Kollu Ravindra: భీమవరంలో జేడీకే డ్రోన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర! Promotions: ఏపీలో వారికి ఎడిషనల్ SP లుగా పదోన్నతులు... కీలక ఉత్తర్వులు జారీ! Chandrababu: పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు! ఎందుకో తెలుసా.? AP Census 2026: ఏపీలో ఏప్రిల్ 16 నుంచి గృహ గణన ప్రారంభం...‌ పూర్తి వివరాలు ఇవే! Indian Airports: సామాన్య ప్రయాణికులకు బంపర్ ఆఫర్! 57 విమానాశ్రయాల్లో సరికొత్త సౌకర్యాలను ప్రారంభించిన కేంద్రం.. చౌక ధరకే ఫుడ్! AP Government News: సంక్షేమం + అభివృద్ధి: ఏపీలో సరికొత్త పాలన.. చంద్రబాబు విజన్ ఇదే! AP Government: జీతంలో 50% పెన్షన్ గ్యారెంటీ.. యూపీఎస్ (UPS) విధివిధానాలను ఖరారు చేస్తూ జీవో జారీ.! ఉద్యోగులకు ఐచ్ఛికంగా కొత్త స్కీమ్! AP Government: ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ఆరోగ్యం, అభివృద్ధి లక్ష్యంగా వందల కోట్ల నిధుల విడుదల! AP Nominated posts: ఏపీలో ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్‌గా.. రాష్ట్ర హజ్ కమిటీ పునర్వ్యవస్థీకరణ.. 13 మంది కొత్తగా నియామకం! TIDCO Houses: గాజువాకలో టిడ్కో ఇళ్ల సందడి... పేదల సొంతింటి కల సాకారం! Kollu Ravindra: భీమవరంలో జేడీకే డ్రోన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర! Promotions: ఏపీలో వారికి ఎడిషనల్ SP లుగా పదోన్నతులు... కీలక ఉత్తర్వులు జారీ! Chandrababu: పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు! ఎందుకో తెలుసా.? AP Census 2026: ఏపీలో ఏప్రిల్ 16 నుంచి గృహ గణన ప్రారంభం...‌ పూర్తి వివరాలు ఇవే! Indian Airports: సామాన్య ప్రయాణికులకు బంపర్ ఆఫర్! 57 విమానాశ్రయాల్లో సరికొత్త సౌకర్యాలను ప్రారంభించిన కేంద్రం.. చౌక ధరకే ఫుడ్! AP Government News: సంక్షేమం + అభివృద్ధి: ఏపీలో సరికొత్త పాలన.. చంద్రబాబు విజన్ ఇదే! AP Government: జీతంలో 50% పెన్షన్ గ్యారెంటీ.. యూపీఎస్ (UPS) విధివిధానాలను ఖరారు చేస్తూ జీవో జారీ.! ఉద్యోగులకు ఐచ్ఛికంగా కొత్త స్కీమ్! AP Government: ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ఆరోగ్యం, అభివృద్ధి లక్ష్యంగా వందల కోట్ల నిధుల విడుదల! AP Nominated posts: ఏపీలో ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్‌గా.. రాష్ట్ర హజ్ కమిటీ పునర్వ్యవస్థీకరణ.. 13 మంది కొత్తగా నియామకం! TIDCO Houses: గాజువాకలో టిడ్కో ఇళ్ల సందడి... పేదల సొంతింటి కల సాకారం!

AP Fishermen Welfare: మత్స్యకారులకు అండగా ప్రభుత్వం... ప్రత్యేక గస్తీ బోట్లు మంజూరు చేసిన సీఎం.!

Nellore Coast Guard: నాయుడుపేట సభలో సీఎం చంద్రబాబు మత్స్యకారులకు భారీ భరోసా ఇచ్చారు. పొరుగు రాష్ట్రాల జాలర్ల అక్రమ వేటను అరికట్టేందుకు నెల్లూరు తీరానికి గస్తీ బోట్లు మంజూరు చేస్తూ, వేట నిషేధ కాలపు భృతిని రూ. 20 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు

Published : 2026-03-30 19:15:00

Naidupeta Public Meeting: నాయుడుపేట వేదికగా జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్థానిక మత్స్యకారుల ప్రయోజనాలే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. మత్స్యకారుల పొట్టకొట్టే ఏ శక్తినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని, ముఖ్యంగా పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే జాలర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఏపీ జలాల్లో ఇతర రాష్ట్రాల వారు చేపల వేట సాగించడం వల్ల ఇక్కడి జాలర్లు తీవ్రంగా నష్టపోతున్నారని, ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు.

ముఖ్యంగా నెల్లూరు తీర ప్రాంతంలో అక్రమ వేటను అరికట్టేందుకు తక్షణమే రెండు గస్తీ బోట్లను  మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. అవసరమైతే భవిష్యత్తులో మరిన్ని బోట్లను రంగంలోకి దించి తీరప్రాంత నిఘాను మరింత పటిష్టం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం తీరప్రాంత రక్షణను గాలికి వదిలేసిందని, తాము గతంలో ఏర్పాటు చేసిన 20 బోట్లలో 12 బోట్లను నాశనం చేశారని ఆయన విమర్శించారు. మత్స్యకారుల రక్షణ కోసం ప్రభుత్వం నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని బాధ్యత తీసుకున్నారు.

స్థానిక జాలర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని నెల్లూరు  తిరుపతి జిల్లాల కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. తమిళనాడు, పుదుచ్చేరి వంటి పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే జాలర్లు మన సరిహద్దుల్లోకి రాకుండా పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. మన సముద్ర సంపద కేవలం మన మత్స్యకారులకే దక్కాలని, ఇతర ప్రాంతాల వారు వచ్చి ఇక్కడి వారి జీవనోపాధిని దెబ్బతీయడం ఏమాత్రం సరైంది కాదని ఆయన స్పష్టం చేశారు.

మత్స్యకారుల సంక్షేమంపై దృష్టి సారించిన ప్రభుత్వం, వేట నిషేధ సమయంలో ఇచ్చే భృతిని భారీగా పెంచిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. 'మత్స్యకారుల భరోసా' పథకం కింద గతంలో ఉన్న మొత్తాన్ని రూ. 20 వేలకు పెంచామని, దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.29 లక్షల మత్స్యకార కుటుంబాలకు దాదాపు రూ. 259 కోట్ల ఆర్థిక సాయం నేరుగా అందుతుందని తెలిపారు. గడిచిన ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల హక్కులను కాలరాస్తూ తెచ్చిన వివాదాస్పద 217 జీవోను కూడా రద్దు చేశామని ఆయన ప్రకటించారు.

రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతం మత్స్యకారుల పాలిట వరమని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీఎం పిలుపునిచ్చారు. మత్స్యకారులకు అన్యాయం జరగకుండా అండగా ఉంటానని, వారి ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. నాయుడుపేట సభలో సీఎం చేసిన ఈ ప్రకటనలు స్థానిక మత్స్యకార వర్గాల్లో కొత్త ఆశలు చిగురింపజేశాయి.

Spotlight

Read More →