Railway Station: ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఎయిర్పోర్ట్ లుక్ లో ఆ రైల్వే స్టేషన్... త్వరలోనే అట్టహాసంగా ప్రారంభం! YCP: వైసీపీకి బిగ్ షాక్... 500 కుటుంబాలకు పసుపు జెండా కప్పిన మంత్రి! Nimmala Ramanaidu: ఆర్థిక కష్టాల్లోనూ సూపర్ సిక్స్ అమలు! పాలకొల్లులో అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపన! AP New Highway: 8 గంటల్లోనే బెంగళూరుకు చేరొచ్చు.. 80 కిలోమీటర్ల దూరం తగ్గించనున్న నూతన ఆరు వరుసల రహదారి.! Tirumala: తిరుమలలో హిస్టారికల్ స్టెప్: రూ.25 కోట్లతో హై-టెక్ ఫుడ్ ల్యాబ్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు! New Airport: ప్రతి 45 రోజులకు ఒక కొత్త ఎయిర్‌పోర్ట్.. రామ్మోహన్ నాయుడు సంచలన ప్రకటన! Food Testing Unit: ఆహార నాణ్యతలో రాజీపడబోం - 12 వేల చదరపు అడుగుల్లో భారీ ఫుడ్ టెస్టింగ్ సెంటర్! West Bypass: విజయవాడ వెస్ట్ బైపాస్.. 47 కిలోమీటర్ల ఆరు వరసల రాజమార్గం.. రాకపోకలకు గ్రీన్ సిగ్నల్! New Railway Line: ప్రయాణికులకు బిగ్ రిలీఫ్ - హైదరాబాద్ టూ విజయవాడ కేవలం 230 కి.మీ! నాలుగవ రైల్వే లైన్ Chandrababu Wishes: ముస్లిం సోదర సోదరీమణులకు సీఎం చంద్రబాబు రంజాన్ శుభాకాంక్షలు - ఈద్ ముబారక్! Railway Station: ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఎయిర్పోర్ట్ లుక్ లో ఆ రైల్వే స్టేషన్... త్వరలోనే అట్టహాసంగా ప్రారంభం! YCP: వైసీపీకి బిగ్ షాక్... 500 కుటుంబాలకు పసుపు జెండా కప్పిన మంత్రి! Nimmala Ramanaidu: ఆర్థిక కష్టాల్లోనూ సూపర్ సిక్స్ అమలు! పాలకొల్లులో అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపన! AP New Highway: 8 గంటల్లోనే బెంగళూరుకు చేరొచ్చు.. 80 కిలోమీటర్ల దూరం తగ్గించనున్న నూతన ఆరు వరుసల రహదారి.! Tirumala: తిరుమలలో హిస్టారికల్ స్టెప్: రూ.25 కోట్లతో హై-టెక్ ఫుడ్ ల్యాబ్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు! New Airport: ప్రతి 45 రోజులకు ఒక కొత్త ఎయిర్‌పోర్ట్.. రామ్మోహన్ నాయుడు సంచలన ప్రకటన! Food Testing Unit: ఆహార నాణ్యతలో రాజీపడబోం - 12 వేల చదరపు అడుగుల్లో భారీ ఫుడ్ టెస్టింగ్ సెంటర్! West Bypass: విజయవాడ వెస్ట్ బైపాస్.. 47 కిలోమీటర్ల ఆరు వరసల రాజమార్గం.. రాకపోకలకు గ్రీన్ సిగ్నల్! New Railway Line: ప్రయాణికులకు బిగ్ రిలీఫ్ - హైదరాబాద్ టూ విజయవాడ కేవలం 230 కి.మీ! నాలుగవ రైల్వే లైన్ Chandrababu Wishes: ముస్లిం సోదర సోదరీమణులకు సీఎం చంద్రబాబు రంజాన్ శుభాకాంక్షలు - ఈద్ ముబారక్!

