India Big Move: అమెరికా ఆంక్షలకు భారత్ చెక్! మొత్తం నగదు రద్దు... ఇక ఇది చెల్లదు...! Credit Score: మీ క్రెడిట్ స్కోర్‌పై ఓ కన్నేయండి... క్రమం తప్పకుండా క్రెడిట్ రిపోర్ట్ తనిఖీ ఎందుకు ముఖ్యం? Mangoes: రంగును చూసి మోసపోవద్దు.. ఆ మామిడి పండ్లతో ప్రాణాపాయం! పోలీస్ కమిషనర్ ప్రత్యేక చిట్కాలు.. Gold Rates: దుబాయ్‌లో నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే? Raja Ravi Varma: వేలంలో రికార్డు సృష్టించిన రవివర్మ చిత్రం.. ఒక్క పెయింటింగ్ ధర ఇన్ని కోట్లా? India Shocks World: భారత్ ఆయిల్ జాక్పాట్.. ఉత్తరప్రదేశ్‌లో భారీ చమురు నిక్షేపాలు! ప్రయాగరాజ్ టూ బల్లియా 300 కి.మీ. బెల్ట్ గుర్తింపు! ఆరు నెలల్లోనే.! UPI Services: ఎస్‌బీఐ యూజర్లకు షాక్.. గంటల తరబడి లోడ్ కాని యూపీఐ యాప్‌లు.. యూజర్ల అసహనం! Income Tax: పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. దేశ పన్నుల విధానంలో విప్లవాత్మక మార్పులు! Toll Fees: విజయవాడ హైవే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న టోల్ రుసుములు.. నేటి నుంచే అమలు.! Tariff Refund: ఇకపై టారిఫ్ ల రీఫండింగ్ కు 45 రోజుల నిరీక్షణ! India Big Move: అమెరికా ఆంక్షలకు భారత్ చెక్! మొత్తం నగదు రద్దు... ఇక ఇది చెల్లదు...! Credit Score: మీ క్రెడిట్ స్కోర్‌పై ఓ కన్నేయండి... క్రమం తప్పకుండా క్రెడిట్ రిపోర్ట్ తనిఖీ ఎందుకు ముఖ్యం? Mangoes: రంగును చూసి మోసపోవద్దు.. ఆ మామిడి పండ్లతో ప్రాణాపాయం! పోలీస్ కమిషనర్ ప్రత్యేక చిట్కాలు.. Gold Rates: దుబాయ్‌లో నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే? Raja Ravi Varma: వేలంలో రికార్డు సృష్టించిన రవివర్మ చిత్రం.. ఒక్క పెయింటింగ్ ధర ఇన్ని కోట్లా? India Shocks World: భారత్ ఆయిల్ జాక్పాట్.. ఉత్తరప్రదేశ్‌లో భారీ చమురు నిక్షేపాలు! ప్రయాగరాజ్ టూ బల్లియా 300 కి.మీ. బెల్ట్ గుర్తింపు! ఆరు నెలల్లోనే.! UPI Services: ఎస్‌బీఐ యూజర్లకు షాక్.. గంటల తరబడి లోడ్ కాని యూపీఐ యాప్‌లు.. యూజర్ల అసహనం! Income Tax: పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. దేశ పన్నుల విధానంలో విప్లవాత్మక మార్పులు! Toll Fees: విజయవాడ హైవే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న టోల్ రుసుములు.. నేటి నుంచే అమలు.! Tariff Refund: ఇకపై టారిఫ్ ల రీఫండింగ్ కు 45 రోజుల నిరీక్షణ!

Mango: వేసవి ముందే మామిడి మార్కెట్ హాట్‌.. తోతాపురికి భారీ డిమాండ్!

Mango: వేసవి రాకముందే ఏపీలో మామిడి ఎగుమతులు ఊపందుకున్నాయి. NTR జిల్లా విస్సన్నపేట నుంచి ఎగుమతి అయిన తోతాపురి మామిడి ముంబై మార్కెట్లో టన్నుకు రూ.1,05,000 రికార్డు ధర పలికింది.

Published : 2026-02-11 11:25:00
AP Assembly: అసెంబ్లీలో గవర్నర్ సంచలన ప్రసంగం... గత ఐదేళ్లలో ఏపీ విధ్వంసం! రాష్ట్ర పునర్నిర్మాణమే ధ్యేయం..
  •  గతేడాది నష్టాలకు ఊరట: తోతాపురి మామిడికి ఈసారి బంపర్ రేట్లు
  •  ఉత్తరాది డిమాండ్‌తో దూసుకెళ్లిన తోతాపురి ధరలు
American Sweet Corn Farming: సిరులు కురిపిస్తున్న స్వీట్ కార్న్.. ఈ పంట వేస్తే తక్కువ పెట్టుబడితోనే భారీ లాభాలు!

