Oil Reserves: ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశాలు.. టాప్-10 జాబితా! Used Cars: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? ఈ 5 తనిఖీలు చేయకుంటే చిక్కుల్లో పడ్డట్టే! Vegetable Prices: తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల మంట..! ఆకాశాన్ని తాకుతున్న కూరగాయల రేట్లు! Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు బంపర్ ఆఫర్! రోజుకు రూ.5 ఖర్చుతో.. అపరిమిత కాల్స్, 5G డేటా! Fire Accident: హైదరాబాద్ బాచుపల్లిలో భారీ అగ్నిప్రమాదం...! కోట్ల రూపాయల ఆస్తి నష్టం! Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం ధరలు... ఈరోజు రేట్లు ఇవే! Crude Oil: ఆకాశానికి ముడిచమురు ధరలు.. దేశ ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పు! భారత్‌పై రూ.13,000 కోట్ల అదనపు భారం!! Chicken Price: చికెన్ ప్రియులకు షాక్! కేవలం వారం రోజుల్లోనే ఆకాశాన్ని తాకిన ధరలు..! Vetlapalem Fire Accident: వేట్లపాలెంలో భారీ అగ్నిప్రమాదం.. హుటా హుటేనా సీఎం చంద్రబాబు సంఘటనా స్థలానికి! 8 మంది సజీవ దహనం! Micro finance: బ్యాంకు వెళ్లక్కర్లేదు.. ఇంటి వద్దకే మైక్రోఫైనాన్స్ రుణం! అర్హతలు ఏంటంటే? Oil Reserves: ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశాలు.. టాప్-10 జాబితా! Used Cars: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? ఈ 5 తనిఖీలు చేయకుంటే చిక్కుల్లో పడ్డట్టే! Vegetable Prices: తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల మంట..! ఆకాశాన్ని తాకుతున్న కూరగాయల రేట్లు! Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు బంపర్ ఆఫర్! రోజుకు రూ.5 ఖర్చుతో.. అపరిమిత కాల్స్, 5G డేటా! Fire Accident: హైదరాబాద్ బాచుపల్లిలో భారీ అగ్నిప్రమాదం...! కోట్ల రూపాయల ఆస్తి నష్టం! Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం ధరలు... ఈరోజు రేట్లు ఇవే! Crude Oil: ఆకాశానికి ముడిచమురు ధరలు.. దేశ ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పు! భారత్‌పై రూ.13,000 కోట్ల అదనపు భారం!! Chicken Price: చికెన్ ప్రియులకు షాక్! కేవలం వారం రోజుల్లోనే ఆకాశాన్ని తాకిన ధరలు..! Vetlapalem Fire Accident: వేట్లపాలెంలో భారీ అగ్నిప్రమాదం.. హుటా హుటేనా సీఎం చంద్రబాబు సంఘటనా స్థలానికి! 8 మంది సజీవ దహనం! Micro finance: బ్యాంకు వెళ్లక్కర్లేదు.. ఇంటి వద్దకే మైక్రోఫైనాన్స్ రుణం! అర్హతలు ఏంటంటే?

నాన్‌వెజ్ లవర్స్‌కు శుభవార్త..! చికెన్, గుడ్లు, మటన్ ధరలు భారీగా డౌన్!

పండుగల సీజన్ ముగియడంతో తెలుగు రాష్ట్రాల్లో చికెన్, కోడిగుడ్లు, మటన్ ధరలు భారీగా తగ్గాయి. కిలో చికెన్‌పై రూ.100 వరకు తగ్గుదల రావడంతో నాన్‌వెజ్ ప్రియులకు భారీ ఉపశమనం లభించింది.

Published : 2026-02-08 20:18:00

మొన్నటివరకు పండుగల సీజన్‌తో పాటు మేడారం జాతర ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఆకాశాన్ని తాకాయి. డిసెంబర్‌లో క్రిస్మస్, జనవరిలో కొత్త సంవత్సరం, ఆ వెంటనే సంక్రాంతి పండుగలు, మేడారం మహాజాతర ఒకేసారి రావడంతో చికెన్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ కారణంగా స్కిన్‌లెస్ చికెన్ ధర కిలో రూ.350 నుంచి రూ.380 వరకు పెరిగింది. డ్రెస్‌డ్ చికెన్ కిలో రూ.350 వరకు, లైవ్ కోడి రూ.200 వరకు విక్రయించడంతో నాన్‌వెజ్ ప్రియులు జేబు ఖాళీ చేసుకోవాల్సి వచ్చింది.

అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. పండుగల సీజన్ ముగియడంతో పాటు మేడారం జాతర కూడా పూర్తవడంతో చికెన్ డిమాండ్ ఒక్కసారిగా తగ్గిపోయింది. దీంతో ధరలు మెల్లమెల్లగా దిగివస్తున్నాయి. ప్రస్తుతం స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.240 నుంచి రూ.250 వరకు లభిస్తుండగా, డ్రెస్‌డ్ చికెన్ రూ.220 నుంచి రూ.230 మధ్య ఉంది. లైవ్ కోడి ధర కేవలం రూ.118 నుంచి రూ.120కే పరిమితమైంది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే చికెన్ ధరలు దాదాపు రూ.100 వరకు పడిపోవడంతో నాన్‌వెజ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పండుగల తర్వాత కోళ్లకు డిమాండ్ తగ్గడమే కాకుండా, కోళ్ల ఉత్పత్తి కూడా భారీగా పెరగడం వల్లే ధరలు పడిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. ఫార్మ్‌లలో ఉత్పత్తి ఎక్కువగా ఉండటం, మార్కెట్‌లో కొనుగోలుదారులు తక్కువగా ఉండటంతో తక్కువ ధరలకే చికెన్ విక్రయించాల్సి వస్తోందని అంటున్నారు. ముఖ్యంగా ఆదివారాల్లో సాధారణంగా చికెన్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు సండే కావడంతో చాలా మంది చికెన్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ధరలు తగ్గడంతో కుటుంబాలంతా నాన్‌వెజ్ వంటకాలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

చికెన్‌తో పాటు కోడిగుడ్ల ధరలు కూడా భారీగా తగ్గాయి. గత నెలలో ఒక్కో గుడ్డు ధర రూ.10 వరకు చేరగా, ప్రస్తుతం రిటైల్ షాపుల్లో కేవలం రూ.6కే లభిస్తోంది. దీంతో సామాన్య ప్రజలకు ధరల భారం తగ్గిందని చెప్పవచ్చు. అటు మటన్ ధరలు కూడా పండుగల సమయంలో కిలో రూ.1500 వరకు పలకగా, ఇప్పుడు రూ.800కే లభిస్తోంది. ధరలు తగ్గడంతో చికెన్, మటన్ దుకాణాల ముందు జనాలు క్యూ కడుతున్నారు. మొత్తం మీద పండుగల తర్వాత మాంసాహార ధరలు కుప్పకూలడంతో నాన్‌వెజ్ ప్రియులకు ఇది నిజంగా తీపి వార్తగా మారింది.

Spotlight

Read More →