India vs China: చైనా కంటే ముందే రేసులో నిలిచిన ఇండియా! 2nm చిప్ డిజైన్ పూర్తి! Gaganyaan Mission: అంతరిక్షంలోకి భారత వ్యోమగాములు…! గగన్‌యాన్ ప్లాన్ ఇదే..! India's First Singing Road: రోడ్డుపై వెళ్తే పాటలు వినొచ్చు.. ఎఫ్ఎం అక్కర్లేదు, ఫోన్ అవసరం లేదు! Google: ఏఐ యుగంలో గూగుల్ కొత్త స్ట్రాటజీ…! మారాలి లేక మానాలి! Google: AI ఆధిపత్యం కోసం ఆల్ఫాబెట్ మాస్టర్ ప్లాన్..! 32 బిలియన్ డాలర్ల బాండ్ ఇష్యూ! Sarvam Ai: జెమినీ, చాట్ జిపిటి కి సవాల్ విసురుతున్న భారతీయ స్టార్టప్.. సర్వం ఏఐ! AI రంగంలో సంచలనం..! విదేశీ దిగ్గజాలను దాటేసిన భారత్! Artificial Intelligence: భారత టెక్ రంగానికి 'ఏఐ' బూస్ట్.. ఇకపై సాఫ్ట్‌వేర్ సేవల్లో సరికొత్త విప్లవం..! బడ్జెట్ ఫోన్ లో DSLR లాంటి మ్యాక్రో ఫోటోలు తీయడం ఎలా? Smartphone Security Tips: ఫోన్ బ్యాటరీ, డేటా త్వరగా అయిపోతున్నాయా? అయితే మీ మొబైల్ ప్రమాదంలో ఉన్నట్లే.. వెంటనే ఈ కోడ్లతో చెక్ చేసుకోండి..!! India vs China: చైనా కంటే ముందే రేసులో నిలిచిన ఇండియా! 2nm చిప్ డిజైన్ పూర్తి! Gaganyaan Mission: అంతరిక్షంలోకి భారత వ్యోమగాములు…! గగన్‌యాన్ ప్లాన్ ఇదే..! India's First Singing Road: రోడ్డుపై వెళ్తే పాటలు వినొచ్చు.. ఎఫ్ఎం అక్కర్లేదు, ఫోన్ అవసరం లేదు! Google: ఏఐ యుగంలో గూగుల్ కొత్త స్ట్రాటజీ…! మారాలి లేక మానాలి! Google: AI ఆధిపత్యం కోసం ఆల్ఫాబెట్ మాస్టర్ ప్లాన్..! 32 బిలియన్ డాలర్ల బాండ్ ఇష్యూ! Sarvam Ai: జెమినీ, చాట్ జిపిటి కి సవాల్ విసురుతున్న భారతీయ స్టార్టప్.. సర్వం ఏఐ! AI రంగంలో సంచలనం..! విదేశీ దిగ్గజాలను దాటేసిన భారత్! Artificial Intelligence: భారత టెక్ రంగానికి 'ఏఐ' బూస్ట్.. ఇకపై సాఫ్ట్‌వేర్ సేవల్లో సరికొత్త విప్లవం..! బడ్జెట్ ఫోన్ లో DSLR లాంటి మ్యాక్రో ఫోటోలు తీయడం ఎలా? Smartphone Security Tips: ఫోన్ బ్యాటరీ, డేటా త్వరగా అయిపోతున్నాయా? అయితే మీ మొబైల్ ప్రమాదంలో ఉన్నట్లే.. వెంటనే ఈ కోడ్లతో చెక్ చేసుకోండి..!!

India's First Singing Road: రోడ్డుపై వెళ్తే పాటలు వినొచ్చు.. ఎఫ్ఎం అక్కర్లేదు, ఫోన్ అవసరం లేదు!

India's First Singing Road: కారు టైర్లు రోడ్డును తాకితే సంగీతం పుడుతుంది! ముంబయిలో ప్రారంభమైన దేశంలోనే తొలి మ్యూజికల్ రోడ్డు(Musical Road) విశేషాలు మీకు తెలుసా? హంగేరియన్ టెక్నాలజీతో రూపొందిన ఈ రోడ్డుపై ప్రయాణిస్తే కలిగే ఆ అనుభూతి...

