NATS: అమెరికాలో ఘనంగా నాట్స్ సాంస్కృతిక సంబరాలు.. తెలుగు వైభవాన్ని ప్రతిబింబించిన ప్రవాస తెలుగు మహాసభ! Srivani Tickets: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్... మరో మూడు విమానాశ్రయాల్లో శ్రీవాణి టికెట్లు! Annamacharya Jayanthi: ఐరోపాలో భక్తిభావాన్ని నింపిన అన్నమయ్య సంకీర్తనల సుగంధం... 618వ జయంతి ఉత్సవాలు! Hydrogen Bus: ఢిల్లీ రోడ్లపై ‘జలశక్తి’ బస్సు... కేవలం రూ. 10లకే! ఈవీ బస్సుల కంటే సూపర్ ఫాస్ట్ గా... Fuel Price Hike: వాహనదారులపై పిడుగు... మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! Dwacra Womens: ఏపీలో వారికి శుభవార్త... పూచీకత్తు లేకుండానే రూ.10 లక్షల రుణం! Nara Lokesh: జగన్ రెడ్డి వంకర బుద్ధికి ఇదే నిదర్శనం.. కిట్ల పంపిణీ వక్రీకరణపై నారా లోకేష్ ఫైర్! Peddi Movie: ట్రెడిషనల్ జడ.. నుదుట బొట్టు.. మెరిసే కళ్లు: ‘పెద్ది’ ప్రమోషన్స్‌లో సాంప్రదాయ సౌందర్యంతో కట్టిపడేసిన జాన్వీ! TTD UPdates: తిరుమల యాత్రికులకు అలర్ట్: సర్వదర్శనం టోకెన్లు లేకుంటే 24 నుండి 30 గంటల వేచింపు ఖాయం! Palla Srinivasa Rao: “కాక్రోచ్ జనతా పార్టీ” ట్రెండ్‌పై పల్లా స్పందన! ఉద్యోగాలు, పెట్టుబడులే ఎన్డీయే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యం! NATS: అమెరికాలో ఘనంగా నాట్స్ సాంస్కృతిక సంబరాలు.. తెలుగు వైభవాన్ని ప్రతిబింబించిన ప్రవాస తెలుగు మహాసభ! Srivani Tickets: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్... మరో మూడు విమానాశ్రయాల్లో శ్రీవాణి టికెట్లు! Annamacharya Jayanthi: ఐరోపాలో భక్తిభావాన్ని నింపిన అన్నమయ్య సంకీర్తనల సుగంధం... 618వ జయంతి ఉత్సవాలు! Hydrogen Bus: ఢిల్లీ రోడ్లపై ‘జలశక్తి’ బస్సు... కేవలం రూ. 10లకే! ఈవీ బస్సుల కంటే సూపర్ ఫాస్ట్ గా... Fuel Price Hike: వాహనదారులపై పిడుగు... మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! Dwacra Womens: ఏపీలో వారికి శుభవార్త... పూచీకత్తు లేకుండానే రూ.10 లక్షల రుణం! Nara Lokesh: జగన్ రెడ్డి వంకర బుద్ధికి ఇదే నిదర్శనం.. కిట్ల పంపిణీ వక్రీకరణపై నారా లోకేష్ ఫైర్! Peddi Movie: ట్రెడిషనల్ జడ.. నుదుట బొట్టు.. మెరిసే కళ్లు: ‘పెద్ది’ ప్రమోషన్స్‌లో సాంప్రదాయ సౌందర్యంతో కట్టిపడేసిన జాన్వీ! TTD UPdates: తిరుమల యాత్రికులకు అలర్ట్: సర్వదర్శనం టోకెన్లు లేకుంటే 24 నుండి 30 గంటల వేచింపు ఖాయం! Palla Srinivasa Rao: “కాక్రోచ్ జనతా పార్టీ” ట్రెండ్‌పై పల్లా స్పందన! ఉద్యోగాలు, పెట్టుబడులే ఎన్డీయే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యం!

