Kollu Ravindra: భీమవరంలో జేడీకే డ్రోన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర! Promotions: ఏపీలో వారికి ఎడిషనల్ SP లుగా పదోన్నతులు... కీలక ఉత్తర్వులు జారీ! Chandrababu: పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు! ఎందుకో తెలుసా.? AP Census 2026: ఏపీలో ఏప్రిల్ 16 నుంచి గృహ గణన ప్రారంభం...‌ పూర్తి వివరాలు ఇవే! Indian Airports: సామాన్య ప్రయాణికులకు బంపర్ ఆఫర్! 57 విమానాశ్రయాల్లో సరికొత్త సౌకర్యాలను ప్రారంభించిన కేంద్రం.. చౌక ధరకే ఫుడ్! AP Government News: సంక్షేమం + అభివృద్ధి: ఏపీలో సరికొత్త పాలన.. చంద్రబాబు విజన్ ఇదే! AP Government: జీతంలో 50% పెన్షన్ గ్యారెంటీ.. యూపీఎస్ (UPS) విధివిధానాలను ఖరారు చేస్తూ జీవో జారీ.! ఉద్యోగులకు ఐచ్ఛికంగా కొత్త స్కీమ్! AP Government: ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ఆరోగ్యం, అభివృద్ధి లక్ష్యంగా వందల కోట్ల నిధుల విడుదల! AP Nominated posts: ఏపీలో ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్‌గా.. రాష్ట్ర హజ్ కమిటీ పునర్వ్యవస్థీకరణ.. 13 మంది కొత్తగా నియామకం! TIDCO Houses: గాజువాకలో టిడ్కో ఇళ్ల సందడి... పేదల సొంతింటి కల సాకారం! Kollu Ravindra: భీమవరంలో జేడీకే డ్రోన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర! Promotions: ఏపీలో వారికి ఎడిషనల్ SP లుగా పదోన్నతులు... కీలక ఉత్తర్వులు జారీ! Chandrababu: పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు! ఎందుకో తెలుసా.? AP Census 2026: ఏపీలో ఏప్రిల్ 16 నుంచి గృహ గణన ప్రారంభం...‌ పూర్తి వివరాలు ఇవే! Indian Airports: సామాన్య ప్రయాణికులకు బంపర్ ఆఫర్! 57 విమానాశ్రయాల్లో సరికొత్త సౌకర్యాలను ప్రారంభించిన కేంద్రం.. చౌక ధరకే ఫుడ్! AP Government News: సంక్షేమం + అభివృద్ధి: ఏపీలో సరికొత్త పాలన.. చంద్రబాబు విజన్ ఇదే! AP Government: జీతంలో 50% పెన్షన్ గ్యారెంటీ.. యూపీఎస్ (UPS) విధివిధానాలను ఖరారు చేస్తూ జీవో జారీ.! ఉద్యోగులకు ఐచ్ఛికంగా కొత్త స్కీమ్! AP Government: ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ఆరోగ్యం, అభివృద్ధి లక్ష్యంగా వందల కోట్ల నిధుల విడుదల! AP Nominated posts: ఏపీలో ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్‌గా.. రాష్ట్ర హజ్ కమిటీ పునర్వ్యవస్థీకరణ.. 13 మంది కొత్తగా నియామకం! TIDCO Houses: గాజువాకలో టిడ్కో ఇళ్ల సందడి... పేదల సొంతింటి కల సాకారం!

Ashok Babu: ప్రజా రాజధానిపై పగబట్టిన జగన్ సైకో ముఠా.. మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు!

Ashok Babu: రాజధాని అమరావతి విషయంలో వైసీపీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్ రావుల తీరును మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి పర్చూరి అశోక్ బాబు తీవ్రంగా తప్పుపట్టారు. గతంలో పెద్దలు చెప్పినట్లు "దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు" ఉంది వీరి ప్రెస్ మీట్ వ్యవహారం అని ఆయన ఎద్దేవా చేశారు.

Published : 2026-03-30 22:07:00
  • Politics: అప్పుడు గుర్తుకు రాని ప్రజా నిర్ణయం ఇప్పుడే గుర్తొచ్చిందా?
     
  • ఇంత చిన్న లాజిక్‌ను సీనియర్లైన బొత్స, ధర్మాన ఎలా మర్చిపోయారు?

