NDMA: నేడు మొబైల్‌లో హెచ్చరిక శబ్దం వినిపించినా భయపడవద్దు.. ఇది టెస్ట్‌ అలర్ట్‌ మాత్రమే! Gurjit Singh: 300 అడుగుల ఎత్తులో 560 రోజులు పోరాటం... మృత్యువుతో ప్రతిరోజూ చెలగాటం.. Indian Railway: రైళ్లకు కూడా రిటైర్మెంట్.. ఎప్పుడో తెలుసా? ఐసీఎఫ్‌, ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల జీవితకాలంపై ఆసక్తికర విశేషాలు. ABN journalist Murder: చిత్తూరులో కలకలం.. ఏబీఎన్ జర్నలిస్ట్ కత్తులతో దారుణ హత్య.. Wildlife Secrets: బద్ధకానికే బ్రాండ్ అంబాసిడర్ ఈ జీవి.. రోజుకు 20 గంటల నిద్ర... తిన్న తిండి అరగడానికి నెల రోజులు!! Hikkim Post Office: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోస్టాఫీస్.. ఇక్కడి నుంచి ప్రియమైన వారికి పోస్ట్‌కార్డుల సందడి.! L R Swamy: సాహిత్య లోకంలో విషాదం... ప్రముఖ సాహితీవేత్త ఎల్.ఆర్.స్వామి కన్నుమూత! Rajamahendravaram: అటవీశాఖ హై అలర్ట్.. రాజమండ్రి పరిసరాల్లో నిరంతర గస్తీ.. పులి కదలికలపై ప్రత్యేక నిఘా.. Rare birth: ప్రకృతి వైచిత్రం - కాలజ్ఞానంలో చెప్పిన వింతలేనా? పంది కడుపున గజరాజు.. చూసేందుకు పోటెత్తిన జనం! Kumbh Mela beauty: మా అమ్మాయి మైనరే.. మోనాలిసా భోస్లే పెళ్లిపై తల్లి సంచలన వ్యాఖ్యలు.. ఫర్మాన్ ఖాన్‌పై కేసు! NDMA: నేడు మొబైల్‌లో హెచ్చరిక శబ్దం వినిపించినా భయపడవద్దు.. ఇది టెస్ట్‌ అలర్ట్‌ మాత్రమే! Gurjit Singh: 300 అడుగుల ఎత్తులో 560 రోజులు పోరాటం... మృత్యువుతో ప్రతిరోజూ చెలగాటం.. Indian Railway: రైళ్లకు కూడా రిటైర్మెంట్.. ఎప్పుడో తెలుసా? ఐసీఎఫ్‌, ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల జీవితకాలంపై ఆసక్తికర విశేషాలు. ABN journalist Murder: చిత్తూరులో కలకలం.. ఏబీఎన్ జర్నలిస్ట్ కత్తులతో దారుణ హత్య.. Wildlife Secrets: బద్ధకానికే బ్రాండ్ అంబాసిడర్ ఈ జీవి.. రోజుకు 20 గంటల నిద్ర... తిన్న తిండి అరగడానికి నెల రోజులు!! Hikkim Post Office: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోస్టాఫీస్.. ఇక్కడి నుంచి ప్రియమైన వారికి పోస్ట్‌కార్డుల సందడి.! L R Swamy: సాహిత్య లోకంలో విషాదం... ప్రముఖ సాహితీవేత్త ఎల్.ఆర్.స్వామి కన్నుమూత! Rajamahendravaram: అటవీశాఖ హై అలర్ట్.. రాజమండ్రి పరిసరాల్లో నిరంతర గస్తీ.. పులి కదలికలపై ప్రత్యేక నిఘా.. Rare birth: ప్రకృతి వైచిత్రం - కాలజ్ఞానంలో చెప్పిన వింతలేనా? పంది కడుపున గజరాజు.. చూసేందుకు పోటెత్తిన జనం! Kumbh Mela beauty: మా అమ్మాయి మైనరే.. మోనాలిసా భోస్లే పెళ్లిపై తల్లి సంచలన వ్యాఖ్యలు.. ఫర్మాన్ ఖాన్‌పై కేసు!

