NRI TDP ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు..
ఉత్సాహంగా పాల్గొన్న కూటమి కార్యకర్తలు..
అమెరికాలోని సెయింట్ లూయిస్ నగరంలో NRI TDP విభాగం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడం జరిగింది.
ఉదయం రక్తదాన శిబిరంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం రక్తదానం చేసిన దాతలకు పార్టీ తరఫున టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రశంసాపత్రాలు అందజేశారు.
పసుపుదళం మరియు కూటమి కార్యకర్తల కోలాహలం మధ్య జన్మదిన వేడుకలు ఎంతో ఉత్సాహంగా జరిగాయి. విదేశాల్లో ఉన్నప్పటికీ, చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని తమ ఇంటి పండుగలా జరుపుకోవడం చూస్తే, దేశం దాటినా పార్టీపై, చంద్రబాబు గారి కుటుంబంపై అభిమానుల ప్రేమ ఏమాత్రం తగ్గలేదని స్పష్టమవుతోంది.
ఈ వేడుకల్లో NRITDP సభ్యులు చెంచు వేణుగోపాల్ రెడ్డి (అధికార ప్రతినిధి), సురేన్ పాతూరి (TANA సభ్యులు), రాజా సూరపనేని (TANA రీజినల్ కోఆర్డినేటర్), కిషోర్ ఎర్రపోతిన, రవి పొట్లా, సుధాకర్ నర్రా, వంశీ పాతూరి, వీరా, నాగకుమార్ బెల్లంకొండ, వెంకట్ గౌని, మురళి పుట్టగంటి, జనసేన నాయకులు విజయ్ సాక్షి, సత్య తదితరులు పాల్గొన్నారు. అలాగే వందల సంఖ్యలో కూటమి అభిమానులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
చంద్రబాబు నాయుడు గారు చేపడుతున్న రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు, అమరావతి నిర్మాణానికి ఎన్నారైల తరఫున పూర్తి మద్దతు ఉంటుందని కూటమి సభ్యులు ఈ సందర్భంగా ప్రకటించారు.