Nara Lokesh: విశాఖలో లోకేష్‌కు ఘనస్వాగతం.. విమానాశ్రయం వద్ద 'జాబ్ క్రియేటర్ ఇన్ చీఫ్' అంటూ యువత కేరింతలు.! Chandrababu: ఏపీలో ఇంధన కొరతపై చంద్రబాబు మరోసారి టెలీకాన్ఫరెన్స్! ప్రతీ 3 గంటలకు.. Duvvada Madhuri: టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన దువ్వాడ మాధురి.. పవర్‌ఫుల్ పాత్రతో సినీ ఆరంగేట్రం! స్టార్ హీరోయిన్ చేతుల మీదుగా.. Green Energy Corridor: ఏపీలో మరో భారీ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం.. రూ.21వేల కోట్లతో గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌!! Minister Nimmala: ప్రజలను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు.. బ్లాక్ మార్కెట్ దారులకు మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్.! Singapore AP Ministers: డ్రగ్స్, ఉగ్రవాదంపై ఉక్కుపాదం.. సింగపూర్ హోమ్ మంత్రిత్వ శాఖ వ్యూహాలను అడిగి తెలుసుకున్న మంత్రులు.. Visakha Metro: విశాఖ మెట్రోలో భారీ మార్పు... కొత్త రూట్ ఫిక్స్! ఆ ప్రాంతాలకు మహర్దశ! H-City Project: పాతబస్తీకి సరికొత్త వెలుగులు.. రూ.7,042 కోట్లతో 'హెచ్-సిటీ' ప్రాజెక్ట్! అడ్డంకులు తొలగించి.. Metro Projects: ఏపీ మెట్రో ప్రాజెక్టులకు కొత్త జోష్ - ₹11 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం!! 2030 నాటికి డెడ్ లైన్… Amaravati Quantum Valley: అమరావతిలో ఆకాశహర్మ్యాలు.... రూ.1,200 కోట్లతో క్వాంటం టవర్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్! Nara Lokesh: విశాఖలో లోకేష్‌కు ఘనస్వాగతం.. విమానాశ్రయం వద్ద 'జాబ్ క్రియేటర్ ఇన్ చీఫ్' అంటూ యువత కేరింతలు.! Chandrababu: ఏపీలో ఇంధన కొరతపై చంద్రబాబు మరోసారి టెలీకాన్ఫరెన్స్! ప్రతీ 3 గంటలకు.. Duvvada Madhuri: టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన దువ్వాడ మాధురి.. పవర్‌ఫుల్ పాత్రతో సినీ ఆరంగేట్రం! స్టార్ హీరోయిన్ చేతుల మీదుగా.. Green Energy Corridor: ఏపీలో మరో భారీ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం.. రూ.21వేల కోట్లతో గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌!! Minister Nimmala: ప్రజలను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు.. బ్లాక్ మార్కెట్ దారులకు మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్.! Singapore AP Ministers: డ్రగ్స్, ఉగ్రవాదంపై ఉక్కుపాదం.. సింగపూర్ హోమ్ మంత్రిత్వ శాఖ వ్యూహాలను అడిగి తెలుసుకున్న మంత్రులు.. Visakha Metro: విశాఖ మెట్రోలో భారీ మార్పు... కొత్త రూట్ ఫిక్స్! ఆ ప్రాంతాలకు మహర్దశ! H-City Project: పాతబస్తీకి సరికొత్త వెలుగులు.. రూ.7,042 కోట్లతో 'హెచ్-సిటీ' ప్రాజెక్ట్! అడ్డంకులు తొలగించి.. Metro Projects: ఏపీ మెట్రో ప్రాజెక్టులకు కొత్త జోష్ - ₹11 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం!! 2030 నాటికి డెడ్ లైన్… Amaravati Quantum Valley: అమరావతిలో ఆకాశహర్మ్యాలు.... రూ.1,200 కోట్లతో క్వాంటం టవర్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్!

Minister Nimmala: ప్రజలను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు.. బ్లాక్ మార్కెట్ దారులకు మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్.!

Minister Nimmala: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రజా సేవలో నిమగ్నమయ్యారు. పట్టణంలోని మూడు ముఖ్య కూడళ్ళలో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి మజ్జిగ చలివేంద్రాలను ఆయన ప్రారంభించారు.

Published : 2026-04-27 13:42:00
  • Politics: "రైతులు, ఆక్వా రంగానికి కూపన్ సిస్టమ్": డీజిల్ సరఫరాలో ప్రాధాన్యత కల్పించిన మంత్రి నిమ్మల..
     
  • "బ్లాక్ మార్కెటింగ్ చేస్తే ఊపేక్షించేది లేదు": కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలకు ఆదేశం..

Minister Nimmala: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రజా సేవలో నిమగ్నమయ్యారు. పట్టణంలోని మూడు ముఖ్య కూడళ్ళలో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి మజ్జిగ చలివేంద్రాలను ఆయన ప్రారంభించారు. ప్రతి ఏటా సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మంత్రి, బాటసారులకు, సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించేలా మజ్జిగను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరారు.

మరోవైపు జిల్లాలో తలెత్తిన పెట్రోల్, డీజిల్ కొరతపై మంత్రి నిమ్మల రామానాయుడు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు. ఎన్నికల అనంతరం ఇంధన ధరలు పెరుగుతాయని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కేవలం అపోహలేనని, ప్రజలు వాటిని నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు. గత ఏడాది ఏప్రిల్‌తో పోలిస్తే సరఫరాలో స్వల్ప మార్పులు ఉన్నప్పటికీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ వంటి కంపెనీలు సాంకేతిక కారణాలతో ఉత్పత్తిని తగ్గించడం వల్లే ఈ తాత్కాలిక ఇబ్బంది తలెత్తిందని వివరించారు. ముఖ్యంగా పవర్ కట్, ఆక్వా రంగం మరియు ధాన్యం కోతల నేపథ్యంలో డీజిల్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగిందని, దీనిని అధిగమించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని హామీ ఇచ్చారు.

కృత్రిమ కొరతను సృష్టించి పెట్రోల్, డీజిల్‌ను బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రైతులకు మరియు ఆక్వా రంగానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూపన్ సిస్టమ్ ద్వారా ఇంధన సరఫరా చేయాలని, ఇందుకోసం రెవెన్యూ మరియు వ్యవసాయ అధికారులు నిరంతరం సమన్వయం చేసుకోవాలని సూచించారు. వాస్తవ డిమాండ్ కంటే సరఫరాను పెంచడం ద్వారా రాబోయే ఒకటి రెండు రోజుల్లో ఈ సమస్య పూర్తిగా పరిష్కారమవుతుందని ఆయన భరోసా ఇచ్చారు. ప్రజావసరాలను ఆసరాగా చేసుకుని ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని మంత్రి నిమ్మల రామానాయుడు హెచ్చరించారు.

Spotlight

Read More →