Nivetha Pethuraj: ప్రేమ కోసం కెరీర్‌ను వదిలేశా.. కానీ! టాలీవుడ్‌లో మారుమోగుతున్న నివేదా పేతురాజ్ పేరు.! Singer Mangli: "తప్పు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం": సుబ్బారావు ఆరోపణలపై గాయని మంగ్లీ సవాల్! Ram Charan: నేను కాస్త రఫ్ ఫాదర్‌ని.. తన పిల్లల కోసం రామ్ చరణ్ సెట్ చేసిన రూల్స్ ఇవే! Ram Pothineni: అందుకే సింగిల్ గా ఉన్నా.... రామ్ పోతినేని క్రేజీ కామెంట్స్! Asha Bhosle: సంగీత ప్రపంచంలో తీరని లోటు.. లెజెండరీ గాయని ఆశా భోంస్లే కన్నుమూత! Pooja Hegde: కోలీవుడ్‌లో కలకలం.. విజయ్ ఆఖరి చిత్రానికి పైరసీ షాక్! ఆన్‌లైన్‌లో 'జన నాయగన్' లీక్.. bomb threat: "చెన్నైలో బాంబు కలకలం": రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు! Tollywood News: అల్లు అర్జున్ 'రాకా' రెమ్యూనరేషన్.. దీపికా, రష్మికల కంటే అన్ని రెట్లు ఎక్కువా? Rashmika Mandanna: పెళ్లైన తర్వాత మొదటి పుట్టినరోజు! కూతురి కోసం ఖరీదైన బంగ్లా... Dhurandhar 2: బాలీవుడ్ సత్తా చాటిన ధురంధర్ 2: ఆల్ టైమ్ రికార్డులను తిరగరాసిన ఆదిత్య ధర్ సీక్వెల్! కేవలం మూడు వారాల్లో.. Nivetha Pethuraj: ప్రేమ కోసం కెరీర్‌ను వదిలేశా.. కానీ! టాలీవుడ్‌లో మారుమోగుతున్న నివేదా పేతురాజ్ పేరు.! Singer Mangli: "తప్పు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం": సుబ్బారావు ఆరోపణలపై గాయని మంగ్లీ సవాల్! Ram Charan: నేను కాస్త రఫ్ ఫాదర్‌ని.. తన పిల్లల కోసం రామ్ చరణ్ సెట్ చేసిన రూల్స్ ఇవే! Ram Pothineni: అందుకే సింగిల్ గా ఉన్నా.... రామ్ పోతినేని క్రేజీ కామెంట్స్! Asha Bhosle: సంగీత ప్రపంచంలో తీరని లోటు.. లెజెండరీ గాయని ఆశా భోంస్లే కన్నుమూత! Pooja Hegde: కోలీవుడ్‌లో కలకలం.. విజయ్ ఆఖరి చిత్రానికి పైరసీ షాక్! ఆన్‌లైన్‌లో 'జన నాయగన్' లీక్.. bomb threat: "చెన్నైలో బాంబు కలకలం": రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు! Tollywood News: అల్లు అర్జున్ 'రాకా' రెమ్యూనరేషన్.. దీపికా, రష్మికల కంటే అన్ని రెట్లు ఎక్కువా? Rashmika Mandanna: పెళ్లైన తర్వాత మొదటి పుట్టినరోజు! కూతురి కోసం ఖరీదైన బంగ్లా... Dhurandhar 2: బాలీవుడ్ సత్తా చాటిన ధురంధర్ 2: ఆల్ టైమ్ రికార్డులను తిరగరాసిన ఆదిత్య ధర్ సీక్వెల్! కేవలం మూడు వారాల్లో..

Mohan Babu Kidnap Case High Court: మోహన్‌బాబుకు హైకోర్టులో బిగ్ షాక్.. అరెస్ట్ నుంచి రక్షణ ఇచ్చేందుకు నో చెప్పిన ధర్మాసనం!

mohan babu case: మధ్యంతర ఉత్తర్వులకు నిరాకరించిన ఏపీ హైకోర్టు – విచారణకు సహకరించని మంచు విష్ణు? – ఫోన్ కాల్ డేటాలో సంచలన విషయాలు – విద్యార్థి సంఘాల ఆగ్రహం – ఈ నెల 12న వెలువడనున్న కీలక నిర్ణయం.