Ashok Babu: రాజధాని అమరావతి విషయంలో వైసీపీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్ రావుల తీరును మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి పర్చూరి అశోక్ బాబు తీవ్రంగా తప్పుపట్టారు. గతంలో పెద్దలు చెప్పినట్లు "దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు" ఉంది వీరి ప్రెస్ మీట్ వ్యవహారం అని ఆయన ఎద్దేవా చేశారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానం రోజున అసెంబ్లీకి రమ్మంటే రాని వీరు, ఇప్పుడు బయట కూర్చొని మాట్లాడటం హాస్యాస్పదం. అసెంబ్లీలో మాట్లాడితే అది రికార్డుల్లో ఉంటుంది, ప్రజల గొంతుక అవుతుంది. కానీ 11 మంది ఉన్నామని భయపడి పారిపోయి, ఇప్పుడు సొంత మైకుల్లో మాట్లాడుకుంటే అది ప్రజల వాయిస్ ఎలా అవుతుంది? నాలుగు కోట్ల మంది ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు చట్టసభల్లో చేసే తీర్మానాన్ని గౌరవించాలని రాజ్యాంగం చెబుతోంది. ఇంత చిన్న లాజిక్‌ను సీనియర్లైన బొత్స, ధర్మాన ఎలా మర్చిపోయారు? ఆనాడు కౌన్సిల్ రద్దు చేయాలని మీరు తీర్మానం చేసినప్పుడు ఏ ప్రజలు కోరుకున్నారని చేశారు? అప్పుడు గుర్తుకు రాని ప్రజా నిర్ణయం ఇప్పుడే గుర్తొచ్చిందా? అమరావతిపై గతంలో మీరు వేసిన కులం ముద్ర, భూములు మునిగిపోతాయన్న ప్రచారం, గ్రాఫిక్స్ అన్న మాటలు.. అన్నీ అబద్ధాలని కాలం నిరూపించింది. 

రాజధానిని మార్చడానికి మీరు చెప్పిన ఒక్క కారణం కూడా నిలబడలేదు. అమరావతిని శ్మశానం అని అవహేళన చేసిన మీరు, అదే అసెంబ్లీలో కూర్చొని మూడు రాజధానుల తీర్మానం ఎలా చేశారు? దయ్యాలు చేసిన తీర్మానమా అది? లేక దేవతలు చేసిన తీర్మానమా? రాజధాని మార్చాలంటే బలమైన కారణం ఉండాలి.  ఔరంగజేబు రాజధాని మార్చి ప్రజలను, సైన్యాన్ని ఇబ్బంది పెట్టి చివరకు విఫలమయ్యాడు. బ్రిటిష్ వారు కలకత్తా నుండి ఢిల్లీకి మారడానికి పరిపాలనా సౌలభ్యం, భద్రత వంటి బలమైన కారణాలు ఉన్నాయి. కానీ ఒకసారి మారిన తర్వాత 1911 నుండి నేటికీ ఢిల్లీయే రాజధానిగా కొనసాగుతోంది. లోడీ వంశంలో అత్యంత శక్తివంతుడైన సికిందర్ లోడీ, రాజధానిని ఢిల్లీ నుండి ఆగ్రాకు మార్చాడు. 

ఇది అప్పట్లో ఒక సంచలన నిర్ణయం. అయితే దానికి బలమైన కారణాలున్నాయి. 1911 నుంచి నేటి వరకు ఢిల్లీని ఎవరైనా మార్చారా? మీరు ఆంధ్రప్రదేశ్‌కు రాజులు కాదు, ఇది ప్రజాస్వామ్యం. మీ ఇష్టం వచ్చినట్లు చేయడానికి కుదరదు. రాష్ట్రంలో డబ్బు లేదు అందుకే మూడు రాజధానులు అన్నాము అని చెప్పే మీరు, రుషికొండ మీద రూ. 600 కోట్లతో ప్యాలెస్ ఎలా కట్టారు? కనీసం ఒక్క పూట కూడా ఉండలేని ఆ భవనం కోసం ప్రజల సొమ్ము ఎందుకు తగలేశారు? రాజధాని విషయంలో వైసీపీ ఇప్పటికైనా స్పష్టమైన వైఖరి చెప్పాలి. పార్టీలో చర్చించి చెప్తామంటూ గోడ మీద పిల్లి వాటం ప్రదర్శించడం మీ రాజకీయ అపరిపక్వతకు నిదర్శనం. అమరావతికి చట్టబద్ధత కల్పించడాన్ని మీరు స్వాగతిస్తున్నారో లేదో ప్రజలకు సూటిగా చెప్పండి. 

