Senior NTR: కృష్ణుడంటే ఎన్టీఆరే.. మాయాబజార్‌తో మొదలైన ఒక నటుడి దైవత్వం.. అంతుచిక్కని రికార్డులు! ఆ రోజుల్లోనే.! Ram Charan: రామ్ చరణ్ వెల్లడించిన బిగ్ సీక్రెట్! డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్న మెగా డాటర్... Web Series: ఓటీటీని షేక్ చేస్తున్న 'మీర్జాపూర్'..! తప్పక చూడాల్సిన సిరీస్! Dhurandhar 2 Movie Review:పాకిస్థాన్‌లోకి చొచ్చుకెళ్లిన రణవీర్.. థియేటర్లలో రచ్చ లేపుతున్న 'ధురందర్ 2' మూవీ రివ్యూ! Harish Shankar: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు హరీష్ శంకర్ క్షమాపణలు! కారణం ఇదే..! Cyber Crime: మెగా కోడలిపై అసభ్యకర పోస్టులు.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన నటి! Vijay Deverakonda: విజయ్ దేవరకొండ బిగ్ అనౌన్స్‌మెంట్: 'హాయ్ నాన్న' డైరెక్టర్‌తో కొత్త సినిమా! Funky OTT: విశ్వక్‌సేన్ 'ఫంకీ' ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? Priyanka Chopra: ఆస్కార్ వేదికపై మళ్లీ ప్రియాంకా చోప్రా..! ప్రజెంటర్‌గా గ్లోబల్ స్టార్! Love Marriage: పెళ్లిపీటలెక్కనున్న బెల్లంకొండ శ్రీనివాస్! అమ్మాయి ఎవరంటే? Senior NTR: కృష్ణుడంటే ఎన్టీఆరే.. మాయాబజార్‌తో మొదలైన ఒక నటుడి దైవత్వం.. అంతుచిక్కని రికార్డులు! ఆ రోజుల్లోనే.! Ram Charan: రామ్ చరణ్ వెల్లడించిన బిగ్ సీక్రెట్! డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్న మెగా డాటర్... Web Series: ఓటీటీని షేక్ చేస్తున్న 'మీర్జాపూర్'..! తప్పక చూడాల్సిన సిరీస్! Dhurandhar 2 Movie Review:పాకిస్థాన్‌లోకి చొచ్చుకెళ్లిన రణవీర్.. థియేటర్లలో రచ్చ లేపుతున్న 'ధురందర్ 2' మూవీ రివ్యూ! Harish Shankar: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు హరీష్ శంకర్ క్షమాపణలు! కారణం ఇదే..! Cyber Crime: మెగా కోడలిపై అసభ్యకర పోస్టులు.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన నటి! Vijay Deverakonda: విజయ్ దేవరకొండ బిగ్ అనౌన్స్‌మెంట్: 'హాయ్ నాన్న' డైరెక్టర్‌తో కొత్త సినిమా! Funky OTT: విశ్వక్‌సేన్ 'ఫంకీ' ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? Priyanka Chopra: ఆస్కార్ వేదికపై మళ్లీ ప్రియాంకా చోప్రా..! ప్రజెంటర్‌గా గ్లోబల్ స్టార్! Love Marriage: పెళ్లిపీటలెక్కనున్న బెల్లంకొండ శ్రీనివాస్! అమ్మాయి ఎవరంటే?

Ramayana Movie update: రామాయణం' బిగ్ అప్‌డేట్.. హనుమాన్ జయంతి రోజే రణబీర్ కపూర్ 'రామ' లుక్ విడుదల!

Ramayana Movie update: నితేష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న 'రామాయణం' సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఏప్రిల్ 2న హనుమాన్ జయంతి సందర్భంగా రణబీర్ కపూర్ 'శ్రీరాముడి' ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయబోతున్నారు.

