Pensions: 50 ఏళ్లకే పెన్షన్ ముహూర్తం ఫిక్స్.. ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్! Minister Gottipati: కరెంట్ పోతే వెంటనే ఈ నంబర్ కు కాల్ చేయండి... మంత్రి గొట్టిపాటి రవికుమార్ Mahanadu: హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు.. ప్రపంచవ్యాప్తంగా కార్యకర్తలకు డిజిటల్ కనెక్టివిటీ! Chandrababu: స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా వ్యవసాయ రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్ష! Salary Hike: ఏపీలో ఆ ఉద్యోగులకు జీతాలు పెంపు.. ఒక్కొక్కరికి 10శాతానికిపైన, మంత్రి కీలక ఆదేశాలు! Nara Lokesh: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు విడుదల: రికార్డు స్థాయిలో 99.30 శాతం ఉత్తీర్ణతతో అభ్యర్థుల హవా! Modi: మోదీ ప్రభుత్వ 12 ఏళ్లు భారత్ అభివృద్ధి చరిత్రలో పరివర్తన దశ.. రాజ్‌నాథ్ సింగ్! Pawan Kalyan: పుణ్యం మాట దేవుడెరుగు.. రోగాలు మాత్రం ఖాయం! గోదావరి కాలుష్యంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన! Visakhapatnam Metro: విశాఖ మెట్రో ప్రాజెక్టులో కీలక మార్పు... డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌ 13 కిలోమీటర్లే... కేంద్రం నిర్ణయంపై ఉత్కంఠ! LPG: రోజుకు 50 వేల టన్నులకు పెరిగిన ఎల్పీజీ ఉత్పత్తి! కేంద్రం కీలక ప్రకటన! Pensions: 50 ఏళ్లకే పెన్షన్ ముహూర్తం ఫిక్స్.. ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్! Minister Gottipati: కరెంట్ పోతే వెంటనే ఈ నంబర్ కు కాల్ చేయండి... మంత్రి గొట్టిపాటి రవికుమార్ Mahanadu: హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు.. ప్రపంచవ్యాప్తంగా కార్యకర్తలకు డిజిటల్ కనెక్టివిటీ! Chandrababu: స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా వ్యవసాయ రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్ష! Salary Hike: ఏపీలో ఆ ఉద్యోగులకు జీతాలు పెంపు.. ఒక్కొక్కరికి 10శాతానికిపైన, మంత్రి కీలక ఆదేశాలు! Nara Lokesh: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు విడుదల: రికార్డు స్థాయిలో 99.30 శాతం ఉత్తీర్ణతతో అభ్యర్థుల హవా! Modi: మోదీ ప్రభుత్వ 12 ఏళ్లు భారత్ అభివృద్ధి చరిత్రలో పరివర్తన దశ.. రాజ్‌నాథ్ సింగ్! Pawan Kalyan: పుణ్యం మాట దేవుడెరుగు.. రోగాలు మాత్రం ఖాయం! గోదావరి కాలుష్యంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన! Visakhapatnam Metro: విశాఖ మెట్రో ప్రాజెక్టులో కీలక మార్పు... డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌ 13 కిలోమీటర్లే... కేంద్రం నిర్ణయంపై ఉత్కంఠ! LPG: రోజుకు 50 వేల టన్నులకు పెరిగిన ఎల్పీజీ ఉత్పత్తి! కేంద్రం కీలక ప్రకటన!

Visakhapatnam Metro: విశాఖ మెట్రో ప్రాజెక్టులో కీలక మార్పు... డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌ 13 కిలోమీటర్లే... కేంద్రం నిర్ణయంపై ఉత్కంఠ!

Visakhapatnam Metro: విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టులో భాగంగా ప్రతిపాదించిన 20 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ కారిడార్‌ను 13 కిలోమీటర్లకు కుదించాలని 'రైట్స్' కన్సల్టెన్సీ సంస్థ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. గాజువాక నుంచి హనుమంతవాక వరకు ఈ కారిడార్ సరిపోతుందని సంస్థ పేర్కొంది. జాతీయ రహదారిపై ట్రాఫిక్ నియంత్రణ కోసం ఫ్లైఓవర్‌తో కలిపి ఈ మెట్రో లైన్‌ను ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రతిపాదించగా, రైట్స్ సంస్థ పొడవును తగ్గించమనడం ఇప్పుడు నగరంలో చర్చనీయాంశంగా మారింది.

