అర్జున్దాస్పై ఆరోపణల విచారణకు సుప్రీంకోర్టు ఆదేశం..
అర్జున్దాస్కు మఠాధిపతి హోదా కొనసాగింపు..
హతీరామ్జీ మఠం కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మఠానికి సంబంధించిన వివాదాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం పలు ముఖ్యమైన ఆదేశాలు జారీ చేయడంతో ఈ వ్యవహారం మళ్లీ చర్చనీయాంశంగా మారింది.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, అర్జున్దాస్పై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి ఏడాది లోపు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ కేసులో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో అర్జున్దాస్కు హతీరామ్జీ మఠాధిపతి హోదా కొనసాగనుంది.
అలాగే ఆరోపణలపై పారదర్శకంగా విచారణ జరిపేందుకు రిటైర్డ్ జడ్జి వడ్డేపల్లి రామారావు ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మఠానికి సంబంధించిన అంశాలను పరిశీలించి నివేదిక ఇవ్వనుంది.
మఠం ఆస్తుల పరిరక్షణ, పర్యవేక్షణ కోసం మరో ప్రత్యేక కమిటీని కూడా సుప్రీంకోర్టు నియమించింది. జస్టిస్ దుప్పల వెంకటరమణ నేతృత్వంలో ఈ కమిటీ పనిచేయనుంది. మఠ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. ఈ తీర్పుతో హతీరామ్జీ మఠం వ్యవహారంలో కొత్త మలుపు తిరిగింది. మఠానికి సంబంధించిన వివాదాలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.