Published : 2026-03-27 14:10:00

Ramayana Movie update: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'రామాయణం' సినిమా గురించి ఒక అదిరిపోయే అప్‌డేట్  వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్టులో శ్రీరాముడిగా నటిస్తున్న రణబీర్ కపూర్ ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుందా అని దేశవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులు గత కొన్నాళ్లుగా  ఎదురుచూస్తున్నారు. ఈ నిరీక్షణకు తెర దించుతూ చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా ఒక కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏప్రిల్ 2వ తేదీన, హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని రణబీర్ కపూర్ 'రామ' లుక్‌ను అధికారికంగా విడుదల చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు. 

ఈ ప్రాజెక్టు గురించి నిర్మాత నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ ఎంతో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. రామాయణం అనేది మనందరి జీవితాలతో ముడిపడి ఉన్న ఒక గొప్ప కావ్యం అని, దీనిని వెండితెరపై ఆవిష్కరించేటప్పుడు ఎంతో బాధ్యతతో, భక్తితో పని చేస్తున్నామని ఆయన తెలిపారు. గత కొన్ని ఏళ్లుగా పడుతున్న శ్రమను, పట్టుదలను ఈ ఫస్ట్ లుక్ ద్వారా ప్రపంచానికి చూపించబోతున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రామనవమి రోజున ఈ ప్రకటన చేయడం విశేషం. కేవలం ఒక పోస్టర్ మాత్రమే కాకుండా, ఒక గ్రాండ్ లాంచ్ ద్వారా ఈ లుక్‌ను విడుదల చేసి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

అయితే ఈ అధికారిక ప్రకటనకు ముందే రణబీర్ కపూర్‌కు సంబంధించిన కొన్ని లీకైన ఫోటోలు నెట్టింట పెద్ద దుమారాన్నే రేపాయి. షూటింగ్ స్పాట్‌లో రణబీర్ కాషాయ ధోతి కట్టుకుని, జంధ్యం వేసుకుని ఉన్న ఫోటోలు బయటకు రావడంతో నెటిజన్లు రక రకాలుగా స్పందించారు. ముఖ్యంగా ఆ ఫోటోల్లోని హెయిర్ స్టైల్, విగ్ క్వాలిటీ బాలేదంటూ కొందరు విమర్శలు గుప్పించారు. దాదాపు 400 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్‌తో తీస్తున్న సినిమాలో ఇంత చిన్న చిన్న తప్పులు ఏంటని సోషల్ మీడియాలో చర్చలు నడిచాయి. ఇప్పుడు మేకర్స్ రిలీజ్ చేయబోయే అఫీషియల్ లుక్ ఆ విమర్శలన్నింటికీ గట్టి సమాధానం ఇస్తుందని చిత్ర బృందం నమ్ముతోంది.

ఈ సినిమాలో తారాగణం  రణబీర్ కపూర్‌తో పాటు కన్నడ స్టార్ యాష్ రావణాసురుడిగా నటిస్తుండటం ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ఇక సీతాదేవిగా  నటి సాయి పల్లవి కనిపిస్తుండగా, హనుమంతుడి పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ మెరవనున్నారు. లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్నారు. ఇంతమంది స్టార్స్ ఒకే స్క్రీన్‌పై కనిపించబోతుండటంతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. 

సాంకేతిక పరంగా కూడా ఈ సినిమా హాలీవుడ్ రేంజ్‌లో ఉండబోతోంది. ఆస్కార్ విజేతలు హ్యాన్స్ జిమ్మర్  ఏఆర్ రెహమాన్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం ఒక విశేషం. యాక్షన్ సీన్ల కోసం కూడా అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్లను రంగంలోకి దించారు.  పురాణ గాథను రెండు భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. మొదటి భాగం 2026 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది, ఇక రెండో భాగాన్ని 2027లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ 2న రాబోయే రణబీర్ లుక్ ఈ సినిమాపై అంచనాలను ఏ స్థాయికి తీసుకెళ్తుందో చూడాలి.

Spotlight

Read More →