బహ్రెయిన్: భారతీయ రాయబార కార్యాలయం "ఇండియా ఇన్ బహ్రెయిన్ ఫెస్టివల్" ని నిర్వహించింది. ఈ కార్యక్రమం జనవరి 12న సీఫ్ లోని ఎంబసీ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ ఫెస్టివల్ లో బహ్రెయిన్ లోని భారతీయులలో 500 మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు. భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ డయాస్పోరా చొరవతో సాంస్కృతిక సంబంధాలను ప్రోత్సహించడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాలు, కమ్యూనిటీల సాంస్కృతిక కార్యక్రమాలను జరుపుకోవడానికి ఇది వేదికగా నిలిచింది. బహ్రెయిన్ లో నివసిస్తున్న ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు గెలుచుకున్న వారు గౌరవ అతిథులుగా హాజరయ్యారు. ఈ ఫెస్టివల్ లో 30 కంటే ఎక్కువ భారతీయ కమ్యూనిటీ అసోసియేషన్ లు భారతదేశ ఫుడ్ వెరైటీలు, హ్యాండ్ క్రాఫ్ట్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బహ్రెయిన్ లో చదువుతున్న భారతీయ విద్యార్థి కాశ్వి సుబిన్ జగదీష్ రాసిన హెడ్ స్ట్రింగ్స్ అనే కవిత ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ICRF బులెటిన్ ను కూడా విడుదల చేశారు.
సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి