Ashok Babu: ఉద్యోగుల పాలిట నరరూప రాక్షసుడు జగన్... ఆ తప్పు చేయడం వల్లే.. రూ.30 వేల కోట్ల బకాయిలు! Nadendla Manohar: మంత్రి నాదెండ్ల మనోహర్‌కు సీఎం ఫోన్.. పితృ వియోగంపై ప్రగాఢ సానుభూతి!! Singapore Maritime Week: సింగపూర్ మారిటైమ్ వీక్‌లో ఏపీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్... మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి! Nadendla Bhaskara Rao: నాదెండ్ల భాస్కరరావు మృతి రాజకీయ రంగానికి తీరని లోటు... మంత్రి కందుల దుర్గేష్! Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ డబ్బులు రాలేదా... వెంటనే ఈ పని చేయండి! AP Politics: ఏపీ మంత్రుల సింగపూర్ పర్యటన! హోం మంత్రి షణ్ముగంతో మంత్రుల బృందం కీలక భేటీ! AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణంలో కీలక మలుపు..! మాజీ సీఎం స్పెషల్ సెక్రటరీపై చర్యలకు సిట్ సిద్ధం! Chandrababu Action Plan: చంద్రబాబు యాక్షన్ ప్లాన్... నేడు అమలాపురం, కోనసీమ నేతలతో కీలక భేటీ! AP High Court: ఏపీలో కారుణ్య నియామకాల గుట్టురట్టు... పదేళ్లలో 20 వేల కొలువుల భర్తీ!! Chandrababu: నేడు సచివాలయానికి సీఎం చంద్రబాబు... ఫుల్ డీటైల్స్!! Ashok Babu: ఉద్యోగుల పాలిట నరరూప రాక్షసుడు జగన్... ఆ తప్పు చేయడం వల్లే.. రూ.30 వేల కోట్ల బకాయిలు! Nadendla Manohar: మంత్రి నాదెండ్ల మనోహర్‌కు సీఎం ఫోన్.. పితృ వియోగంపై ప్రగాఢ సానుభూతి!! Singapore Maritime Week: సింగపూర్ మారిటైమ్ వీక్‌లో ఏపీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్... మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి! Nadendla Bhaskara Rao: నాదెండ్ల భాస్కరరావు మృతి రాజకీయ రంగానికి తీరని లోటు... మంత్రి కందుల దుర్గేష్! Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ డబ్బులు రాలేదా... వెంటనే ఈ పని చేయండి! AP Politics: ఏపీ మంత్రుల సింగపూర్ పర్యటన! హోం మంత్రి షణ్ముగంతో మంత్రుల బృందం కీలక భేటీ! AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణంలో కీలక మలుపు..! మాజీ సీఎం స్పెషల్ సెక్రటరీపై చర్యలకు సిట్ సిద్ధం! Chandrababu Action Plan: చంద్రబాబు యాక్షన్ ప్లాన్... నేడు అమలాపురం, కోనసీమ నేతలతో కీలక భేటీ! AP High Court: ఏపీలో కారుణ్య నియామకాల గుట్టురట్టు... పదేళ్లలో 20 వేల కొలువుల భర్తీ!! Chandrababu: నేడు సచివాలయానికి సీఎం చంద్రబాబు... ఫుల్ డీటైల్స్!!

Election Commission: ఖర్గే వ్యాఖ్యలపై రాజకీయ దుమారం.. ఈసీఐకి ఫిర్యాదు చేసిన బీజేపీ!

Election Commission: దేశ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది.

Published : 2026-04-22 15:37:00

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు..

విషయంపై స్పందించిన ఎన్నికల కమిషన్..

దేశ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది.

ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్వాల్, అరుణ్ సింగ్ తదితరులతో కూడిన బీజేపీ ప్రతినిధి బృందం భారత ఎన్నికల కమిషన్ ను కలిసి ఫిర్యాదు చేసింది.

సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కిరణ్ రిజిజు, దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాంటి భాషను ఉపయోగించడం ప్రజాస్వామ్యానికి అవమానకరమని అన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుందని పేర్కొన్నారు. ఖర్గేపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్‌ను కోరామని తెలిపారు.

ఇక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వంటి ఉన్నత స్థాయి నాయకుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని చెప్పారు. ప్రధాని మోదీపై పదేపదే అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటైందని ఆరోపించారు.

ఈ విషయంపై స్పందించిన ఎన్నికల కమిషన్, ఫిర్యాదును పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఖర్గే వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో మరోసారి వేడిని పెంచగా, ఈ వ్యవహారం ఎలా మలుపు తిరుగుతుందన్నదానిపై అందరి దృష్టి నిలిచింది.

Spotlight

Read More →