Indian Aviation Sector: సామాన్యుడికి విమాన ప్రయాణం మరింత దగ్గర.. విమానాల్లో 'పెట్ పాలసీ..కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు.

Indian Aviation Sector: సీఐఐ స్వర్ణాంధ్ర సదస్సులో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రసంగం. దేశంలో ప్రతి 45 రోజులకు ఒక ఎయిర్‌పోర్ట్ ప్రారంభం, రష్యా టెక్నాలజీతో స్వదేశీ విమానాల తయారీ, ఏపీలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు వంటి కీలక అంశాలు..

Published : 2026-03-21 18:07:00

Vijayawada:  భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన  సుస్థిరమైన దేశంగా ఎదుగుతోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. విజయవాడలో జరిగిన సీఐఐ స్వర్ణాంధ్ర సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ ఆర్థిక వృద్ధిని ప్రపంచ దేశాలన్నీ ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నాయని చెప్పారు. ముఖ్యంగా పౌర విమానయాన రంగంలో భారత్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోందని, ప్రతి 45 రోజులకు ఒక కొత్త విమానాశ్రయాన్ని ప్రారంభించే స్థాయికి మనం చేరుకున్నామని ఆయన సగర్వంగా ప్రకటించారు.

సామాన్యుడికి చేరువైన 'ఉడాన్'.. త్వరలో స్వదేశీ విమానాలు

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఉడాన్' పథకం ద్వారా విమాన ప్రయాణం కేవలం ధనికులకే పరిమితం కాకుండా సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చిందని మంత్రి తెలిపారు. విమాన తయారీ రంగంలో కూడా భారత్ అడుగులు వేస్తోందని, రష్యా సాంకేతిక పరిజ్ఞానంతో త్వరలోనే 100 సీట్ల సామర్థ్యం కలిగిన విమానాలను ఇక్కడే నిర్మిస్తామని వెల్లడించారు. ఈ స్వదేశీ విమానాలు అందుబాటులోకి వస్తే దేశీయంగా విమాన సర్వీసులు మరింత పెరుగుతాయని, ప్రయాణికులపై భార పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన హామీ ఇచ్చారు.

విమానాల్లో 'పెట్ పాలసీ'.. ప్రయాణికులకు మరిన్ని వెసులుబాట్లు

విమాన ప్రయాణికుల సౌకర్యార్థం మరికొన్ని కొత్త నిబంధనలను తీసుకువస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. విమానాల్లో పెంపుడు జంతువులను అనుమతించేలా 'పెట్ పాలసీ'ని అమలు చేయాలని విమానయాన సంస్థలను ఆదేశించినట్లు చెప్పారు. అలాగే, భద్రతా ప్రమాణాలకు లోబడి సురక్షితమైన ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా అనుమతించాలని కోరామన్నారు. ప్రయాణికుల అనుభవాన్ని మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా సాంకేతిక మార్పులు చేస్తున్నట్లు ఆయన వివరించారు.

ముఖ్యమంత్రి విజన్.. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సీఐఐకి అపారమైన నమ్మకం ఉందని రామ్మోహన్ నాయుడు అన్నారు. 'విజన్ 2047' లక్ష్య సాధనలో సీఐఐ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగిందని, అందుకే అనేక కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని తెలిపారు. ఈ నెల 23న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరగనుందని, ఇది రాష్ట్ర పారిశ్రామిక రంగానికి పెద్ద ఊపునిస్తుందని చెప్పారు.

రైల్వే జోన్ పనులు.. కేకే లైన్‌పై చర్చలు

విశాఖ రైల్వే జోన్ గురించి ప్రస్తావిస్తూ.. జోన్ ప్రధాన కార్యాలయానికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. సరిహద్దులకు సంబంధించిన అంశాలపై స్పష్టత వచ్చిన వెంటనే రైల్వే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా కేకే (కొత్తవలస-కిరండూల్) లైన్ గురించి కూడా చర్చలు సాగుతున్నాయని, త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.

Spotlight

Read More →