అమరావతికి లక్ష కోట్లు అవుతాయని భయపెడుతున్నారు. పక్కనే ఉన్న హైదరాబాద్ విలువ ట్రిలియన్ డాలర్లు ఉంటుంది. అక్కడ ఒక అసెంబ్లీ కడితేనే రూ.700 కోట్లు అయ్యింది. అన్ని వసతులు ఉన్న చోటే అంత ఖర్చయితే, సున్నా నుండి నిర్మించే రాజధానికి రోడ్లు, డ్రైనేజీ, కరెంట్ వంటి మౌలిక సదుపాయాల కోసం ఖర్చు అవ్వదా? అది రాష్ట్రం మీద భారం కాదు, ఒక ఆస్తి సృష్టి (Asset Creation). అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా నిధులు సమకూర్చుకుంటుంది. అవసరమైనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అప్పు ఇచ్చి మరీ తిరిగి తీసుకునే వెసులుబాటు ఉంది.  గతంలో లోడీలు, ఔరంగజేబులు, తుగ్లక్‌లు చేసినట్లుగా ఇష్టం వచ్చినట్లు రాజధానులు మార్చే రోజులు పోయాయి. అందుకే భవిష్యత్తులో ఏ సైకో వచ్చినా మార్చడానికి వీల్లేకుండా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తున్నాం. మేము కొత్తగా రాజధానిని నిర్ణయించడం లేదు, ఉన్నదానికి రక్షణ కల్పిస్తున్నాం. 

చంద్రబాబు నాయుడు గారి మనవడు రేపు పెద్దయ్యాక 'మా తాత అద్భుతమైన రాజధాని కట్టాడు' అని గర్వంగా చెప్పుకుంటాడు. మరి మీ మనవళ్లు ఏమనుకోవాలి? 'మా తాత ఈ రాజధానిని శ్మశానం అన్నాడు.. మా తాతకు బుర్రలేదు' అని మీ మనవళ్లే మిమ్మల్ని తిట్టుకునే పరిస్థితి తెచ్చుకోకండి. మీరు కాకపోయినా మీ వారసులు ఈ రాష్ట్రంలోనే ఉండాలి కదా. కౌన్సిల్ రద్దు చేయాలని మీరు తీర్మానం చేసినప్పుడు ప్రజల దగ్గరకు వెళ్లారా? మీకు ఉన్న మెజార్టీనే ప్రాతిపదికగా తీసుకున్నారు కదా. ఇప్పుడు కూటమికి అంతకంటే ఎక్కువ అంటే 164 సీట్ల భారీ మెజార్టీ ఉంది. ఇదే ప్రజల ఆమోదం. రాజ్యాంగం చదువుకుంటే ఈ విషయం మీకు అర్థమవుతుంది. మీ నాయకుడు చెప్పాడని కుక్కను పిల్లి అని, పిల్లిని కుక్క అని వాదించడం మానుకోండి. మీ నాయకుడు సైకో కాబట్టి ప్రజావేదికను కూల్చాడు. మీరు అమరావతిని శ్మశానం అని ఏడ్చారు. కానీ 2027 నాటికి అమరావతి రూపురేఖలు చూసి మీరే పశ్చాత్తాపపడే రోజు వస్తుంది. 

అమరావతి అనేది కేవలం ఒక ప్రాంతం కాదు, అది భవిష్యత్ తరాల ఆస్తి. చంద్రబాబు గారి పథకాల్లో లోపాలు ఉంటే వేలెత్తి చూపండి, స్కామ్‌లు ఉంటే నిరూపించండి.. అంతే తప్ప రాష్ట్ర ప్రయోజనాల మీద పడి ఏడవకండి. కేవలం బటన్ నొక్కి పదివేలు ఇస్తే సరిపోదు, భావి తరాలకు ఒక రాజధానిని ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. రాజధాని అంటే రాష్ట్రానికి ఒక అందమైన చిరునామాలా ఉండాలి. కానీ మీరు దాన్ని ఒక రాజకీయ ఫుట్‌బాల్‌లా మార్చేశారు. మీకు కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేతగా మాట్లాడే హక్కు ఉంది, చట్టసభల్లోకి వచ్చి మీ అభిప్రాయం చెప్పండి. అంతేకానీ బయట కూర్చొని 'రాజధానిని మార్చే హక్కు ఉండాలి' అని పదే పదే అనడం ఏంటి? ఎన్నిసార్లు మారుస్తారు రాజధానిని? 1911 నుండి ఇప్పటి వరకు ఢిల్లీ రాజధానిగా మారలేదు. మద్రాస్ నుండి కర్నూలుకు ఎందుకు రావాల్సి వచ్చిందో మీకు తెలియదా? అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగం వల్ల, భాషా సంయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ఆనాడు కర్నూలును రాజధానిగా చేసుకున్నాం. అక్కడ భవనాలు కట్టాం, గుంటూరులో హైకోర్టు పెట్టాం. 

