Chandrababu: మోదీ, అమిత్ షాలకు చంద్రబాబు అభినందనలు.. బెంగాల్, అస్సాం ఫలితాలపై హర్షం.. Tamil Politics: దూసుకుపోతున్న టీవీకే.. విజయ్ ఇంటి వద్ద భద్రత పెంపు.. దళపతి నివాసం వద్ద భారీ పోలీస్ బందోబస్తు.! New Pensions: ఏపీలో కొత్త పెన్షన్ల దరఖాస్తులపై కీలక అప్డేట్! TVK party: 50 ఏళ్ల రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తున్న టీవీకే.! విజయ్ ప్రభంజనం.. కింగ్‌మేకర్‌గా దళపతి? Farmers: రైతులకు శుభవార్త... భారీ సబ్సిడీతో వ్యవసాయ యంత్రాల పంపిణీ! పూర్తి వివరాలు... PM Modi: ఐదు రాష్ట్రాల కౌంటింగ్ వేళ.. మోదీ ట్వీట్‌పై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ! Pawan Kalyan: సింధు ప్రశంసలు.. పవన్ రిప్లై: ‘మ్యాజిక్’ డ్రెయిన్స్‌పై ఆసక్తికర చర్చ! Chandrababu: నేడు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీ షెడ్యూల్! Mahanadu 2026: నెల్లూరు మహానాడుకు భారీ ఏర్పాట్లు- మంత్రి నారాయణ! Elections 2026: మరికాసేపట్లో కౌంటింగ్.. నాలుగు రాష్ట్రాల సమరం! నేడే తుది ఫలితాలు - ఎవరికి పట్టం? Chandrababu: మోదీ, అమిత్ షాలకు చంద్రబాబు అభినందనలు.. బెంగాల్, అస్సాం ఫలితాలపై హర్షం.. Tamil Politics: దూసుకుపోతున్న టీవీకే.. విజయ్ ఇంటి వద్ద భద్రత పెంపు.. దళపతి నివాసం వద్ద భారీ పోలీస్ బందోబస్తు.! New Pensions: ఏపీలో కొత్త పెన్షన్ల దరఖాస్తులపై కీలక అప్డేట్! TVK party: 50 ఏళ్ల రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తున్న టీవీకే.! విజయ్ ప్రభంజనం.. కింగ్‌మేకర్‌గా దళపతి? Farmers: రైతులకు శుభవార్త... భారీ సబ్సిడీతో వ్యవసాయ యంత్రాల పంపిణీ! పూర్తి వివరాలు... PM Modi: ఐదు రాష్ట్రాల కౌంటింగ్ వేళ.. మోదీ ట్వీట్‌పై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ! Pawan Kalyan: సింధు ప్రశంసలు.. పవన్ రిప్లై: ‘మ్యాజిక్’ డ్రెయిన్స్‌పై ఆసక్తికర చర్చ! Chandrababu: నేడు అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీ షెడ్యూల్! Mahanadu 2026: నెల్లూరు మహానాడుకు భారీ ఏర్పాట్లు- మంత్రి నారాయణ! Elections 2026: మరికాసేపట్లో కౌంటింగ్.. నాలుగు రాష్ట్రాల సమరం! నేడే తుది ఫలితాలు - ఎవరికి పట్టం?

Kandula Durgesh: వీరపాండ్య కట్టబొమ్మన పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన మంత్రి కందుల దుర్గేష్!

Kandula Durgesh: బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నిరంకుశత్వాన్ని ఎదిరించి, భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో విప్లవ జ్యోతిగా వెలిగిన వీరపాండ్య కట్టబొమ్మన పాత్రలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ అద్భుత నటనతో అలరించారు.

Published : 2026-03-06 21:40:00
  • సాంస్కృతిక కార్యక్రమంలో అదరగొట్టిన పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి దుర్గేష్..
     
  • ముఖ్యమంత్రి,సహచర ప్రజాప్రతినిధుల ప్రశంసల జల్లు..

Kandula Durgesh: బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నిరంకుశత్వాన్ని ఎదిరించి, భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో విప్లవ జ్యోతిగా వెలిగిన వీరపాండ్య కట్టబొమ్మన పాత్రలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ అద్భుత నటనతో అలరించారు. అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడిన అనంతరం, శుక్రవారం సాయంత్రం విజయవాడ పట్టణం పటమటలోని ఆంత్రలాక్స్ హాల్‌లో ప్రజాప్రతినిధుల కోసం  ఆంధ్రప్రదేశ్ “శాసన వ్యవస్థ” ఆధ్వర్యంలో నిర్వహించిన "ఆటవిడుపు"ఎమ్మెల్యే - ఎమ్మెల్సీ క్రీడా సాంస్కృతిక ఉత్సవాలు – 2026 కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ తనదైన శైలిలో ఈ ప్రదర్శన ఇచ్చారు.కట్టబొమ్మన విశిష్ట ఆహార్యం, గంభీరమైన వాచకం, రాజసంతో మంత్రి దుర్గేష్ ఆ పాత్రలో జీవించేశారు. ఆయన వేదికపైకి రాగానే సభలో చప్పట్ల వర్షం కురిసింది.ఈ ప్రదర్శనను వీక్షించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరియు సహచర మంత్రులు, ప్రజాప్రతినిధులు మంత్రి దుర్గేష్ నటనను వేనోళ్ల కొనియాడారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. "దేశభక్తికి నిలువెత్తు రూపం వీరపాండ్య కట్టబొమ్మన అని, పాంచాలకురిచ్చి యుద్ధంలో ఆయన చూపిన సాహసం చిరస్మరణీయమని" కొనియాడారు. అటువంటి మహనీయుడి పాత్రను పోషించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

మంత్రి కందుల దుర్గేష్ నటనా శైలి, సంభాషణల చాతుర్యం, పుణ్యభూమి నాదేశం నమోనమామి పాటలో ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు, మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యేలు వర్ల కుమార్ రాజా, సునీల్ కుమార్ తదితర సహచర ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రదర్శించిన తీరు సభికులను మంత్రముగ్ధులను చేసింది.

Spotlight

Read More →