Rajahmundry: కలుషిత పాలే కారణమా? రాజమహేంద్రవరంలో మిస్టరీ వ్యాధిపై కొనసాగుతున్న విచారణ.!

Contaminated Milk in Rajahmundry: రాజమహేంద్రవరంలో అనూరియా వ్యాధి ప్రభావంతో నలుగురు మరణించడం స్థానికంగా కలకలం రేపుతోంది. కలుషిత పాల వల్లే ఈ సమస్య తలెత్తిందనే అనుమానంతో అధికారులు డెయిరీలను సీజ్ చేసి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు..

Published : 2026-02-23 12:23:00
  • శాంపిల్స్ సేకరణ - ఫలితాల కోసం నిరీక్షణ..
     
  • పాలు, పెరుగుపై అనుమానాలు..
     
  • అందుబాటులో కంట్రోల్ రూమ్..

Contaminated Milk in Rajahmundry: రాజమహేంద్రవరం నగరంలో అకస్మాత్తుగా వెలుగుచూసిన అనూరియా సమస్య ప్రజలను భయాందోళనకు  గురిచేస్తుంది. బాధితుల్లో మూత్రపిండాల పనితీరు మందగించడం, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు మీడియా సమావేశం నిర్వహించి, వ్యాధి నిర్ధారణ కోసం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఇప్పటివరకు ఈ వ్యాధి ప్రభావంతో తాడి కృష్ణవేణి, తాడి రమణి, రాధాకృష్ణమూర్తి, శేషగిరిరావు అనే నలుగురు మరణించినట్లు అధికారులు అధికారికంగా ధ్రువీకరించారు.

ఈ అనారోగ్య సమస్యలకు కలుషిత పాలే కారణమని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫుడ్ సేఫ్టీ విభాగం రంగంలోకి దిగి పాలు, పెరుగు నమూనాలను సేకరించింది. మొత్తం 42 మంది రైతుల నుంచి పాల సేకరణ జరుగుతుండగా, అనుమానిత పాల వ్యాపారిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యాపారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా, అనధికారికంగా నడుపుతున్న ఒక డెయిరీని అధికారులు సీజ్ చేశారు.

వ్యాధి మూలాలను కనుగొనేందుకు అధికారులు ఇప్పటివరకు 73 రకాల శాంపిల్స్ సేకరించారు. వీటిలో బాధితుల రక్త నమూనాలతో పాటు, వారు వాడిన ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. ఈ రోజు సాయంత్రానికి ల్యాబ్ ఫలితాలు వచ్చే అవకాశం  ఉండనుంది. ఆ నివేదికలు వస్తేనే అసలు సమస్య ఎక్కడ ఉందో స్పష్టత వస్తుంది అని అధికారులు తెలిపారు. వైద్య నిపుణుల బృందం విజయవాడ నుంచి కూడా రాజమహేంద్రవరం చేరుకుంది. వీరు స్థానిక వైద్యులతో కలిసి వ్యాధి లక్షణాలను, చికిత్స విధానాలను సమీక్షిస్తున్నారు.

ప్రస్తుతం ఆస్పత్రుల్లో 8 మంది చికిత్స పొందుతున్నారు. అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ సిబ్బంది ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంట్లోనూ ఎవరికైనా అనారోగ్య లక్షణాలు ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరి నుంచి రక్త నమూనాలను సేకరిస్తున్నారు. ప్రజలు భయపడాల్సిన పనిలేదని అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎవరికైనా నీరసం, మూత్ర విసర్జనలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.

ప్రజల సహాయార్థం అధికారులు ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఆరోగ్య పరంగా ఎలాంటి సందేహాలు ఉన్నా లేదా ఎవరైనా అనారోగ్యానికి గురైనా వెంటనే 94940 60060 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని, బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామని  స్పష్టం చేశారు.

Spotlight

Read More →