ఇప్పటి కాలంలో ప్రతి వ్యక్తి చేతిలో మొబైల్ ఫోన్ తప్పనిసరి అయిపోయింది. ఒకరు ఒకటి కాదు, రెండు మూడు సిమ్ కార్డులు కూడా వాడుతూ ఉంటారు. కానీ చాలా మంది పాత సిమ్‌లు వాడకపోయినా వాటిని సరైన విధంగా డియాక్టివేట్ చేయకుండా అలాగే ఉంచేస్తారు. ఈ కారణంగా వారి ఆధార్ నంబర్‌పై అనవసరంగా అనేక సిమ్‌లు యాక్టివ్‌గా ఉంటాయి. ఇది భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. ఎందుకంటే, ఎవరో దురుద్దేశంతో ఆ సిమ్‌లను వాడితే, చట్టపరమైన ఇబ్బందులు నిజమైన యజమానికే తలెత్తుతాయి. ఈ నేపథ్యంలో, వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం TAFCOP (Telecom Analytics for Fraud Management and Consumer Protection) అనే పోర్టల్‌ను ప్రారంభించింది.
ఈ పోర్టల్ ద్వారా ఎవరైనా తమ ఆధార్ నంబర్‌పై ఎన్ని సిమ్ కార్డులు యాక్టివ్‌గా ఉన్నాయో సులభంగా తెలుసుకోవచ్చు. విధానం చాలా సింపుల్ ముందుగా మీ మొబైల్ ఫోన్లోని బ్రౌజర్ ద్వారా https://tafcop.sancharsaathi.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. అక్కడ “Know your Mobile Connections” అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి, ఓటీపీ ద్వారా వెరిఫై చేయాలి. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మీ ఆధార్‌తో లింక్ అయిన అన్ని సిమ్ నంబర్లు స్క్రీన్‌పై కనిపిస్తాయి. వాటిలో మీరు ఉపయోగించని సిమ్‌లను గుర్తించి, వాటిని “This is not my number” లేదా “Not required” అనే ఆప్షన్ ద్వారా డియాక్టివేట్ చేసేందుకు రిక్వెస్ట్ చేయవచ్చు.
ఈ రిక్వెస్ట్ చేసిన తర్వాత, సంబంధిత టెలికం కంపెనీలు ఆ సిమ్ వివరాలను పరిశీలించి, అవసరమైతే ఆ నంబర్‌ను డియాక్టివేట్ చేస్తాయి. ఇది పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే భద్రమైన ప్రక్రియ. ఈ విధానం ద్వారా మీ ఆధార్ నంబర్‌పై ఉన్న అన్ని యాక్టివ్ సిమ్‌లను నియంత్రించడం చాలా సులభం. ఇది వ్యక్తిగత డేటా భద్రతకు, అలాగే సైబర్ మోసాల నివారణకు ఎంతో సహాయపడుతుంది.
ప్రస్తుతం ప్రతి వ్యక్తికి గరిష్టంగా 9 సిమ్ కార్డులు మాత్రమే ఆధార్‌పై యాక్టివ్‌గా ఉంచుకునే హక్కు ఉంది. ఒకవేళ ఆ సంఖ్యకు మించి సిమ్‌లు ఉన్నట్లయితే, టెలికం శాఖ వాటిపై విచారణ జరిపే అవకాశం ఉంటుంది. కాబట్టి వాడని లేదా మీకుచెందని సిమ్‌లను తొందరగా డియాక్టివేట్ చేయడం మంచిది.
పోలీసులు కూడా ప్రజలను ఈ విషయంపై అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే అనేక సార్లు నేరగాళ్లు పాత సిమ్‌లను వాడి మోసాలు చేస్తున్నారు. తరువాత ఆ సిమ్‌పై ఉన్న ఆధార్ నంబర్ యజమానికే ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మీరు ప్రస్తుతం ఏ సిమ్‌లు వాడుతున్నారో, ఏవీ వాడట్లేదో ఒకసారి TAFCOP పోర్టల్‌లో చెక్ చేసి, అవసరమైన చర్యలు తీసుకోవడం సమాజపరమైన బాధ్యతగా కూడా పరిగణించవచ్చు.
మొత్తం మీద, ఆధార్‌కు లింక్ అయిన వాడని సిమ్ కార్డులను డియాక్టివేట్ చేయడం ద్వారా మీరు మీ వ్యక్తిగత భద్రతను, మొబైల్ సెక్యూరిటీని, మరియు సైబర్ నేరాల నివారణలో మీ పాత్రను సమర్థవంతంగా నిలబెట్టుకోవచ్చు. ఈ చిన్న చర్య భవిష్యత్తులో పెద్ద సమస్యలనుంచి రక్షిస్తుంది.