America: అమెరికా షట్ డౌన్..! నెలరోజుల్లో రూ.62,000 కోట్ల నష్టం..!

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రగ్స్ స్మగ్లింగ్‌పై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు భారీ ఆపరేషన్ చేపట్టారు. కొలంబో నుంచి వచ్చిన ఓ మహిళ వద్ద నుంచి రూ.47 కోట్ల విలువైన 4.7 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కొకైన్‌ను కాఫీ ప్యాకెట్లలో చాకచక్యంగా దాచినట్లు అధికారులు తెలిపారు. మహిళను అరెస్ట్ చేసిన తర్వాత దర్యాప్తు కొనసాగించగా, ఈ రాకెట్‌లో భాగమైన మరో నలుగురిని కూడా పట్టుకున్నారు. మొత్తం ఐదుగురిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు డీఆర్‌ఐ వెల్లడించింది.

Metro: హైదరాబాద్‌ మెట్రో రైలు సమయాల్లో మార్పులు..! ప్రయాణికులకు కీలక సమాచారం..!

డీఆర్‌ఐకి ముందుగానే ఒక విశ్వసనీయ సమాచారం అందింది. దాని ప్రకారం కొలంబో నుంచి ముంబైకి వస్తున్న విమాన ప్రయాణికురాలిని అధికారులు సస్పెక్ట్‌గా గుర్తించారు. ఆమె విమానం దిగగానే లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేయగా, కాఫీ ప్యాకెట్లలో దాచిన తొమ్మిది పౌచ్‌లు బయటపడ్డాయి. వాటిని పరీక్షించగా, అందులో ఉన్నది కొకైన్ అని తేలింది. దీంతో అధికారులు వెంటనే ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమెతోపాటు ఈ డ్రగ్స్ స్వీకరించేందుకు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన వ్యక్తినీ పట్టుకున్నారు.

కొత్త అసెంబ్లీ భవనం ప్రారంభించిన మోదీ!!

వారి విచారణలో, ఈ స్మగ్లింగ్ రాకెట్ వెనుక ఉన్న మిగతా ముగ్గురు వ్యక్తుల వివరాలు బయటపడ్డాయి. వారు డ్రగ్స్ రవాణా, ఫైనాన్స్, లాజిస్టిక్స్ వ్యవహారాలను చూసేవారని అధికారులు తెలిపారు. వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. మొత్తం 4.7 కిలోల కొకైన్ విలువ సుమారు రూ.47 కోట్లుగా ఉందని అంచనా వేశారు. ఈ డ్రగ్స్ రవాణా కొలంబో ద్వారా భారత మార్కెట్‌లోకి తీసుకురావాలనే పథకం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఓటీటీ లవర్స్‌కు పండగ.. ఒక్క రోజులో 20 కొత్త సినిమాలు! బ్లాక్ బస్టర్ నుంచి క్రైమ్ థ్రిల్లర్ వరకు.. ఇక్కడ చూసేయండి!

డీఆర్‌ఐ అధికారులు తెలిపారు – ఇటీవల కాలంలో అంతర్జాతీయ డ్రగ్ ముఠాలు భారతీయ మహిళలను “క్యారియర్లుగా” వాడుకుంటున్నాయని, ఆహార పదార్థాలు, కాఫీ ప్యాకెట్లలో డ్రగ్స్ దాచడం వంటి కొత్త పద్ధతులను అవలంబిస్తున్నాయని చెప్పారు. గత నెలలో ఢిల్లీలో కూడా డీఆర్‌ఐ పెద్ద ఆపరేషన్ నిర్వహించి 26 మంది విదేశీయులను అరెస్ట్ చేసి, రూ.108 కోట్ల విలువైన హెరాయిన్, కొకైన్, యాంఫెటమైన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు గుర్తుచేశారు. అంతర్జాతీయ డ్రగ్ నెట్‌వర్క్‌పై లోతైన దర్యాప్తు కొనసాగుతోందని డీఆర్‌ఐ వెల్లడించింది.

భారతీయుల కలల గమ్యంగా మారిన UAE గోల్డెన్ వీసా!
Movie update: జాన్వీ కపూర్‌ కొత్త మాస్ లుక్‌లో ఫ్యాన్స్‌ ఫిదా!
Crop Loss: ఏపీలో కరువు కాటుకు 37 మండలాలు బలి..! మూడు జిల్లాల్లో పంటల నష్టపరిస్థితి తీవ్రం..!
RTGS Centers: ఏపీలో విపత్తు నిర్వహణలో కొత్త అధ్యాయం..! ప్రతి జిల్లాలో RTGS కమాండ్‌ సెంటర్లు..!
Chrome: గూగుల్ క్రోమ్ వినియోగదారులకు హై రిస్క్ అలర్ట్..! వ్యక్తిగత డేటా దొంగిలించే ప్రమాదం..!
కాశీబుగ్గ ఘటనపై సీఎం చంద్రబాబు పలువురు మంత్రులు దిగ్భ్రాంతి! గాయపడిన వారికి మెరుగైన వైద్యం ఆదేశం!