ఆండ్రాయిడ్ ఫోన్‌లోని సిమ్ నంబర్ (ICCID) అనేది ప్రతి సిమ్ కార్డ్‌కు ప్రత్యేకంగా ఉండే గుర్తింపు సంఖ్య. ఇది సాధారణంగా 19 లేదా 20 అంకెలతో ఉంటుంది మరియు మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్లు మీ సిమ్‌ను తమ సేవలకు అనుసంధానించడానికి ఈ సంఖ్యను ఉపయోగిస్తారు. సిమ్ నంబర్‌ను తెలుసుకోవడం కస్టమర్ కేర్ సేవలు, కనెక్టివిటీ సమస్యలు, సిమ్ మార్చడం, ఈసిమ్ యాక్టివేషన్ వంటి సందర్భాల్లో చాలా ఉపయోగపడుతుంది.
చాలా సిమ్ నంబర్లు 89 అనే అంకెలతో ప్రారంభమవుతాయి ఒకే ఫోన్‌లో రెండు లేదా ఎక్కువ సిమ్ కార్డ్‌లు ఉన్నప్పుడూ వాటిని సరైన విధంగా నిర్వహించడానికి ప్రతి సిమ్ యొక్క ICCID తెలుసుకోవడం మంచిది. ఆండ్రాయిడ్ ఫోన్‌లో సిమ్ నంబర్ తెలుసుకోవడం చాలా సులభం. ఫోన్‌లోని సెట్టింగ్స్ యాప్ ద్వారా ఈ వివరాలను చూచేందుకు అవకాశం ఉంటుంది. మీ ఫోన్‌ను ఆన్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘About phone’ లేదా ‘About device’ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. కొన్నిసార్లు బ్రాండ్‌ను బట్టి ఆప్షన్ పేరు తేడాగా ఉండొచ్చు. అక్కడ ‘Status’ లేదా ‘SIM card status’ అనే భాగంలోకి వెళితే ICCID లేదా సిమ్ నంబర్ కనిపిస్తుంది.
కొంతమంది యూజర్లకు ఈ ఆప్షన్ కనిపించకపోవచ్చు. అటువంటి సందర్భాల్లో సిమ్‌ను బయటకు తీసి కళ్లతో చూడవచ్చు. సిమ్‌ను బయటకు తీసే ముందు ఫోన్‌ను ఆఫ్ చేయడం మంచిది. ఒక చిన్న పిన్ లేదా సిమ్ ఈజెక్టర్ టూల్‌ను ఉపయోగించి ఫోన్ వెనుక భాగం లేదా ప్రక్క భాగంలో ఉన్న ట్రేను నెమ్మదిగా బయటికి తీయాలి. ట్రేలో ఉన్న సిమ్ కార్డ్‌ను జాగ్రత్తగా పట్టుకొని పరిశీలిస్తే దాని మీద ICCID సంఖ్య ముద్రించబడి ఉంటుంది. ఈ విధానం చాలా పాత ఫోన్లలో కూడా పని చేస్తుంది మరియు ఫోన్ లాక్ అయి ఉన్నా లేదా ఆఫ్‌లో ఉన్నా సిమ్ నంబర్ చూడవచ్చు.
మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో డయలర్ యాప్‌ను ఓపెన్ చేసి *#06# అని టైప్ చేస్తే స్క్రీన్‌పై ఒక పాప్-అప్ కనిపిస్తుంది. చాలా ఫోన్లలో ఈ కోడ్ ద్వారా IMEI నంబర్ మాత్రమే కనిపిస్తుంది. కొన్ని మోడళ్లలో IMEI తో పాటు ICCID కూడా అదే పేజీలో కనిపిస్తుంది. మీరు ఫోన్ బ్రాండ్‌ను బట్టి ఈ ఫీచర్ పని చేయకపోవచ్చు కాబట్టి ఇది నిర్ధారిత మార్గం కాదు. అయితే ప్రయత్నించడం హానిజనం కాదు.
ఆపై ఏదైనా కారణంగా ఈ మూడు పద్ధతుల ద్వారా కూడా మీ సిమ్ నంబర్ కనిపించకపోతే, మీ మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్ కస్టమర్ కేర్‌కి కాల్ చేసి వివరాలు అడగవచ్చు. వారు మీ సిమ్‌తో అనుసంధానమైన ICCIDను ధృవీకరించే అవకాశం ఉంది. కొన్ని థర్డ్ పార్టీ యాప్‌లు కూడా సిమ్ వివరాలు చూపుతాయని చెబుతాయి కానీ భద్రత కారణాల రీత్యా అధికారిక ప్లే స్టోర్ లేదా సురక్షిత వనరుల నుండి మాత్రమే యాప్‌లను డౌన్‌లోడ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. సెట్టింగ్స్ ద్వారా సిమ్ నంబర్ తెలుసుకోవడం అత్యంత సులభం, వేగవంతం మరియు భద్రత కలిగిన పద్ధతిగా భావించబడుతోంది.