Published : 2026-05-26 12:26:00

Politics- 20 కిలోమీటర్ల ప్రతిపాదనకు 13 కిలోమీటర్లే చాలన్న రైట్స్.. కేంద్రం నిర్ణయంపై ఉత్కంఠ!

జాతీయ రహదారిపై మెట్రో మ్యాజిక్.. ఫ్లైఓవర్‌పైనే డబుల్ డెక్కర్ కారిడార్ డిజైన్!

రూ.11,498 కోట్లతో విశాఖ మెట్రో మొదటి దశ.. డబుల్ డెక్కర్ పొడవుపై కొత్త మెలిక!

Visakhapatnam Metro: విశాఖపట్నం నగరంలో ప్రతిపాదించిన ప్రతిష్టాత్మక మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. నగరంలో ట్రాఫిక్ సమస్యల నివారణకు ఎంతో ఉపయోగపడుతుందని భావించిన డబుల్ డెక్కర్ మెట్రో కారిడార్ పొడవును కుదించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు అందాయి. ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ 'రైట్స్' (RITES) నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ మేరకు కేంద్రానికి కీలక సూచనలు చేసింది.

వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ నగరంలో మొత్తం 20 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ మెట్రో కారిడార్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అయితే, రైట్స్ కన్సల్టెన్సీ సంస్థ క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన తర్వాత, అంత పొడవు అవసరం లేదని తేల్చింది. నగరంలో ట్రాఫిక్ అవసరాల దృష్ట్యా 20 కిలోమీటర్లకు బదులుగా కేవలం 13 కిలోమీటర్ల పొడవునా డబుల్ డెక్కర్ కారిడార్ నిర్మిస్తే సరిపోతుందని కేంద్రానికి నివేదించింది.

ఈ ప్రతిపాదిత డబుల్ డెక్కర్ మెట్రో కారిడార్‌ను గాజువాక నుంచి హనుమంతవాక వరకు నిర్మిస్తే సరిపోతుందని రైట్స్ సంస్థ సూచించినట్లు సమాచారం. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన ప్లాన్ ప్రకారం.. స్టీల్‌ప్లాంట్ నుంచి గాజువాక వరకు 5 కిలోమీటర్లు, అలాగే తాటిచెట్లపాలెం నుంచి మధురవాడ వరకు 15 కిలోమీటర్ల మేర ఈ డబుల్ డెక్కర్ వ్యవస్థను రూపొందించాలని భావించారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నిర్మించే ఫ్లైఓవర్‌పైనే ఈ మెట్రో కారిడార్ వచ్చేలా డిజైన్ చేయడం వల్ల భూసేకరణ అవసరం ఉండదని, ఖర్చు కూడా తగ్గుతుందని ఆశించారు.

విశాఖపట్నంలో మొత్తం మీద 140.13 కిలోమీటర్ల పొడవునా భారీ మెట్రో రైల్ ప్రాజెక్టును ప్రతిపాదించగా, మొదటి దశలో భాగంగా 46.23 కిలోమీటర్ల మేర రూ.11,498 కోట్లతో పనులు చేపట్టేందుకు డీపీఆర్ సిద్ధం చేశారు. జాతీయ రహదారిపై లంకెలపాలెం నుంచి మధురవాడ వరకు ట్రాఫిక్ నియంత్రణ కోసం ఫ్లైఓవర్ నిర్మించాలని ఎన్‌హెచ్‌ఏఐ భావించిన నేపథ్యంలో ఈ డబుల్ డెక్కర్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

నగరంలో రోజురోజుకూ ట్రాఫిక్ ఇబ్బందులు పెరుగుతుండటంతో విశాఖ ప్రజలు మెట్రో రైలు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 20 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ కారిడార్‌ను రైట్స్ సంస్థ 13 కిలోమీటర్లకు కుదించాలని సిఫార్సు చేయడం స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రతిపాదనలను ఇలా తగ్గించడం సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Spotlight

Read More →