ఆ తర్వాత అభివృద్ధి చెందిన హైదరాబాద్‌ను ఆంధ్రప్రదేశ్‌లో కలిపాం కాబట్టి అక్కడికి వెళ్లాం. ఆ తేడా కూడా మీకు తెలియకపోతే ఎలా? విభజన తర్వాత హైదరాబాద్ నుండి బయటకు వచ్చాక, మనందరం కలిసి ఏకగ్రీవంగా అమరావతిని ఎంచుకున్నాం. ఆనాడు మీరు కూడా దీన్ని సమర్థించారు కదా. మరి అధికారంలోకి రాగానే మాట మార్చడం ఏంటి? రాజధానిలో ఏదో లగ్జరీగా కట్టేస్తున్నారని, అడుగు పదివేలని మీరు చేసిన ఆరోపణలు ఒక్కటైనా రుజువు చేయగలిగారా? మీలాంటి ప్రభుత్వాలు భవిష్యత్తులో మళ్లీ వచ్చి రాజధానితో ఆటలాడకూడదనే ఉద్దేశంతోనే మేము అమరావతికి చట్టబద్ధత కల్పిస్తున్నాం. రాజధాని మార్పు అనేది అంత తేలికగా కాకుండా, కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండేలా తీర్మానం చేశాం. మేము కొత్తగా రాజధానిని నిర్ణయించడం లేదు, ఉన్న రాజధానిని కాపాడుతున్నాం. మీరు సీనియర్ నాయకులు. రేపు మీ వారసులు కూడా రాజకీయాల్లోకి వస్తారు. రాబోయే తరాలు అమరావతిని చూసి గర్వపడేలా ఉండాలి కానీ, 'మా తాతలు ఈ అద్భుత నగరాన్ని శ్మశానం అని తిట్టారు' అని తలదించుకునేలా చేయకండి. 

బొత్స గారు గత చరిత్రను తప్పుగా వాడుతున్నారు. 1953లో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం వేరు, 1956లో ఏర్పడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వేరు, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ వేరు. వేర్వేరు రాష్ట్రాలు ఏర్పడినప్పుడు రాజధానులు మారాయి తప్ప, ఒకే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన ప్రతిసారీ రాజధానిని మార్చడం ఎక్కడా జరగదు. ఈ అరాచకానికి తావులేకుండానే చంద్రబాబు గారు అమరావతికి చట్టబద్ధత కల్పిస్తున్నారు. రాజధాని కట్టడానికి డబ్బులు లేవని చెప్పే మీరు, రుషికొండపై రూ. 600 కోట్లు పెట్టి ప్యాలెస్ ఎలా కట్టారు? ఆ డబ్బుతో అమరావతిలో అద్భుతమైన ఐకానిక్ భవనాలు వచ్చేవి కదా! ప్రజల సొమ్మును విలాసాలకు తగలేసి, ఇప్పుడు నీతులు చెప్పడం మీకే చెల్లింది. వికేంద్రీకరణ అంటే మూడు రాజధానులు ముక్కలు చేయడం కాదు. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్, అనంతపురంలో కియా మోటార్స్, రాయలసీమలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్, ప్రకాశంలో సోలార్ పరిశ్రమలు.. ఇలా ప్రతి జిల్లాకు ఉన్న వసతులను బట్టి పరిశ్రమలు తేవడమే అసలైన అభివృద్ధి. 

రేపు వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం జిల్లా కూడా కృష్ణా జిల్లా మాదిరిగా సస్యశ్యామలం అవుతుంది. అభివృద్ధి ఎలా చేయాలో, రాజధానిని ఎలా నిర్మించాలో చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం నాయకత్వానికి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఉత్తరాంధ్ర నాయకుడిగా ఉండి కూడా ఆ ప్రాంత అభివృద్ధికి మీరు చేసిందేమీ లేదు. సీనియర్ నాయకులుగా ఉండి ఇలాంటి పసలేని స్టేట్‌మెంట్లు ఇచ్చి మీకున్న గౌరవాన్ని తగ్గించుకోవద్దు. మేము కొత్తగా రాజధానిని సృష్టించడం లేదు, ఉన్న అమరావతికి చట్టబద్ధత కల్పించి రక్షణ ఇస్తున్నాం. దీన్ని గమనించి బాధ్యతగా ప్రవర్తించండి.

Spotlight

Read More →