Published : 2026-02-12 10:09:00

జపాన్, యూఏఈల తర్వాత మనమే!
ఏమిటీ మ్యూజికల్ రోడ్డు?
వేగాన్ని నియంత్రించే వినూత్న మార్గం…

ఆధునిక సాంకేతికతతో  మౌలిక సదుపాయాల కల్పనలో భారతదేశం మరో అద్భుత మైలురాయిని అధిగమించింది. వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఎటువంటి మ్యూజిక్ సిస్టమ్ అవసరం లేకుండానే, కేవలం రహదారిపై వాహనం నడుపుతుంటే సంగీతం వినిపించే వినూత్న పరిజ్ఞానాన్ని మన దేశంలోకి ప్రవేశపెట్టారు. ముంబయి కోస్టల్ రోడ్డు ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన దేశంలోనే మొట్టమొదటి మ్యూజికల్ రోడ్డు'ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ బుధవారం అధికారికంగా ప్రారంభించారు. ఈ అద్భుత దృశ్యం ఇప్పుడు సామాన్య ప్రయాణికులను మంత్రముగ్ధులను చేస్తుంది.

ఏమిటీ మ్యూజికల్ రోడ్డు?
వాహనంలో పాటలు వినాలంటే రేడియోనో లేదా స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీనో వాడుతుంటాం. కానీ ఈ మ్యూజికల్ రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు, వాహన చక్రాలు రహదారిపై ఉన్న ప్రత్యేక పట్టీలను  తాకినప్పుడు ఒక విధమైన ప్రకంపనలు ఏర్పడి సంగీతం వినిపిస్తుంది. హంగేరియన్ సాంకేతికతను ఉపయోగించి  సుమారు 700 మీటర్ల పొడవునా ఈ రోడ్డును డిజైన్ చేశారు. దక్షిణ ముంబయిలోని నారిమన్ పాయింట్ నుండి వర్లి వైపు వెళ్లే కారిడార్‌లో ఈ ప్రత్యేక అమరికను ఏర్పాటు చేశారు.


హృదయాలను హత్తుకునే 'జయహో' ధ్వని
ఈ మ్యూజికల్ రోడ్డుపై వాహనాలు వెళ్తున్నప్పుడు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రంలోని ప్రఖ్యాత "జయహో" సాంగ్ వినిపిస్తుంది. దేశభక్తిని పెంపొందించడంతో పాటు, భారతదేశం సాధించిన విజయాలకు గుర్తుగా ఈ పాటను ఎంచుకున్నట్లు బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అధికారులు వెల్లడించారు. సుమారు రూ. 6.21 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. కేవలం జపాన్, హంగేరి, దక్షిణ కొరియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి కొన్ని ఎంపిక చేసిన దేశాల్లో మాత్రమే ఉన్న ఈ టెక్నాలజీ ఇప్పుడు మన దేశంలో అందుబాటులోకి రావడం విశేషం.

కోస్టల్ రోడ్డు ప్రాజెక్టు ప్రాముఖ్యత
ముంబయి నగరంలో నిత్యం వేధించే ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారంగా BMC ఈ కోస్టల్ రోడ్డు కారిడార్‌ను చేపట్టింది. సుమారు రూ. 14,000 కోట్ల భారీ బడ్జెట్‌తో మెరైన్ లైన్స్ నుండి దహిసర్ వరకు 29.2 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మించారు. కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా, పర్యాటకులకు  వాహనదారులకు ఒక కొత్త రకమైన అనుభూతిని అందించడానికి ఈ మ్యూజికల్ రోడ్డును అందులో ఒక భాగంగా చేర్చారు.

ప్రయాణికులకు సూచనలు
ఈ రోడ్డుపై మ్యూజిక్ స్పష్టంగా వినిపించాలంటే వాహనాన్ని ఒక నిర్ణీత వేగంతో అంటే గంటకు 40 నుండి 60 కిలోమీటర్లు వేగంతో నడపాల్సి ఉంటుంది. వాహన వేగం మారితే సంగీతంలోని లయ  కూడా మారుతుంది. ఇది డ్రైవర్లను నిద్రమత్తు నుండి మేల్కొల్పడానికి మరియు అతి వేగాన్ని నియంత్రించడానికి కూడా ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముంబయి వాసులకు ఇది కేవలం రవాణా మార్గమే కాకుండా, ఒక పర్యాటక ఆకర్షణగా మారుతుందనడంలో సందేహం లేదు.
 

Spotlight

Read More →