Published : 2026-02-11 13:20:00
  • కిడ్నాప్ కేసులో మోహన్‌బాబుకు హైకోర్టులో చుక్కెదురు..
  • మోహన్‌బాబు పాత్రపై ఆధారాలున్నాయన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్…

కలెక్షన్ కింగ్  మోహన్‌బాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన కిడ్నాప్ కేసును కొట్టివేయాలని  ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, ఈ దశలో ఆయనకు ఎటువంటి మధ్యంతర ఉపశమనం కలిగించలేమని స్పష్టం చేసింది. ముఖ్యంగా అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలన్న విన్నపాన్ని కోర్టు తోసిపుచ్చింది. బాధితుల వాదనలు విన్న తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని వ్యాఖ్యానిస్తూ, తదుపరి విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది.

అసలేం జరిగింది?
తిరుపతి జిల్లాలోని మోహన్‌బాబుకు చెందిన యూనివర్సిటీలో ఫీజుల వసూలుపై నిరసన తెలిపేందుకు వెళ్లిన విద్యార్థి సంఘం నాయకులను కిడ్నాప్ చేసి, వారిపై దాడి చేశారన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. ఈ నెల 3వ తేదీన విద్యార్థి నేత కుమార్ ఫిర్యాదు మేరకు తిరుచానూరు పోలీసులు మోహన్‌బాబుతో పాటు యూనివర్సిటీ పీఆర్‌వో సతీష్ మరియు మంచు విష్ణుపై కూడా కేసులు నమోదు చేశారు. విద్యార్థులను నిర్బంధించి గాయపరిచారన్న ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి వారిని విడిపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని పోలీసులు కోర్టుకు నివేదించారు.

కోర్టులో ఆసక్తికర వాదనలు…
విచారణ సందర్భంగా మోహన్‌బాబు తరఫు న్యాయవాది తన క్లయింట్‌కు ఈ ఘటనతో ఎటువంటి సంబంధం లేదని వాదించారు. కిడ్నాప్ జరిగిన సమయంలో మోహన్‌బాబు తిరుపతిలోనే లేరని, ఆయన హైదరాబాద్‌లో ఉన్నట్లు ఆధారంగా బోర్డింగ్ పాస్ వివరాలను కోర్టుకు సమర్పించారు. కేవలం యూనివర్సిటీ ప్రతిష్టను దిగజార్చేందుకే రాజకీయ కుట్రతో ఈ కేసు పెట్టారని లాయర్ పేర్కొన్నారు. అయితే, ఈ వాదనలను ఏపీపీ (Public Prosecutor) తీవ్రంగా వ్యతిరేకించారు. కిడ్నాప్ జరిగిన సమయంలో నిందితుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు, మెసేజ్‌లు తమ వద్ద ఉన్నాయని, మోహన్‌బాబు పాత్రపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

విచారణకు సహకరించని మంచు విష్ణు?
ఈ కేసులో ఏ3 నిందితుడిగా ఉన్న మంచు విష్ణుపై కూడా పోలీసులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దర్యాప్తులో భాగంగా విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన స్పందించలేదని ఏపీపీ కోర్టుకు తెలిపారు. నిందితులకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, కాబట్టి ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని పోలీసుల తరఫు న్యాయవాది గట్టిగా వాదించారు. కిడ్నాప్ జరిగిన సమయంలో ప్రధాన నిందితుడు సతీష్‌తో మోహన్‌బాబు నిరంతరం టచ్‌లో ఉన్నట్లు కాల్ డేటా రికార్డులు సూచిస్తున్నాయని పేర్కొన్నారు.

ముందుకు సాగుతున్న దర్యాప్తు…
విద్యార్థి నేతలపై దాడి జరిగిన ఘటనలో వారికి తగిలిన గాయాలు  పోలీసులు వారిని విడిపించిన తీరును కోర్టు క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. విద్యార్థుల హక్కులను కాలరాస్తూ విద్యాసంస్థల యాజమాన్యం ఇలాంటి చర్యలకు పాల్పడటంపై విద్యార్థి సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. మరోవైపు మోహన్‌బాబు కుటుంబం ఇది ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యేనని ఆరోపిస్తోంది. ఈ నెల 12న జరగబోయే తదుపరి విచారణలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు రాజకీయ  సినీ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.

Spotlight

Read More →