ఏపీలో తోతాపురి మామిడికి రికార్డు ధర
ఆంధ్రప్రదేశ్‌లో వేసవి (summer mango) సీజన్ పూర్తిగా ప్రారంభం కాకముందే మామిడి ఎగుమతులు జోరందుకున్నాయి. ముఖ్యంగా తోతాపురి మామిడి రకానికి ఈ ఏడాది అనూహ్యమైన డిమాండ్ ఏర్పడింది. NTR జిల్లా విస్సన్నపేట ప్రాంతం నుంచి ఎగుమతి అయిన తోతాపురి మామిడి ముంబై మార్కెట్లో టన్నుకు రికార్డు స్థాయిలో రూ.1,05,000 ధర పలకడం రాష్ట్రవ్యాప్తంగా రైతుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. సాధారణంగా వేసవి మధ్యలో లేదా చివర్లో కనిపించే ఈ స్థాయి ధరలు ఈసారి సీజన్ ప్రారంభ దశలోనే రావడం విశేషంగా మారింది.

Liquor Rates: మందు బాబులకు మస్తు కిక్కు! భారీగా తగ్గనున్న మద్యం ధరలు!

వ్యాపారుల మాటల్లో చెప్పాలంటే, ఉత్తర భారత రాష్ట్రాల్లో తోతాపురి మామిడికి (mango) డిమాండ్ భారీగా పెరగడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. ముంబైతో పాటు ఢిల్లీ, పుణే, అహ్మదాబాద్ వంటి ప్రధాన నగరాల్లో ప్రాసెసింగ్ యూనిట్లు, జ్యూస్ తయారీ కంపెనీలు, పల్ప్ పరిశ్రమలు తోతాపురి మామిడిని పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నాయి. ముఖ్యంగా నాణ్యమైన పండ్లు, సరైన సైజ్, తక్కువ నష్టం కలిగిన దిగుబడులు ఉండటంతో AP నుంచి వెళ్లిన మామిడికి ఎక్కువ ధర పలుకుతోందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

విస్సన్నపేట ప్రాంతంలో ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు మామిడికి అనుకూలంగా ఉండటం కూడా రైతులకు కలిసి వచ్చింది. పూత దశలో పెద్దగా నష్టం లేకపోవడం, తగినంత తేమ లభించడం వల్ల దిగుబడులు మెరుగ్గా వచ్చాయి. దీంతో ఎగుమతిదారులు నేరుగా రైతుల వద్ద నుంచే కొనుగోలు చేసేందుకు ముందుకొస్తున్నారు. మధ్యవర్తులు తగ్గడంతో రైతులకు గిట్టుబాటు ధర లభిస్తోంది. కొంతమంది రైతులు ముందస్తు ఒప్పందాల ద్వారా కూడా మంచి లాభాలు పొందుతున్నారు.

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని రైతులు చెబుతున్నారు. గత సీజన్ చివరలో చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి టన్ను ధర రూ.12,000 నుంచి రూ.14,000 వరకు పడిపోవడంతో అనేక మంది రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నారు. రవాణా ఖర్చులు కూడా రాని పరిస్థితి అప్పట్లో నెలకొంది. అయితే ఈసారి సీజన్ ప్రారంభంలోనే ధరలు లక్ష రూపాయల స్థాయిని తాకడంతో అప్పట్లో ఎదురైన నష్టాలకు కొంత ఊరట లభిస్తోందని వారు భావిస్తున్నారు.

వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఈ ఏడాది మామిడి మార్కెట్‌పై సానుకూల అంచనాలు వ్యక్తం చేస్తున్నారు. ఎగుమతులు మరింత పెరిగే అవకాశముందని, ముఖ్యంగా ఉత్తర భారతంతో పాటు విదేశీ మార్కెట్ల నుంచి కూడా డిమాండ్ వచ్చే సూచనలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే రైతులు ఒక్కసారిగా ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకురావకుండా దశలవారీగా విక్రయించుకోవాలని, నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచిస్తున్నారు. మొత్తంగా తోతాపురి మామిడి రికార్డు ధరలు పలకడం వల్ల ఈ ఏడాది మామిడి రైతులకు లాభదాయకమైన సీజన్‌గా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Spotlight

Read More →