ్రస్!

Published : 2026-02-14 12:00:00
  • షూటింగ్‌లతో బిజీగా ఉంటూనే చదువు పూర్తి..
     
  • కుటుంబం, స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపిన హీరోయిన్..

Doctor Sreeleela viral Post: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల తన జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నారు. నటనలో అగ్రస్థానంలో కొనసాగుతూనే, ఆమె ఇప్పుడు డాక్టర్‌గా మారారు. కొన్ని రోజుల కిందట ఎంబీబీఎస్ పట్టా అందుకున్నారు. దీనిపై నిన్న ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ పోస్ట్ చేశారు. ఇకపై తనను 'డాక్టర్ శ్రీలీల'గా ప్రేమగా పరిచయం చేసుకుంటున్నట్లు తెలిపారు.

"మీ అమ్మాయి తన మాట నిలబెట్టుకుంది" అంటూ తన పోస్ట్‌ను ప్రారంభించిన శ్రీలీల, ఈ ప్రయాణం తనకెంతో ప్రత్యేకమని అన్నారు. ఇది కేవలం ఒక డిగ్రీ మాత్రమే కాదని, తన ఎదుగుదల, విశ్వాసం, కన్నీళ్లు, పట్టుదలకు నిదర్శనమని పేర్కొన్నారు. తాను చదువుకునే ప్రదేశం తనకు ఒక పవిత్రమైన స్థలంలాంటిదని, అక్కడ మాత్రమే తాను తనలా ఉండగలిగానని వివరించారు.

ఈ కష్ట సమయంలో తన పరీక్షలకు సహకరించిన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, చిత్ర బృందాలకు ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనను తాను నమ్మడం నేర్చుకుంటున్న దశలో తనపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు.

వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతూ కూడా పట్టుదలతో చదువును పూర్తి చేసి డాక్టర్ పట్టా సాధించడంపై శ్రీలీలను అభిమానులు, సినీ ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఆమె పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

చివరగా ఒక్క మాట.. శ్రీలీల గెలుపు కేవలం ఆమె గెలుపు మాత్రమే కాదు. తన చదువు కోసం పోరాడుతున్న ప్రతి అమ్మాయి గెలుపు. నటనను, చదువును సమతుల్యం చేసుకుంటూ ఆమె సాధించిన ఈ విజయం మనందరికీ స్పూర్తిదాయకం. "డాక్టర్ శ్రీలీల" - ఈ పేరు ఇప్పుడు సినిమాల్లో ఒక బ్రాండ్ మాత్రమే కాదు, పట్టుదలకి ఒక కేరాఫ్ అడ్రస్!

Spotlight

Read More →