Minister Savitha: యాదవుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.. మంత్రి సవిత హామీ!

Minister Savitha: శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలో ఆదివారం యాదవ సమాజానికి సంబంధించిన కీలక కార్యక్రమం ఘనంగా జరిగింది. మల్లాపల్లి గ్రామ సమీపంలో యాదవ కల్యాణ మండపం నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించగా, రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Published : 2026-05-24 19:03:00

గోరంట్లలో యాదవ కల్యాణ మండపానికి భూమిపూజ..

యాదవ కల్యాణ మండప నిర్మాణానికి రూ.1 కోటి కేటాయింపు..

శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలో ఆదివారం యాదవ సమాజానికి సంబంధించిన కీలక కార్యక్రమం ఘనంగా జరిగింది. మల్లాపల్లి గ్రామ సమీపంలో యాదవ కల్యాణ మండపం నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించగా, రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఎంపీ బీకే పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, యాదవులు తెలుగుదేశం పార్టీకి ఆది నుంచి మూల స్తంభాలుగా నిలిచారని పేర్కొన్నారు. పార్టీ విజయాల్లో ఆ సామాజిక వర్గం కీలక పాత్ర పోషించిందని కొనియాడారు. ఎన్టీఆర్ బీసీల సంక్షేమం కోసం టీడీపీని స్థాపించారని, ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అదే దిశగా పనిచేస్తున్నారని చెప్పారు.

రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న ఎంఎస్ఎంఈ పార్కుల్లో బీసీలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి తెలిపారు. బీసీలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని చెప్పారు. త్వరలో అమలు చేయనున్న “ఆదరణ 3.0” పథకంలో యాదవులకు అధిక ప్రాధాన్యం కల్పించనున్నట్లు వెల్లడించారు.

పార్టీలో యాదవ సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతలు కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని మంత్రి గుర్తుచేశారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు కొలుసు పార్థసారథి, సత్యకుమార్ యాదవ్, బీద రవిచంద్ర యాదవ్ వంటి నేతలు పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారని అన్నారు.

గోరంట్లలో యాదవ కల్యాణ మండపం నిర్మాణానికి వైసీపీ నాయకులు అడ్డంకులు సృష్టించారని మంత్రి సవిత ఆరోపించారు. అయినప్పటికీ యాదవుల కోసం స్థలం కేటాయించి మాట నిలబెట్టుకున్నామని చెప్పారు. ఇదే ప్రాంతంలో వడ్డెర్లు, కాపులు, ఉప్పర సంఘాలకు కూడా స్థలాలు ఇచ్చినట్లు తెలిపారు. జగన్ పాలనలో బీసీలకు కనీసం సెంటు స్థలం కూడా కేటాయించలేదని విమర్శించారు.

శ్రీకృష్ణుడి ఆలయ నిర్మాణానికి యాదవులు ముందుకొస్తే సీజేఎఫ్ నిధుల మంజూరుకు సహకరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. యాదవుల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని పేర్కొన్నారు.

యాదవ కల్యాణ మండపం నిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.1 కోటి కేటాయించిన ఎంపీ బీకే పార్థసారథికి మంత్రి సవిత ధన్యవాదాలు తెలిపారు. అలాగే తన తండ్రి ఎస్. రామచంద్రారెడ్డి పేరుతో రూ.5,00,116లను సొంత నిధులుగా విరాళంగా అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో అక్కడి యాదవ సంఘ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి యాదవ్, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, కార్మిక కార్పొరేషన్ చైర్మన్ వెంకట శివుడు యాదవ్, సీపీఐ నాయకులు వేమయ్య యాదవ్, పలువురు డైరెక్టర్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు యాదవ సామాజిక వర్గానికి చెందిన పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం యాదవ సమాజంలో కొత్త ఉత్సాహాన్ని నింపడంతో పాటు, బీసీల అభివృద్ధిపై ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని మరోసారి స్పష్టంచేసింది.

Spotlight

Read More →